India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

✒ తేది: ఆగస్టు 4, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:39 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:56 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:50 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:48 గంటలకు
✒ ఇష: రాత్రి 8.05 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

TG: 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులతో అడ్డదారిన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కాక రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని BJP MP ఈటల రాజేందర్ ఆరోపించారు. శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన BJP కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. హామీలన్నీ నీటి మీద రాతలయ్యాయన్నారు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

✒ తేది: ఆగస్టు 4, ఆదివారం
✒ అమావాస్య: సాయంత్రం 4.42 గంటలకు
✒ పుష్యమి: మధ్యాహ్నం 1.26 గంటలకు
✒ వర్జ్యం: తెల్లవారుజాము 3.15 నుంచి 4.59 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: సాయంత్రం 4.54 నుంచి 5.45 గంటల వరకు

* భూ కబ్జాదారులపై కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
* నాట్యమయూరి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
* కౌలు రైతులకు బ్యాంకు రుణాలు: మంత్రి అచ్చెన్నాయుడు
* అమెరికా పర్యటనకు TG CM రేవంత్
* మహిళలకు రూ.20వేల కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి
* రాబోయే రోజుల్లో రేవంత్ సీట్లో సీఎంగా KTR: సబిత
* ఒలింపిక్స్: 25m పిస్టల్ ఈవెంట్‌లో మనూ భాకర్ ఓటమి
* ఈనెల 21న భారత్ బంద్‌కు బహుజన సంఘాల పిలుపు

టీమ్‌ఇండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ఆడనున్నారట. ఝార్ఖండ్ తరఫున ఆడనున్న కిషన్, ఆ జట్టుకు కెప్టెన్సీ కూడా చేసే ఛాన్సుందని cricbuzz పేర్కొంది. జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలన్న నేషనల్ సెలక్టర్ల సూచనతో అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2023 ODI WC తర్వాత SA పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న కిషన్, ఆ తర్వాత BCCI <<13558094>>కాంట్రాక్ట్<<>> కోల్పోయారు.

వయనాడ్‌లో ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని <<13767143>>రక్షించిన<<>> కల్పెట్టా రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్లకు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. 8 గంటలు శ్రమించి ఆపదలో ఉన్న కుటుంబాన్ని రక్షించారని ట్వీట్ చేశారు. బాధితులకు సాయపడ్డ ఆర్మీ సిబ్బందికి, NDRF, SDRFకు ధన్యవాదాలు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది చూపుతున్న నిబద్ధత, చేస్తున్న నిస్వార్థ సేవ ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి సహాయపడతాయని పేర్కొన్నారు.

ఒలింపిక్స్-2024: భారత్ మొత్తం 16 క్రీడల్లో పాల్గొంటోంది. ఆర్చరీ, టెన్నిస్, రోయింగ్, జూడో, స్విమ్మింగ్, ఈక్వెస్ట్రియన్ (గుర్రపు పోటీలు)లో పోరాటం ముగిసింది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, గోల్ఫ్, హాకీ, సెయిలింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో ఇండియా మెడల్ గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు మనకు 3 మెడల్స్ వచ్చాయి.
<<-se>>#Olympics2024<<>>

వయనాడ్‌లోని వెల్లార్‌మాలా ప్రభుత్వ పాఠశాలకు (GVHSS) చెందిన విద్యార్థులు ప్రకృతి ప్రకోపానికి బలవడంతో ఆ ప్రాంతమంతా మూగబోయింది. అక్కడి శిథిలాల్లో అజిలా అనే బాలికకు చెందిన ప్రోత్సాహక సర్టిఫికెట్ బయటపడటం గుండెను పిండేస్తోంది. SSCలో రాణించినందుకు GVHSS ఆ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట షేర్ కాగా ఆ బాలిక ఏమైపోయిందోనని కొందరు, కలలు ఛిద్రమయ్యాయని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మచా.. మన రోజు(ఫ్రెండ్‌షిప్ డే) వచ్చేసింది. ప్రతి ఏడాది ఆగస్టు తొలి ఆదివారం ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే చేసుకుంటున్నాం కదా! మరి ఈసారి నీ ఫ్రెండ్‌కు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? ఏదైనా అదిరిపోయే సర్‌ప్రైజ్ ప్లాన్ చేశావా? ఈ రెండూ కాక ‘హా! ప్రతి ఏడాది వచ్చేదే కదా’ అని లైట్ తీసుకుంటున్నావా? గిఫ్టులు, సర్‌ప్రైజ్‌లు కాకపోయినా కనీసం విష్ చేసి ‘నీకు ఓ ఫ్రెండ్ ఉన్నాడ’ని గుర్తు చెయ్. నీ ప్లాన్స్ ఏంటో కామెంట్ చేయ్.
Sorry, no posts matched your criteria.