India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 966 పోస్టులున్నాయి. ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 18లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. జూన్ 4వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. వేతనం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://ssc.gov.inను సంప్రదించాలి.

భారత మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ క్షమాపణలు చెప్పారు. ‘నా సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఓ అభ్యంతరకర <<12948946>>పోస్ట్<<>> వచ్చినట్లు నా దృష్టికి వచ్చింది. కానీ అది జరిగిన సమయంలో నా ఫోన్ నా వద్ద లేదు. ఇందుకు నన్ను క్షమించాలి’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ‘వసూలి టైటాన్స్’ పేరుతో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా తదితర నేతలు క్రికెట్ ప్లేయర్లుగా ఉన్న పోస్టర్‌ను ఆమె ఇన్‌స్టా స్టోరీగా పెట్టినట్లు తెలుస్తోంది.

TG: మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందుకు ఆర్బీఐ, బ్యాంకులతో కలిసి విధి విధానాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు 6,47,589 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేశాం. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది’ అని ఆయన తెలిపారు.

ప్రపంచంలోనే తొలి ఓం ఆకారం ఆలయాన్ని రాజస్థాన్‌లో నిర్మించారు. దీన్ని పాలి జిల్లాలోని జదాన్ గ్రామంలో 250 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో 12 జ్యోతిర్లింగాలతో పాటు 1,008 శివుడి విగ్రహాలున్నాయి. 5వ శతాబ్దానికి చెందిన నాగర శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు.

చిన్నస్వామి స్టేడియంలో RCBvsKKR మ్యాచ్‌కు ముందు కొందరు RCB అభిమానులు చేసిన విచిత్రమైన పనికి నెట్టింట విమర్శలొస్తున్నాయి. WPLలో RCB ప్లేయర్ పెర్రీ సిక్స్ కొట్టి కారు అద్దం పగలగొట్టడంతోనే వారు కప్ గెలిచారని, పురుషుల జట్టు కూడా అదే చేయాలని ఫ్యాన్స్ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో కొందరు ఆ కారు రూఫ్‌టాప్‌ను పగలగొట్టారు. మ్యాచ్ గెలిచేందుకు ఇలాంటి పిచ్చి పనులేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

IPL-2024 టోర్నీ ప్రారంభమై వారం రోజులు కావస్తుండగా ప్రతి మ్యాచ్‌లో ఆయా జట్ల ప్లేయర్లు సిక్సర్లతో అదరగొడుతున్నారు. అయితే, ఈ ఏడాది ఇప్పటివరకూ SRH ప్లేయర్లు క్లాసెన్ 2 మ్యాచుల్లో 15 సిక్సులు కొట్టగా, అభిషేక్ శర్మ 9 సిక్సులు బాదారు. వీరి తర్వాత RR ప్లేయర్ పరాగ్ 2 మ్యాచుల్లో 9 సిక్సులు, KKR రస్సెల్ ఒక్క మ్యాచులో 7 సిక్సులు, MI ప్లేయర్ తిలక్ వర్మ 2 మ్యాచుల్లో 7 సిక్సులు కొట్టారు.

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేల్చిన ఇద్దరు కీలక నిందితుల కోసం వేట కొనసాగుతోంది. వారి ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డు ఇస్తామని NIA ప్రకటించింది. నిందితుల ఆచూకీ తెలిసిన వాళ్లు 89042 41100 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపింది. కాగా ఈ కేసులో ఇప్పటికే NIA ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసింది. మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో నలుగురు గాయపడ్డ విషయం తెలిసిందే.

ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఓపెనర్ పృథ్వీషాను డగౌట్లో కూర్చోబెట్టడం ఏంటని ఆసీస్ మాజీ క్రికెటర్ టామ్ మూడీ ప్రశ్నించారు. ‘పృథ్వీషా ఓ అద్భుత ఆటగాడు. అతడో డేంజరస్ క్రికెటర్. గత సీజన్లో అతడు రాణించకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన బెంచ్‌కే పరిమితం చేస్తారా? అతడు డగౌట్ నుంచే పరుగులు చేయలేడు కదా’ అని ఆయన పేర్కొన్నారు. కాగా పృథ్వీ షా స్థానంలో తెలుగు కుర్రాడు రికీ భుయ్ జట్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

AP: ప్రకాశం(D) దర్శి నియోజకవర్గంలో అనూహ్యంగా గొట్టిపాటి లక్ష్మి పేరుని TDP ప్రకటించింది. వృత్తిపరంగా ఆమె గైనకాలజిస్ట్. మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనుమరాలు. అద్దంకి MLA గొట్టిపాటి రవికుమార్ ఆమెకు బాబాయ్ అవుతారు. లక్ష్మీకి టికెట్ ఇప్పించడంలో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కాగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తిరిగి టీడీపీలో చేరి దర్శి నుంచి పోటీ చేస్తారని భావించినా అలా జరగలేదు.

AP: శింగనమల ఎమ్మెల్యే టికెట్ ఓ టిప్పర్ డ్రైవర్‌కు ఇచ్చామంటూ చంద్రబాబు తూలనాడాడని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ‘అవునయ్యా.. చంద్రబాబు. మేం పేదవాళ్లకు టికెట్లు ఇచ్చాం. ఆ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు MA ఎకనామిక్స్, ఆపై బీఈడీ చదివాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు రాక డ్రైవర్ అయ్యారు. మడకశిరలోనూ ఉపాధి హామీ కూలీ లక్కప్పకు టికెట్ ఇచ్చామని గర్వంగా చెప్తా’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.