India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: BRS హయాంలో ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించివేశారని BJP రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘దుబ్బాక, మునుగోడు ఉపఎన్నికల్లో BJP నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేశారు. ఇందులో కేసీఆర్, ఆయన కుటుంబీకుల ప్రమేయం ఉంది. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నారు’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీ క్యాంప్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఇటీవల తిరిగి బీజేపీలో చేరి.. తాను స్థాపించిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని విలీనం చేశారు. బళ్లారిలో BJP బలపడటంలో ‘గాలి’ది కీలక పాత్ర. 2022లో BJP నుంచి వైదొలగి KRPP స్థాపించి MLAగా గెలిచారు. గాలి ఎఫెక్ట్ 2023 ఎన్నికల్లో కనిపించడంతో ఈ రీఎంట్రీతో BJPకి బలం చేకూరనుందని టాక్.
<<-se>>#Elections2024<<>>

ఈ ఏడాది ఐటీ అండ్ టెక్ రంగంలో జూనియర్ ఉద్యోగులకు 35-45 శాతం వరకు జీతాలు పెరగొచ్చని ‘మైకేల్ పేజ్ ఇండియా శాలరీ గైడ్’ నివేదిక వెల్లడించింది. మధ్యశ్రేణి వారికి 30-40 శాతం, సీనియర్లకు 20-30 శాతం వరకు పెంపు ఉంటుందని చెప్పింది. నైపుణ్యం, నూతన ఆవిష్కరణలపై కంపెనీలు దృష్టిసారించాయని తెలిపింది. వివిధ రంగాల్లో డేటా అనలిటిక్స్, జెనరేటివ్ ఏఐ, మెషీన్ లెర్నింగ్‌లో నైపుణ్యం ఉన్నవారి అవసరం పెరిగిందని పేర్కొంది.

మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ మహిళకు షాక్ ఇచ్చింది. ఆమె తన భర్తతో పాటు మరి కొందరిపై వేర్వేరుగా రేప్ కేసులు పెట్టింది. అయితే ఓ వ్యక్తిని ఆర్థికంగా మోసం చేసిన కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె.. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణలో భాగంగా ఆమె గతంలో పెట్టిన తప్పుడు రేప్ కేసుల విషయాలు బయటికొచ్చాయి. ఇది తెలుసుకున్న కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.

కర్ణాటక విజయపూర్ జిల్లాలో బోరుబావిలో పడిన రెండేళ్ల సాత్విక్‌ను సురక్షితంగా బయటికి తీసుకురావడంపై మాజీ సీఎం కుమారస్వామి హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా కఠినమైన, సవాలుతో కూడిన రెస్క్యూ ఆపరేషన్. పిల్లాడు ప్రాణాలతో బయటపడినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. బిడ్డను రక్షించిన NDRF, SDRF, ఫైర్ & పోలీసు సిబ్బందికి తల్లిదండ్రులే కాకుండా దేశం మొత్తం రుణపడి ఉంటుంది. అందరికీ అభినందనలు’ అని ట్వీట్ చేశారు.

గాయంతో కొంతకాలంగా క్రికెట్‌కు దూరమైన సూర్య కుమార్ యాదవ్ తిరిగి గ్రౌండ్‌లోకి దిగనున్నారు. IPLలో ఆడేందుకు అతనికి NCA నుంచి NOC జారీ అయింది. దీంతో రేపు ముంబై ఇండియన్స్ జట్టులో అతను చేరనున్నట్లు CRICBUZZ పేర్కొంది. నెట్ సెషన్‌లో అతడి ఆటను ముంబై మేనేజ్‌మెంట్ పరిశీలించనుంది. ఈనెల 7న ఢిల్లీతో జరగనున్న మ్యాచులో సూర్యను ఆడించాలా లేదా అనేది అతడి ఫిట్‌నెస్‌ను బట్టి నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.

☛ కలెక్టర్లు:
★ అనంతపురం: వి.వినోద్ కుమార్ ★ కృష్ణా: డీకే బాలాజీ
★ తిరుపతి: ప్రవీణ్ కుమార్
☛ ఎస్పీలు:
★ ప్రకాశం: గరుడ్ సుమిత్ సునీల్
★ చిత్తూరు: మణికంఠ చెందోలు
★ నెల్లూరు: ఆరిఫ్ హఫీజ్
★ పల్నాడు: బిందు మాధవ్
★ అనంతపురం: అమిత్ బర్దార్

ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం ఉ.10.30 గంటలకు తీర్పు వెల్లడిస్తామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని కవిత బెయిల్ అడగడం మానవతా కోణంలోకి రాదని ఈడీ కోర్టులో వాదించింది. కుమారుడిని చూసుకునేందుకు చాలా మంది ఉన్నారని, ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయని పేర్కొంది. అటు సాధారణ బెయిల్ విచారణను ఏప్రిల్ 20న చేపడతామని కోర్టు తెలిపింది.

దేశాన్ని నిర్మించేదెవరో, నాశనం చేసేదెవరో ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ‘కాంగ్రెస్ అంటే యువతకు తొలి ఉద్యోగం, MSP గ్యారంటీ, పేద మహిళలను మిలియనీర్లుగా మార్చడం, కులగణన, కార్మికుల దినసరి కూలీ రూ.400, రాజ్యాంగ-పౌర హక్కుల పరిరక్షణ. BJP అంటే నిరుద్యోగం, రైతులకు రుణభారం, వివక్ష, నియంతృత్వం. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సరైన నిర్ణయం తీసుకోండి’ అని పేర్కొన్నారు.

TG: ఒకటి నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే SA-2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. వీటిని ఏప్రిల్ 15 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. 1-7 తరగతుల విద్యార్థులకు ఉ.9-11.30 గంటల వరకు, 8వ తరగతి వాళ్లకు ఉ.9-11.45 గంటల వరకు, 9వ తరగతి స్టూడెంట్స్‌కు ఉ.9-12 గంటల వరకు ఎగ్జామ్స్ ఉంటాయని పేర్కొంది. 23న ఫలితాలు, పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తామంది. అనంతరం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించనుంది.
Sorry, no posts matched your criteria.