India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దౌత్య వివాదంలో కెనడాకే అమెరికా మద్దతిచ్చింది. అది చేసిన ఆరోపణలు అత్యంత సీరియస్ అని, వాటిని భారత్ ఇంకా సీరియస్‌గా తీసుకొని దర్యాప్తునకు సహకరించాలని నీతులు చెప్పింది. తాము ఒకటి అనుకుంటే భారత్ ప్రత్యామ్నాయ దారి ఎంచుకుందని US DEPT అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చెప్పారు. రెండు దేశాల పరస్పర ఆరోపణలపై తానేమీ చెప్పలేనన్నారు. ఆరోపణలపై తాజా స్టేటస్ అడగ్గా దీనిపై ఆ రెండు దేశాలే స్పందించాల్సి ఉందన్నారు.

TG: రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి 10 నెలల్లో రూ.80,500 కోట్ల అప్పులు చేసినట్లు KTR ఆరోపించారు. ‘అప్పు తప్పు అన్నోళ్లని ఇప్పుడు దేనితో కొట్టాలి? ఎన్నికల హామీలేవీ తీర్చలేదు. ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు. మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు? ఎవరి జేబులోకి వెళ్లినట్టు? కమీషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా? BRS హయాంలో అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టాం’ అని పేర్కొన్నారు.

AP: రాష్ట్రంలో భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నెల్లూరు సహా పలు జిల్లాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించాలని సూచించారు. కాగా వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

AP: రాష్ట్ర ప్రభుత్వ, అనుబంధ ఇంటర్ కాలేజీల్లో నేటి నుంచి ఒక గంట అదనంగా క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సా.4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. తాజాగా సాయంత్రం 5 గంటలకు పొడిగించాలని తెలిపింది. ఈ క్రమంలో విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్ చేసేందుకు అదనపు సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.

కంపెనీ నచ్చకో, మంచి జీతంతో మరో ఉద్యోగం వస్తేనో ప్రస్తుతం పనిచేస్తోన్న కంపెనీకి రాజీనామా చేస్తుంటారు. ఆ సమయంలో బాస్‌కి రిజిగ్నేషన్ లెటర్ సమర్పిస్తుంటారు. అయితే, ఓ వ్యక్తి తనకు కొత్త కంపెనీ నచ్చకపోతే మళ్లీ తిరిగొస్తానంటూ రాసిన రాజీనామా లేఖ వైరలవుతోంది. ‘నాకు ఓ కంపెనీలో జాబ్ వచ్చింది. అక్కడికి వెళ్లి ఎలా ఉంటుందో అనుభూతి చెందుతా. నచ్చకపోతే మళ్లీ వచ్చేస్తా’ అని లెటర్‌లో ఉంది.

ఇండియాపై దౌత్యపరమైన ఆంక్షలు విధించాలని కెనడాలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ (NDP) లీడర్, ఎంపీ జగ్మీత్ సింగ్ అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కెనడాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ను బ్యాన్ చేయాలని ప్రధాని జస్టిన్ ట్రూడోని కోరారు. భారత హై కమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తలను కెనడా బహిష్కరించడాన్ని సమర్థించారు. భారత ఏజెంట్లు కెనడాలోని సిక్కులపై దాడులు చేస్తున్నారని సింగ్ ఫైరయ్యారు.

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు(D) జలదంకిలో అత్యధికంగా 23.5 cm, విడవలూరులో 20.6 cm, అల్లూరులో 19.7 cm, కావలిలో 18.7 cm, బోగోలులో 18.2 cmల వర్షపాతం నమోదైంది. రేపు వాయుగుండం తీరం దాటే అవకాశం ఉండటంతో అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు.

బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం టైటిల్‌ను అనౌన్స్ చేశారు. బ్లాక్‌బస్టర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ-2 తాండవం’ రానున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ట్వీట్ చేసింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని పేర్కొంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించనుండగా బాలకృష్ణ కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు.

TG: ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించిన ఘటన కరీంనగర్(D) జమ్మికుంటలో జరిగింది. రాజు-జమున కుమార్తె ఉక్కులు(5) నిన్న ఉదయం కళ్లు తిరుగుతున్నాయని చెప్పింది. చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా హన్మకొండకు రిఫర్ చేశారు. అక్కడ వైద్యులు పరీక్షిస్తుండగా ఉక్కులు చనిపోయింది. ఆమెకు పుట్టినప్పటి నుంచే గుండె సంబంధిత సమస్య ఉండొచ్చని, పేరెంట్స్ గుర్తించకపోవడంతో మృతి చెంది ఉంటుందని వైద్యులు తెలిపారు.

దేశంలో ఎక్కువ భాగాలకు నైరుతి రుతుపవనాల వల్ల జూన్-అక్టోబర్ వరకు వర్షాలు కురుస్తాయి. అయితే పశ్చిమ కనుమల వల్ల నైరుతి రుతుపవనాలు తమిళనాడు తూర్పు తీరానికి విస్తరించలేవు. ఫలితంగా అక్కడ పొడి వాతావరణం ఉంటుంది. నైరుతి రుతుపవనాలు OCTలో హిమాలయాలను తాకి వెనుదిరుగుతాయి. వాటినే ఈశాన్య రుతుపవనాలు అంటారు. ఇవి తమిళనాడుతో పాటు మధ్య, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో DEC వరకు వర్షాలను కురిపిస్తాయి.
Sorry, no posts matched your criteria.