India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఈ నెల 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కానుందని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. తొలుత ఇళ్ల స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. రెండో విడతలో స్థలం లేనివారికి స్థలమిచ్చి రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని పేర్కొంది. ప్రత్యేక యాప్‌లో లబ్ధిదారుల వివరాలు వెల్లడిస్తామంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప-2’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం ముగింపు దశకు చేరుకుందని, కేవలం స్పెషల్ సాంగ్ చిత్రీకరణ మిగిలి ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో శ్రద్ధా కపూర్‌తో పాటు శ్రీలీల కూడా కనిపించనున్నారని, ఈ వారంలోనే షూటింగ్ జరుగుతుందని సమాచారం.

భారత్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ టీమ్‌ను మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభినందించారు. భారత జట్టుకు టర్నింగ్ పిచ్‌లే శత్రువులుగా మారుతున్నాయని అన్నారు. ‘టీమ్‌ఇండియా మెరుగైన పిచ్‌లపై ఆడాలని చాలా ఏళ్ల నుంచి చెబుతున్నా. ఈ టర్నింగ్ పిచ్‌లు ప్రతి బ్యాటర్‌ను చాలా సాధారణంగా కనిపించేలా చేస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.

సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనను బిహార్ బీజేపీ నేతలు స్వాగతించారు. బిహార్‌లో కూడా ఈ తరహా వింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నీరజ్ బాబు పేర్కొన్నారు. అయితే ఇది క్షేత్రస్థాయి పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న ప్రయత్నాలని, వీరందరూ నకిలీ సనాతనీయులని RJD నేత మృత్యుంజయ్ తివారీ విమర్శించారు.

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దంటూ ఉద్యమిస్తున్న కార్మిక సంఘాలను అనకాపల్లి(D)లో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు <<14521702>>ప్రకటన<<>> కలవరపెడుతోంది. దీని ప్రభావం విశాఖ ఉక్కుపై పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రైవేట్ ప్లాంట్ తేవడం వెనుక దురుద్దేశం ఉందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనిపై ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. అయితే విశాఖ ఉక్కుపై చిత్తశుద్ధితో ఉన్నామని ప్రభుత్వం అంటోంది.

బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి అదానీ పవర్ అల్టిమేటం జారీ చేసింది. నవంబర్ 7లోపు రూ.7,200 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే విద్యుత్ సరఫరాను సగానికి తగ్గించడంతో బంగ్లాదేశ్‌లో 1,600 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడినట్టు స్థానిక మీడియా తెలిపింది. బకాయిలు చెల్లించకపోతే ఒప్పందం మేరకు సరఫరా నిలిపివేస్తామని అదానీ పవర్ స్పష్టం చేసింది.

అయోవాను రిపబ్లికన్లు కోల్పోయే అవకాశం ఉందని తాజా సర్వే అంచనా వేసింది. గత సర్వేలో ఇక్కడ ట్రంప్ ముందంజలో ఉన్నారు. అయితే, ఇప్పుడు కమల 47% మంది మద్దతుతో ట్రంప్(44%)ను అధిగమించారు. తుది సర్వే డెస్ మోయిన్స్ రిజిస్టర్ వార్తాపత్రికలో ప్రచురితమైంది. ఈ మార్పును ఎవరూ ఊహించలేదని, కమల స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారని పోల్‌ను నిర్వహించిన సెల్జర్&కో ప్రెసిడెంట్ జె.ఆన్ సెల్జర్ తెలిపారు.

న్యూజిలాండ్‌తో మూడో టెస్టులోనూ టీమ్ఇండియా ఫ్లాప్ షో చూపించడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. స్టార్ బ్యాటర్లు విఫలమవడంతో రహానే, పుజారాలను గుర్తుచేసుకుంటున్నారు. టెస్టుల్లో వీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ట్వీట్స్ చేస్తున్నారు. గెలిచే మ్యాచులోనూ టీమ్ ఇండియా ఓడిపోయిందని, ఇకనైనా BCCI తేరుకొని సమర్థులని జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

AP: రుషికొండ భవనాలు జగన్ ఇల్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ‘అలాంటి భవనం కట్టలేకపోయామనే బాధలో చంద్రబాబు ఉన్నట్లున్నారు. మా ప్రభుత్వ విధానంలో భాగంగానే వాటిని నిర్మించాం. ఇది జగన్ ఆస్తి అని మీరు చెప్పగలరా? ఆ భవనాలు మీరు ఎలా వినియోగిస్తారో మీ ఇష్టం. వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది’ అని దుయ్యబట్టారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Sorry, no posts matched your criteria.