News July 29, 2024

Olympics: త్రుటిలో చేజారిన పతకం

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ త్రుటిలో పతకాన్ని చేజార్చుకుంది. పురుషుల 10M ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అర్జున్ బబుతా నిరాశపరిచారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అర్జున్ 208.4 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. #Olympics2024

News July 29, 2024

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా?

image

ఈవీలపై ఇచ్చే సబ్సిడీ గడువును కేంద్రం పొడిగించింది. జులై 31తో సబ్సిడీ ముగియనుండగా దాన్ని సెప్టెంబర్ 30 వరకు పెంచుతున్నట్లు గెజిట్ విడుదల చేసింది. దీని ప్రకారం టూవీలర్ కొనుగోలుపై రూ.10,000 వరకు, స్మాల్ త్రీవీలర్‌పై రూ.25వేల వరకు, లార్జ్ త్రీవీలర్‌పై రూ.50వేల వరకు సర్కార్ సబ్సిడీ ఇస్తుంది. దేశంలో ఈవీల వాడకాన్ని పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

News July 29, 2024

భారత్‌లోనే 2025 ఆసియా కప్

image

వచ్చే ఏడాది పురుషుల ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో ఇండియాలో జరగనుంది. ఈ విషయాన్ని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ స్పాన్సర్‌షిప్ రైట్స్ కోసం రిలీజ్ చేసిన ఇన్విటేషన్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే 2027 ఎడిషన్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ రెండు టోర్నీల్లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. 2026 మహిళల ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుండగా, వేదికపై స్పష్టత రావాల్సి ఉంది.

News July 29, 2024

పెరిగిన ధరలు.. ఆచితూచి కొంటున్న ప్రజలు

image

TG: కూరగాయల ధరలు భారీగా పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయి. నిత్యం 40% నిల్వలు మిగిలిపోతుండగా ఎక్కువ కూరగాయలు కుళ్లిపోతున్నాయి. దీంతో రైతులు, వ్యాపారులు వాటిని పారబోస్తుండగా రోజుకు రూ. రూ.2 కోట్ల నష్టం వాటిల్లుతోంది. రాష్ట్రంలో కూరగాయల సాగు ఆలస్యమవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా రేట్లు విపరీతంగా పెరిగాయి. బీన్స్, పచ్చిమిర్చి KG రూ.150, చిక్కుడు రూ.100 పలుకుతున్నాయి.

News July 29, 2024

ఉద్యోగులకు గుడ్‌న్యూస్

image

AP: సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 16 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏను 24 శాతానికి పెంచింది. దీనిని రూ.25వేలకు మించకుండా వర్తింపజేయాలని నిర్ణయించింది.

News July 29, 2024

మలద్వారంలో దాచిన బంగారం.. ఈ వార్తలకు చెక్ పడ్డట్టే!

image

మలద్వారంలో దాచిన బంగారం కడ్డీలను పట్టేసిన అధికారులు… ఇకపై ఇలాంటి న్యూస్ రాకపోవచ్చు. కస్టమ్స్ సుంకం 6 శాతానికి తగ్గడంతో స్మగ్లింగ్‌ తగ్గిపోతుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ధర తక్కువని దుబాయ్, UAE నుంచి కొందరు గోల్డ్ అక్రమ రవాణాకు ప్రయత్నించేవాళ్లు. చివరికి విమాన, నౌకాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులకు చిక్కేవాళ్లు. ఇప్పుడు భారత్‌లోనే ధర తగ్గడంతో ఈ ఘటనలు ఆగిపోవచ్చు. కస్టమ్స్ వారికీ శ్రమ తగ్గొచ్చు.

News July 29, 2024

స్మార్ట్‌ఫోన్ లైట్‌తో చర్మంపై ముడతలు

image

స్మార్ట్‌ఫోన్‌లు అతిగా వాడితే కళ్లు ఒత్తిడికి గురికావడం, నిద్రకు భంగం వాటిల్లడం వంటి పలు సమస్యలు వస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. అయితే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ముడతలు వస్తాయని తాజాగా పరిశోధకులు తేల్చారు. నీలి కాంతి కొల్లాజెన్ ప్రొటీన్‌పై ప్రభావం చూపుతుందని, ఇది చర్మంపై ముడతలకు కారణమవుతుందని మిషిగన్ స్టేట్ వర్సిటీ పరిశోధకులు తెలిపారు.

News July 29, 2024

స్కామర్‌ను బోల్తా కొట్టించిన సాఫ్ట్‌వేర్ డెవలపర్

image

PAN లింక్ చేయకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని సైబర్ నేరగాళ్లు హరియాణా, గుర్గావ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ శరణ్‌కు మెసేజ్ పంపారు. లింక్ ఓపెన్ చేసి చూడగా అది ఫేక్ అని, ఇది ఫేక్ వెబ్‌సైట్ అని అచ్చం HDFCని పోలిన వెబ్‌సైట్‌లా మారుస్తానని అతను స్కామర్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. దీనికి రూ.20 వేలు ఖర్చు అవుతుందని స్కామర్‌నే బోల్తా కొట్టించాడు. వీరి మధ్య జరిగిన చాట్ ఫొటోలు వైరలవుతున్నాయి.

News July 29, 2024

అగ్నివీర్‌లను కేంద్రం మోసం చేస్తోంది: రాహుల్

image

కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్‌లను మోసం చేస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్‌ల పెన్షన్ కోసం బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించలేదని ఆయన అన్నారు. అటు పంటలకు మద్దతు ధర ఇవ్వాలని రైతులు ఆందోళన చేశారని, ఆ విషయంలో రైతులకు ఇప్పటి వరకూ స్పష్టమైన హామీ లభించలేదని రాహుల్ విమర్శించారు.

News July 29, 2024

జగన్.. మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి: షర్మిల

image

AP: ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని YS జగన్‌ను APCC చీఫ్ షర్మిల నిలదీశారు. ‘అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయండి అంటే నేను టీడీపీకి కొమ్ముకాసినట్లు ఉందా? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నిస్తాం. YSR విగ్రహాలు కూల్చితే ధర్నా చేస్తానని నేను హెచ్చరించా. YSRలా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే’ అని ఫైర్ అయ్యారు.