India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బార్బడోస్‌లో ఉన్న భారత క్రికెటర్లు ఎయిర్ ఇండియా విమానంలో భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఫ్లైట్ నెవార్క్ నుంచి ఢిల్లీ రావాల్సినదని, చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసి ఆటగాళ్ల కోసం బార్బడోస్‌కు మళ్లించారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేయలేదని సోషల్ మీడియాలో వాపోయారు. దీంతో సీరియస్ అయిన DGCA తమకు సమగ్ర నివేదికను అందించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది.

AP: పాల్వాయిగేటులో ఎస్సీలు ఓట్లు వేయకుండా TDPవాళ్లు అడ్డుకుంటే పిన్నెల్లి అక్కడికెళ్లారని జగన్ చెప్పారు. ‘అక్కడ YCP రిగ్గింగ్ చేసి ఉంటే EVM ఎందుకు పగలగొడతారు? TDP అకృత్యం చేసింది కాబట్టి పిన్నెల్లి అలా చేశారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది. కారంపూడి ఘర్షణ ఘటనలో CI నారాయణస్వామికి పిన్నెల్లి ఎదురుపడలేదు. మే 14న ఘటన జరిగితే 9రోజులకు హత్యాయత్నం కేసు పెట్టారు. ఇది అన్యాయం కాదా?’ అని ప్రశ్నించారు.

మర్డర్ కేసులో నిందితుడైన కన్నడ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి బెంగళూరు కమిషనర్‌కు తాజాగా లేఖ రాశారు. కేసులో మరో నిందితురాలైన పవిత్రను ‘దర్శన్ భార్య’ అనొద్దని విజ్ఞప్తి చేశారు. ‘చట్టప్రకారం దర్శన్‌కు నేను మాత్రమే భార్యను. కానీ మీరు, రాష్ట్ర హోంమంత్రి, మీడియా అందరూ పవిత్రను భార్యగా చెబుతున్నారు. అది నాకు, నా బిడ్డకు ఇబ్బందిగా మారుతోంది. దయచేసి మీ రికార్డుల్లో పవిత్రను భార్యగా రాయొద్దు’ అని కోరారు.

సెన్సెక్స్ గత ఏడాది డిసెంబరు 11 నుంచి ఈనెల 3 మధ్య 10వేల పాయింట్లు పెరిగింది. మార్కెట్ విలువ ₹138.89లక్షల కోట్ల నుంచి ₹158లక్షల కోట్లకు చేరింది. ఐదు స్టాక్స్ నుంచే మార్కెట్లలో 50% వృద్ధి నమోదైందని విశ్లేషకులు చెబుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్‌టెల్, SBI, మహీంద్రా & మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇక TCS, అదానీ పోర్ట్స్, HDFC వంటి 11 స్టాక్స్‌తో 30% వృద్ధి నమోదైంది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆయన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కేటాయింపు తదితర కీలక అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. అంతకుముందు రేవంత్ హోంమంత్రి అమిత్ షాను కలిశారు.

ఏ పనినీ చిన్నచూపు చూడకూడదని ఎన్‌విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సూచించారు. పని విలువను గుర్తించినప్పుడే ఎదుగుదల ఉంటుందని పేర్కొన్నారు. ‘నా కెరీర్ ఆరంభంలో ఓ టిఫిన్ సెంటర్‌లో పనిచేశాను. అక్కడ గిన్నెలు శుభ్రం చేసేవాడిని. అనేకసార్లు టాయిలెట్లు కూడా కడిగాను. చేసే పనిని ఎప్పుడూ గౌరవించాలి. అప్పుడు ఆ విషయాన్ని నేర్చుకోవడం వలనే నేడు ఏ పనిలో ఉన్నవారినైనా గౌరవించగలుగుతున్నా’ అని వివరించారు.

PM మోదీని స్పేస్‌లోకి పంపించడం గొప్పగా భావిస్తామన్న ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సెటైర్లు వేశారు. ‘స్పేస్‌లోకి వెళ్లేముందు బయోలాజికల్ పీఎం మణిపుర్ వెళ్లాలి’ అని ట్వీట్ చేశారు. గతేడాది మణిపుర్‌లో తెగల మధ్య హింస వల్ల సుమారు 225 మంది మరణించారు. మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఈ ఘటనలు తీవ్ర చర్చనీయాంశం కాగా నిన్న రాజ్యసభలో మోదీ తొలిసారి మణిపుర్ అంశంపై మాట్లాడారు.

బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి. సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ, కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ కలుపుకొని 650 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. 4.6 కోట్లమంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బ్రిటన్ కాలమానం ప్రకారం రాత్రి పదింటికి ఓటింగ్ ముగియగానే కౌంటింగ్ చేపట్టి ఫలితాల్ని ప్రకటిస్తారు.

టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెటర్లకు మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆహ్వానం అందింది. ఆ రాష్ట్రానికి చెందిన రోహిత్‌శర్మ, సూర్య కుమార్ యాదవ్, శివం దూబే, యశస్వీ జైస్వాల్ అసెంబ్లీకి వెళ్లి సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిసే అవకాశం ఉంది. ఇతర క్రికెటర్లను సైతం ఆయా రాష్ట్రాల సీఎంలు సత్కరిస్తారు.

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్స్ టారిఫ్‌లు పెంచి యూజర్లకు షాక్ ఇచ్చాయి. అయితే ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని అధికార వర్గాల సమాచారం. టెలికాం రంగంలో సంస్థల మధ్య తగిన పోటీ ఉందని, కేంద్రం జోక్యం చేసుకునేంత పరిస్థితులు లేవని పేర్కొన్నాయి. బయటదేశాలతో పోలిస్తే భారత్‌లో టారిఫ్ ధరలు ఇంకా తక్కువగానే ఉన్నట్లు తెలిపాయి. అయితే టెలికాం సంస్థలు సేవల్లో నాణ్యత పెంచుకోవాల్సి అవసరం ఉందని సూచించాయి.
Sorry, no posts matched your criteria.