News November 11, 2024

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ రానంటోంది: PCB

image

పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆ దేశానికి వెళ్లేందుకు భారత్ నిరాకరించిందని PCB తెలిపింది. ఈ మేరకు BCCI నుంచి లేఖ అందినట్లు వెల్లడించింది. మరి ఈ టోర్నీని తటస్థ వేదికలపై నిర్వహించే ఆలోచన చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఈరోజు విడుదల చేయాల్సి ఉండగా భారత్ ప్రాతినిధ్యం వహించడంపై స్పష్టత రాకపోవడంతో అది సాధ్యపడలేదు.

News November 11, 2024

చలికాలంలో ఇవి తింటున్నారా?

image

చలికాలంలో మారిన వాతావరణానికి అనుగుణంగా శరీరాన్ని కాపాడుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలని, చల్లగా ఉండే వాటిని వీలైనంత వరకు తీసుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మాంసాహారం తక్కువగా తీసుకోవాలని, డీప్ ఫ్రైలకు దూరంగా ఉండాలని అంటున్నారు.

News November 11, 2024

అత్యంత విలువైన కంపెనీకి CEO.. కానీ వాచ్ పెట్టుకోరు!

image

NVIDIA సంస్థ ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అలాంటి సంస్థకు CEOగా ఉన్న జెన్సెన్ హువాంగ్ వాచ్ పెట్టుకోరు. అందుకు కారణాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. ‘మీరు మా కంపెనీ ఉద్యోగుల్ని అడిగి చూడండి. మాకు దీర్ఘకాలం ప్లాన్స్ ఉండవు. ప్రస్తుతం మీద దృష్టి పెట్టడమే మా అజెండా. భవిష్యత్తు కాదు.. ముందు ఈ క్షణంపై దృష్టి పెట్టాలన్న ఆలోచనతోనే వాచ్ ధరించను’ అని వివరించారు.

News November 11, 2024

ట్రంప్ ఎన్నికతో భారత్‌కు ఆందోళన లేదు: జైశంకర్

image

US ఎన్నికల్లో ట్రంప్ గెలిచారని ఆందోళన చెందే దేశాల్లో భారత్ లేదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ‘చాలా దేశాలు ట్రంప్ గెలుపుపై ఆందోళన చెందాయి. భారత్‌కు అలాంటి టెన్షన్ లేదు. ఆయన గెలవగానే కాల్ చేసిన తొలి ముగ్గురిలో PM మోదీ కూడా ఉన్నారు. వారిద్దరికీ మధ్య అంతటి సాన్నిహిత్యం ఉంది. ఇతర దేశాలతో బంధం బలోపేతం చేసుకోవడంలో ప్రధాని చేసిన కృషి భారత్‌కు ఉపకరించింది’ అని పేర్కొన్నారు.

News November 11, 2024

పేజర్లతో దాడిని అంగీకరించిన నెతన్యాహు!

image

లెబనాన్‌లో పేజర్ల ద్వారా దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్‌లో జరిగిన ఈ పేలుళ్లలో దాదాపు 40 మంది హెజ్బొల్లా సభ్యులు మరణించారు. ఈ ఘటనపై యునైటెడ్ నేషన్స్ లేబర్ ఏజెన్సీకి లెబనాన్ ఫిర్యాదు చేసింది. మానవత్వంపై ఘోరమైన దాడిగా పేర్కొంది.

News November 11, 2024

నవంబర్ 11: చరిత్రలో ఈరోజు

image

* 1918: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది.
* 1768: హైదరాబాద్ మూడో నిజాం సికిందర్ జా జననం.
* 1888: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి విద్యామంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జననం.
* 1970: పద్మభూషణ్ పురస్కార గ్రహీత మాడపాటి హనుమంతరావు మరణం.
* 1974: హాస్య నటుడు తిక్కవరపు వెంకట‌రమణారెడ్డి మరణం.
* 2023: నటుడు చంద్రమోహన్ మరణం.

News November 11, 2024

సిద్ధిఖీ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు

image

NCP మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో నలుగురిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో అదుపులోకి తీసుకున్నారు. Oct 12న సిద్ధిఖీ ముంబయిలోని తన కుమారుడి ఆఫీస్‌లో ఉన్నప్పుడు కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపగా మరణించారు. ఈ కేసులో దాదాపు 20 మంది అరెస్టయ్యారు.

News November 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 11, 2024

వేలంలో వాళ్లిద్దర్నీ కొనడం చాలా కష్టం: CSK

image

IPL వేలంలో పంత్, KL రాహుల్‌పై దృష్టి సారిస్తామని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తాజాగా తెలిపారు. ‘మాకున్న పర్సును బట్టి ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి వారిని కొనడం చాలా కష్టం. అయినా ప్రయత్నిస్తాం. భారత ప్లేయర్లకు చాలా డిమాండ్ ఉంది’ అని పేర్కొన్నారు. CSKకి ప్రస్తుతం ధోనీ కీపింగ్ చేస్తుండగా, రుతురాజ్ కెప్టెన్సీ చేస్తున్నారు. పంత్ లేదా రాహుల్‌ను కొంటే ఆ రెండు బాధ్యతల్నీ ఒకరే నిర్వర్తించే అవకాశం ఉంది.

News November 11, 2024

ఆటగాళ్ల వ్యక్తిత్వ హననం తగదు: అశ్విన్

image

జట్టు ఓటమి విషయంలో ఫ్యాన్స్‌కంటే ఆటగాళ్లు రెట్టింపు బాధను అనుభవిస్తారని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు. ఓడిపోయామని తమను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ‘ఇది ఆట. గెలుపోటములు సహజం. అభిమానుల కంటే ఎక్కువ బాధ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంది. మైదానంలో ఫలితాలపైనే మా కెరీర్లు ఆధారపడి ఉంటాయి. అలాంటి మా నిబద్ధతను అనుమానించడం చాలా దారుణం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.