India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. APR 4 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. జమ్మూకశ్మీర్‌లో APR 6న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, మిగతా రాష్ట్రాల్లో 5వ తేదీనే స్క్రూటినీ నిర్వహిస్తారు. అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర, యూపీ, బెంగాల్, మణిపుర్, జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36.2 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా ₹3,975 కోట్ల రాబడి సాధించి విజయవాడ రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2018-19లో ₹3,875 కోట్ల ఆదాయం సాధించగా, ఇప్పుడు ఆ రికార్డు బ్రేకయ్యింది. సరకు రవాణాలో కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు తొలి 2 స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా 19.36 మి.టన్నుల బొగ్గు, 6.68 మి.టన్నుల ఎరువులను రవాణా చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

TG: రాష్ట్రంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 3 నెలల పాటు ట్రైనింగ్, 45 రోజుల ఫీల్డ్ శిక్షణ ఉంటుందని చెప్పారు. మొత్తం 614 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, 555 మంది ఎంపికయ్యారని వెల్లడించారు. వీరికి ఫిబ్రవరి 14న నియామక ఉత్తర్వులు ఇవ్వగా, ఇప్పటివరకు 397 మంది జాయినింగ్ రిపోర్టు ఇచ్చారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కరోనా కంటే వేగంగా వ్యాపించే ఫేక్ న్యూస్‌ను వెంటనే అడ్డుకుందాం. Way2News లోగోతో కొందరు ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్నారు. మా వార్తల వెరిఫికేషన్ చాలా సులువు. మా ప్రతి ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌ను యాప్‌లో/ fc.way2news.comలో ఎంటర్ చేస్తే మీకు వచ్చిన ఆర్టికల్ కన్పించాలి. లేదంటే ఫార్వర్డ్ అయ్యే వార్త ఫేక్. Way2News పేరుతో వైరల్ అయ్యే ఫేక్ వార్తలను grievance@way2news.comకు పంపండి.

AP: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘నిజం గెలవాలి’ యాత్ర పేరుతో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆమె డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ వార్త విని మరణించిన వారికి సాయం చేస్తున్నారని.. అయితే వారంతా బాబు అరెస్ట్ వార్తతోనే చనిపోయారనడానికి ఆధారాలేమీ లేవని పేర్కొన్నారు.

* 314/3- నేపాల్ Vs మంగోలియా, హాంగ్జౌ, 2023
* 278/3- అఫ్గానిస్థాన్ Vs ఐర్లాండ్, డెహ్రాడూన్, 2019
* 278/4- చెక్ రిపబ్లిక్ Vs తుర్కియే, ఇల్ఫోవ్ కౌంటీ, 2019
* 277/3- SRH Vs MI, హైదరాబాద్, 2024
* 275/6- పంజాబ్ Vs ఆంధ్రా, రాంచీ, 2023

TG: ప్రభుత్వ టీచర్లు టెట్ రాయడానికి విద్యాశాఖ నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదని ఆ శాఖ కమిషనర్ శ్రీదేవసేన స్పష్టం చేశారు. టెట్ రాసేందుకు టీచర్లు అనుమతి తీసుకోవాలని 2 రోజుల క్రితం టెట్ కన్వీనర్ చెప్పిన నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో టీచర్లు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని శ్రీదేవసేన తెలిపారు. కాగా టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 10 వరకు కొనసాగనుంది.

TS: రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.3 కోట్లుగా ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. వీరిలో 1,65,95,896మంది మహిళలు, 1,64,14,693మంది పురుషులు, 2729మంది ఇతరులు ఉన్నారని వెల్లడించారు. ఇక తొలితరం ఓటర్లు 8,72,116మంది, 85ఏళ్లు దాటినవారు 1,93,489మంది, దివ్యాంగులు 5,26,286మంది, సర్వీసు ఓటర్లు 15,472మంది, ఎన్నారై ఓటర్లు 3409మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న కూలీల కనీస వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.300గా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) కనీస వేతనం రూ.272గా అమలు చేస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.28 జోడించి ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రూ.300 ఇవ్వనున్నారు.

AP: ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి సదరం స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో స్లాట్లు బుక్ చేసుకోవచ్చని, వీరికి ఏప్రిల్ 8 నుంచి ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ENT వైద్యులు టెస్టులు చేసి అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు.
Sorry, no posts matched your criteria.