News August 2, 2024

మంత్రి లోకేశ్‌ను అభినందించిన బీజేపీ ఎంపీ

image

AP: సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో CPM, ప్రజాసంఘాల నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల లోకేశ్ క్షమాపణలు తెలపడంపై BJP MP జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ‘లోకేశ్ గారు.. మీ శాఖలో జరిగిన తప్పు కాకపోయినా, పోలీసుల మితిమీరిన చర్యలకు మీరు క్షమాపణ చెప్పారు. అలాగే మీ విద్యాశాఖలో పథకాలకు తెలుగు ప్రముఖుల పేర్లు పెట్టారు. రాజకీయాల్లో మంచి సంప్రదాయాలకు తెరతీసిన మీకు అభినందనలు’ అని కొనియాడారు.

News August 1, 2024

ఇలాంటి పంచ్ నేనెప్పుడూ ఎదుర్కోలేదు.. మహిళా బాక్సర్ కన్నీళ్లు

image

ఒలింపిక్స్‌లో ఇమానే ఖలీఫ్ చేతిలో <<13755882>>ఓడిన<<>> బాక్సర్ ఏంజెలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ఇంత గట్టి పంచ్ నేనెప్పుడూ ఎదుర్కోలేదు. ఫైట్ కంటిన్యూ చేయలేకపోయాను. ఈ విషయాన్ని ఒలింపిక్ కమిటీకి వదిలేస్తున్నాను’ అని చెప్పారు. గత ఏడాది మరణించిన తన తండ్రి కోసం మెడల్ గెలవాలని ఏంజెలా కలలు కన్నారు. కానీ ఖలీఫ్ పంచ్‌ వల్ల ముక్కు విరగడంతో పోటీ నుంచి తనకు తానుగా వైదొలిగారు.

News August 1, 2024

మమ్మల్ని మన్నించండి కామ్రేడ్: మంత్రి నారా లోకేశ్

image

AP: శ్రీసత్యసాయి(D)లో ఇవాళ CM చంద్రబాబు పర్యటన సందర్భంగా CPM, ప్రజా సంఘాల నేతల్ని అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. దీనిపై నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటన పట్ల మన్నించాలని కామ్రేడ్లను కోరారు. ‘గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు కూటమి ప్రభుత్వం వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా కొందరు పోలీసుల తీరు మారలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడుతాం’ అని X వేదికగా తెలిపారు.

News August 1, 2024

ఒలింపిక్స్‌లో PV సింధు ఓటమి

image

బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి పాలయ్యారు. చైనాకు చెందిన హీ బింగ్‌తో హోరాహోరీ పోరు జరిగింది. తొలి రౌండ్ నుంచే ఒక్కో పాయింట్ కోసం సింధు శ్రమించాల్సి వచ్చింది. ఫస్ట్ రౌండ్ 19-21 తేడాతో వెనుకబడిన ఆమె తర్వాతి రౌండ్లో(14-21)నూ పోరాడి ఓడిపోయారు. దీంతో సింధు నిరాశతో ఇంటిబాట పట్టారు.
<<-se>>#Olympics2024<<>>

News August 1, 2024

డెంగ్యూతో నిండు గర్భిణి మృతి.. కడుపులోని కవలలు కూడా..

image

TG: నెలలు నిండిన ఆ గర్భిణి మరికొద్ది రోజుల్లో తనలోని ప్రాణాలు బయటి ప్రపంచంలోకి వస్తాయని ఆనందపడింది. అమ్మనయ్యే మధురానుభూతి పొందేందుకు ఆరాటపడింది. కానీ అంతలోనే డెంగ్యూ ఆ తల్లీబిడ్డలను కబళించింది. హనుమకొండ(D)లో ఈ విషాదం జరిగింది. గట్లకానిపర్తికి చెందిన శిరీష డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించింది. ఆమె కడుపులో ఉన్న కవలలను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం వృథా అయింది.

News August 1, 2024

SC వర్గీకరణతో సామాజిక న్యాయం: పవన్

image

AP: SC, ST వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఒక వర్గం నిరంతర పోరాట ఫలితమే ఈ తీర్పు అని అన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని పోరాటం చేశారన్నారు. ఈ వర్గీకరణతో సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. SCల్లో ఐక్యత చెక్కు చెదరకుండా చూడాల్సిన బాధ్యత ఆ వర్గం మేధావులపై ఉందన్నారు.

News August 1, 2024

శాలరీ క్రెడిటెడ్.. ఉద్యోగి ఆనందంపై లోకేశ్ ట్వీట్

image

AP: కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇవాళ ఉదయమే శాలరీ క్రెడిట్ అయిందంటూ ఓ ఉద్యోగి పలకపై రాసి చూపిస్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే పడిన జీతాలు. ఆనందమయ జీవితాలు. ఇదీ కూటమి ప్రభుత్వం సమర్థ పాలనకు నిదర్శనం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

News August 1, 2024

క్యూ1లో దూసుకెళ్లిన టాటా మోటార్స్‌

image

FY25 తొలి త్రైమాసిక ఫలితాల్లో టాటా మోటార్స్ రాణించింది. నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 74% వృద్ధి చెంది ₹5,566 కోట్లుగా నమోదైంది. ఆపరేషన్స్‌కు సంబంధించి ₹1,07,316 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. FY24 క్యూ1తో పోలిస్తే 5.7% వృద్ధి రికార్డ్ అయింది. అంచనాలకు మించి నికర లాభం నమోదు కావడంపై ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్యూ1లో ఐటీసీ ₹4,917 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

News August 1, 2024

గ్రేట్.. వారధి నిర్మించిన ‘సీత’

image

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి బీభత్సం సృష్టించిన వేళ సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు సైన్యం వారధి నిర్మించింది. 190 అడుగుల పొడవు ఉన్న ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఓ మహిళా జవాన్ ఆధ్వర్యంలో జరగడం విశేషం. మేజర్ సీతా షెల్కే, మేజర్ అనీశ్‌తో కలిసి 16 గంటల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇది మహిళా సాధికారతకు, కష్టకాలంలో సమైక్యతకు నిదర్శనమని రక్షణ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ పేర్కొన్నారు.

News August 1, 2024

మరోసారి బెంగళూరుకు జగన్

image

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మరోసారి బెంగళూరుకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3.45 గంటలకు ఆయన తాడేపల్లిలోని తన ఇంటి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు. రాత్రి 7.15 గంటలకు బెంగళూరులో ల్యాండ్ అవుతారు. ఈ మేరకు షెడ్యూల్‌ను జగన్ పీఏ పోలీసు శాఖకు అందించారు. ప్రొటోకాల్ ప్రకారం ఎస్కార్ట్, సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని కోరారు.