India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇథనాల్ అధిక మోతాదులో ఉండే ఇండస్ట్రియల్ ఆల్కహాల్‌లో ఇసోప్రొపైల్ రసాయనం కలవడం వల్ల ఇది తాగేందుకు పనికిరాదు. దీనిని కాస్మొటిక్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్, పెయింట్ సాల్వెంట్స్ మొదలైన ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు. తాజాగా ఈ ఇండస్ట్రియల్ ఆల్కహాల్‌పై పూర్తి అధికారం రాష్ట్రాలకే దక్కాలని UP, బెంగాల్ ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించాయి. లిక్కర్, స్పిరిట్ తరహాలోనే ఇది కూడా తమ పరిధిలోదేనని వాదిస్తున్నాయి.

AP: YS వివేకా హత్యపై ఐదేళ్లుగా మాట్లాడని షర్మిల ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ‘షర్మిల, సునీత వెనుక చంద్రబాబు ఉన్నారు. మా ప్రభుత్వం రక్తపుమడుగులో ఉందని ఎలా అంటారు? వివేకా హత్యతో జగన్‌కు సంబంధం ఏంటి? షర్మిల, చంద్రబాబు ఆరోపణలపై మేం స్పందించాల్సిన అవసరం లేదు. ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం. వాళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అని ఫైరయ్యారు.

TG: నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా అని ప్రశ్నిస్తూ CM రేవంత్‌కు KTR బహిరంగ లేఖ రాశారు. ‘నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది. వారి బతుకులు ఆగమయ్యేలా ప్రభుత్వ విధానాలున్నాయి. నేతన్నలకు ఆర్డర్లు నిలిపివేశారు. చేనేతమిత్ర వంటి పథకాలను పక్కనపెట్టారు. గతంలో మాదిరిగా వారికి చేతినిండా ఆర్డర్లు ఇవ్వాలి. బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చి, పెండింగ్ బిల్లులను చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు.

AP: వాలంటీర్లపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘వాలంటీర్ వ్యవస్థపై నిమ్మగడ్డ రమేశ్‌తో ఫిర్యాదు చేయించారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి వాలంటీర్లకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన వల్ల వృద్ధులు ఎండలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రోజూ ఏదోక కారణంతో TDP నేతలు ECకి ఫిర్యాదులు చేస్తున్నారు’ అని ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

మహారాష్ట్రలోని అమరావతి MP నవనీత్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్‌ను ధర్మాసనం సమర్థించింది. సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. ఆమె ‘మోచి’ కుల ధ్రువీకరణ పత్రాన్ని మోసపూరితంగా పొందారని పేర్కొంటూ హైకోర్టు సర్టిఫికెట్‌ను రద్దు చేయగా, ఆమె SCని ఆశ్రయించారు. తాజాగా ఊరట లభించడంతో నేడు అమరావతి BJP MP అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.

పాపువా న్యూ గినియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ కాయా అరువా(33) మృతి చెందారు. 2019 T20WC క్వాలిఫయర్, 2021 WC క్వాలిఫయర్ టోర్నీల్లో కెప్టెన్‌గా జట్టును నడిపించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన అరువాకు బ్యాటింగ్‌లోనూ మంచి రికార్డు ఉంది. టీ20ల్లో ఆమె 59వికెట్లు, 341 రన్స్ చేశారు. PNG తరఫున అత్యధిక వికెట్ల రికార్డు ఆమె పేరిటే ఉంది. జపాన్‌పై 5/7తో T20 చరిత్రలోనే రెండో ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చారు.

సుప్రీంకోర్టులో CJI చంద్రచూడ్ ఆధ్వర్యంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఇండస్ట్రియల్ ఆల్కహాల్ రెవెన్యూపై విచారిస్తున్న వేళ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ధర్మాసనం సభ్యురాలైన జస్టిస్ బీవీ నాగరత్న తండ్రి, నాటి CJI బీవీ వెంకటరామయ్య ఇదే కేసుపై 1989లో తీర్పు ఇచ్చారు. రెవెన్యూపై కేంద్రానికి అనుకూలంగా ఆ తీర్పు ఉంది. మరి తండ్రి తీర్పును జస్టిస్ నాగరత్న తిరగరాస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

ఓవైపు T20WC సమీపిస్తోంది. మరోవైపు IPLలో భారత కీలక ప్లేయర్లు రాణించలేకపోతున్నారు. జైస్వాల్(39రన్స్), రుతురాజ్(62), గిల్(75)తో పాటు సీనియర్లు రోహిత్‌శర్మ(69), రాహుల్(93), పాండ్య(69) తడబడుతున్నారు. బౌలర్లదీ అదే పరిస్థితి. బుమ్రా(3వికెట్లు), కుల్దీప్(3), చాహర్(3) పెద్దగా వికెట్లు తీయలేదు. కొందరు కొత్త క్రికెటర్లు రాణిస్తున్నప్పటికీ వారికి జట్టులో ఛాన్స్ దొరుకుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

వయనాడ్ MP అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ తన ఆస్తులను రూ.20 కోట్లుగా అఫిడవిట్‌లో చూపించారు. రూ.11.15 కోట్ల స్థిరాస్తులు, రూ.9.24 కోట్ల చరాస్తులున్నట్లు పేర్కొన్నారు. తన వద్ద రూ.55వేల నగదు ఉన్నట్లు తెలిపారు. సొంత కారు, ఇల్లు లేవని వెల్లడించిన రాహుల్.. సోదరి ప్రియాంకా గాంధీతో కలిపి ఢిల్లీలో వ్యవసాయ భూమి ఉన్నట్లు వివరించారు. రాహుల్‌కు గురుగ్రామ్‌లో రూ.9 కోట్ల విలువ చేసే ఆఫీస్ స్పేస్ ఉంది.

దేశంలో ‘బెస్ట్ పోస్ట్‌మ్యాన్’గా గుర్తింపు పొందిన విక్టర్ ధన్‌రాజ్(90) కన్నుమూశారు. ఆయన డెడికేషన్‌కు మెచ్చిన ప్రభుత్వం 1988లో భారతదేశపు ఉత్తమ పోస్ట్‌మ్యాన్‌గా గుర్తించింది. బెంగళూరుకు చెందిన ధన్‌రాజ్ 1952లో పోస్టల్ డిపార్ట్‌మెంటులో చేరి.. 1992లో పదవీ విరమణ పొందారు. కాగా.. ఆయన ధరించిన యూనిఫామ్‌ను పోస్టల్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచినట్లు ఆయన కుమారుడు దీపక్ కుమార్ వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.