News November 2, 2024

అది మీకు మూడే ఛాప్టర్ లోకేశ్: వైసీపీ

image

AP: త్వరలోనే రెడ్‌బుక్ మూడో ఛాప్టర్ తెరుస్తానని మంత్రి లోకేశ్ చేసిన <<14502154>>హెచ్చరికలపై<<>> వైసీపీ Xలో సెటైర్లు వేసింది. ‘మూడో ఛాప్టర్ కాదు నిక్కర్ మంత్రి.. అది మీకు మూడే ఛాప్టర్. అడ్డదారిలో అధికారంలోకి వచ్చి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు. మీ MLAలు, అనుచరులు పోలీసులను బానిసలుగా చూడటాన్ని పట్టించుకోలేదనుకుంటున్నారా? మీ అన్ని ఛాప్టర్‌లు క్లోజ్ అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది గుర్తుంచుకోండి’ అని పేర్కొంది.

News November 2, 2024

రోహిత్‌ను వెనక్కి నెట్టిన జైస్వాల్.. సరికొత్త రికార్డ్

image

టెస్టుల్లో యశస్వీ జైస్వాల్ సరికొత్త ఘనత సాధించారు. 25 ఇన్నింగ్సుల తర్వాత అత్యధిక రన్స్ చేసిన భారత ఓపెనర్‌గా నిలిచారు. 1,402 పరుగులతో జైస్వాల్ టాప్‌లో ఉండగా, ఆ తర్వాత రోహిత్ శర్మ(1,324), సునీల్ గవాస్కర్(1,301), మయాంక్ అగర్వాల్(1,247), కేఎల్ రాహుల్(1,145), సెహ్వాగ్(1,132), ధావన్(1,130) ఉన్నారు. కాగా కివీస్‌తో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 30 రన్స్ చేశారు.

News November 2, 2024

ఆనంద్ బయోపిక్‌కు ఏఎల్ విజయ్ డైరెక్షన్

image

ప్రముఖ చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్క‌నున్న‌ బయోపిక్‌కు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించనున్న‌ట్టు తెలుస్తోంది. ఈ బయోపిక్‌ స్క్రిప్ట్‌ను ‘బిన్నీ అండ్ ఫ్యామిలీ’ రచయిత, దర్శకుడు సంజయ్ త్రిపాఠీ అందిస్తున్న‌ట్టు స‌మాచారం. ఐదు సార్లు ప్రపంచ చెస్‌ ఛాంపియన్ అయిన ఆనంద్ పాత్రను దక్షిణాది నుంచి ఓ ప్రముఖ నటుడు పోషిస్తారని కోలీవుడ్ వ‌ర్గాలు తెలిపాయి.

News November 2, 2024

English Learning: Antonyms

image

✒ Captivity× Freedom, Liberty
✒ Captivate× Disillusion offend
✒ Chaste× Sullied, Lustful
✒ Cease× Begin, Originate
✒ Compassion× Cruelty, Barbarity
✒ Chastise× Cheer, encourage
✒ Concede× Deny, reject
✒ Comprise× Reject, lack
✒ Consent× Object Disagree

News November 2, 2024

విజయనగరం ‘స్థానిక’ ఎమ్మెల్సీ స్థానానికి 4న నోటిఫికేషన్

image

AP: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా MLC నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈ నెల 4న EC నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. 11 వరకు నామినేషన్లు స్వీకరణ, 12న పరిశీలన ఉంటుంది. నవంబర్‌ 28న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్‌ 1న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇందుకూరి రఘురాజు టీడీపీలో చేరడంతో మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో బై ఎలక్షన్ అనివార్యమైంది.

News November 2, 2024

గవర్నర్ ప్రతిభా అవార్డులు.. నేటి నుంచి దరఖాస్తులు

image

TG: ఏటా 4 రంగాల ప్రముఖులకు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ నిర్ణయించారు. పర్యావరణం, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో ఉత్తమ సేవలు అందించినవారికి అవార్డులు ఇస్తారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు https://governor.telangana.gov.in/లో అప్లై చేసుకోవచ్చు. అవార్డు కింద ₹2L, జ్ఞాపిక ఇవ్వనున్నట్లు గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

News November 2, 2024

సుమతీ నీతి పద్యం: విచక్షణ కలిగినవారు ఎవరు?

image

వినదగు నెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
తాత్పర్యం: ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడకుండా నిదానంగా ఆలోచించాలి. ఆ తర్వాత సత్యమేదో, అసత్యమేదో తెలుసుకున్నవారే విచక్షణ కలిగినవారు అని భావం.

News November 2, 2024

బీజేపీ రెబ‌ల్స్‌కు శివ‌సేన‌, ఎన్సీపీ టిక్కెట్లు

image

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో 16 మంది BJP రెబ‌ల్స్‌కు శివ‌సేన, NCP టిక్కెట్లు కేటాయించాయి. టిక్కెట్లు పొందని BJP నేత‌లు ఆ పార్టీని వీడి మ‌హాయుతి మిత్ర‌ప‌క్షాలైన శివ‌సేన, NCPలో చేరారు. ఈ 16 మందిలో 12 మందికి షిండే, న‌లుగురికి అజిత్ టిక్కెట్లు క‌ట్ట‌బెట్టారు. దీంతో బీజేపీ రెబల్స్ వల్ల మ‌హాయుతికి న‌ష్టం క‌ల‌గ‌కుండా మిత్ర‌పక్షాలు త‌మ వైపు తిప్పుకున్నాయి. అయితే, వారిని BJPనే పంపిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

News November 2, 2024

నవంబర్ 2: చరిత్రలో ఈరోజు

image

✒ 1865: సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
✒ 1950: ప్రఖ్యాత రచయిత జార్జి బెర్నార్డ్ షా మరణం
✒ 1962: సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ మరణం
✒ 1965: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ జననం
✒ 2000: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాముల నివాసం మొదలు
✒ 2012: కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణం
✒ 2015: నటుడు కొండవలస లక్ష్మణరావు మరణం

News November 2, 2024

త్వరలో టిడ్కో ఇళ్ల పంపిణీ: మంత్రి డోలా

image

AP: పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు. దీపం పథకం కింద 1.43 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించామని ఒంగోలులో తెలిపారు. దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. త్వరలోనే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.