India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వచ్చే ఎన్నికల్లో నగరిలో మంత్రి రోజా గడ్డు పరిస్థితులు ఎదుర్కోనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె దూకుడుతో సొంత పార్టీ నేతలే ఆమెకు దూరమవుతున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ ఆమెకు వ్యతిరేక గాలి వీస్తోందని విశ్లేషిస్తున్నారు. గతంలో రెండు సార్లు స్వల్ప ఆధిక్యంతో (2014లో 1,000, 2019లో2,000 ఓట్లు) గెలిచిన రోజా ఈ సారి విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సిందేనని చెబుతున్నారు.
ఇటీవల ఈసీ బయటపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 2018 మార్చి 1 నుంచి 2019 ఏప్రిల్ 11 వరకు అమ్మిన రూ.4,002 కోట్ల విలువైన బాండ్ల వివరాలను వెల్లడించేలా SBIని ఆదేశించాలని సిటిజన్స్ ఫర్ రైట్స్ ట్రస్టు కోరింది. కాగా 2019 APR 12 నుంచి 2024 FEB 15 వరకు అమ్మిన బాండ్ల వివరాలు సుప్రీం ఆదేశాలతో బహిర్గతమైన విషయం తెలిసిందే.
AP: ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో సీఎం జగన్ ఇవాళ వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ఈ భేటీ జరగనుంది. జిల్లాలవారీగా పరిస్థితులు, మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం చర్చించనున్నారు. కాగా త్వరలోనే 175 MLA, 25 MP అభ్యర్థులతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం.
ఖాళీగా ఉన్న 4,187 ఎస్ఐ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు SSC నోటిఫికేషన్ విడుదల చేసింది. BSF, CISF, CRPF, ITBP వంటి విభాగాల్లో వీటిని భర్తీ చేయనున్నారు. ఆగస్ట్ 1, 2024 నాటికి డిగ్రీ పాసై 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు అందుతుంది. పేపర్ 1, పేపర్ 2, ఫిజికల్ టెస్టులు ఉంటాయి. మే 9, 10, 13 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. ఈ నెల 28లోగా https://ssc.inలో దరఖాస్తు చేసుకోవాలి.
TG: బీఎస్పీకి గుడ్ బై చెప్పిన రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనను నాగర్ కర్నూల్ లోక్‌సభ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించే అవకాశముంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం తాను బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.
AP: రాష్ట్రంలో 89 గ్రూప్-1 ఉద్యోగాలకు నిన్న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు APPSC వెల్లడించింది. 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా, 1,26,068 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 91,463 మంది(72.55 శాతం) మంది హాజరైనట్లు పేర్కొంది. త్వరలో కీ విడుదల చేస్తామంది.
సార్వత్రిక ఎన్నికల కోసం ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌పై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళనాడు, కేరళలో ఏప్రిల్ 19, 26 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని.. ఈ తేదీలు ముస్లింలకు ఎంతో పవిత్రమైన శుక్రవారం వస్తున్నాయని, ఆ రోజుల్లో పోలింగ్ వద్దని కోరింది. మసీదులకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించాల్సి ఉంటుందని.. అభ్యర్థులు, అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుందని పేర్కొంది.
AP: ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు జరుగుతాయి. నేటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూళ్లు కొనసాగుతాయి. అటు టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లలో ఏడు రోజుల పాటు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు.
టీమ్ ఇండియా నయా సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆయన ఆడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఆ జట్టు వికెట్ కీపర్ రాబిన్ మింజ్ బైక్ ప్రమాదంలో గాయపడి ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. దీంతో అతడి స్థానంలో సర్ఫరాజ్‌ను తీసుకోవాలని గుజరాత్ భావిస్తున్నట్లు టాక్. కాగా ఐపీఎల్ మినీ వేలంలో సర్ఫరాజ్‌ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.
TS: MLC కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె భర్త ఇవాళ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఆమెను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను నిన్న తొలిరోజు విచారణ అనంతరం ఆమె భర్తతో పాటు KTR, హరీశ్‌రావు కలిశారు. ఇవాళ పలువురు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది కలిసే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.