India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఎమ్మెల్యే అభ్యర్థులకు TDP చీఫ్ చంద్రబాబు బీ ఫామ్‌లు అందజేశారు. దెందులూరు అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, నరసరావుపేట అభ్యర్థి చదలవాడ అరవిందబాబుతోపాటు మరికొందరికి బీ ఫామ్‌లు ఇచ్చారు. దెందులూరును BJPకి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ TDP అభ్యర్థి చింతమనేనికే బీ ఫామ్ ఇచ్చారు. కాగా ఇటీవల ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు చంద్రబాబు బీ ఫామ్ అందించారు. ఆరోజు పలు కారణాలతో14 మంది బీ ఫామ్‌లు తీసుకోలేదు.

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 26 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఏప్రిల్ 5న విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

TG: కేసీఆర్ ఇంటర్వ్యూపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ మాటల్లో ఫ్రస్ట్రేషన్ కనిపించిందని అన్నారు. 9 ఏళ్ల తర్వాత ఆయన అసలు స్వరూపం బయటపడిందని చెప్పారు. తిట్ల పురాణం మొదలుపెట్టింది బీఆర్ఎస్ చీఫ్ అని దుయ్యబట్టారు. కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందన్నారు.

12th ఫెయిల్ మూవీ స్టోరీకి కారణమైన రియల్ లైఫ్ ఆఫీసర్ మనోజ్ కుమార్ ఐజీగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆయన ‘కొత్త ఛార్జ్’ అంటూ బాధ్యతలు స్వీకరించిన ఫొటోలను ట్వీట్ చేశారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా ఉన్న ఆయనకు ఇటీవలే ఇన్స్పెక్టర్ జనరల్‌గా ఉద్యోగోన్నతి లభించింది. 12వ తరగతిలో ఫెయిలైన మనోజ్ కుమార్ తర్వాత ఐపీఎస్ అయ్యి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇవాళ ఐపీఎల్లో వందో మ్యాచ్ ఆడనున్నారు. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌తో ఆయన ఈ ఘనత అందుకోనున్నారు. గిల్ ఇప్పటివరకు ఐపీఎల్లో 3,000కుపైగా పరుగులు చేశారు. అందులో 3 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్లో కూడా ఆయన అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 298 రన్స్ బాదారు.

మరణించిన వ్యక్తుల ఆస్తుల్ని కూడా కాంగ్రెస్ దోచుకుంటుందని PM మోదీ విమర్శించారు. వారసత్వ పన్ను గురించి కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన <<13113751>>వ్యాఖ్యలపై<<>> మండిపడ్డారు. ‘తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన సంపదపై పన్ను విధించాలని కాంగ్రెస్ అంటోంది. అలా చేస్తే ప్రజలు కష్టపడి సంపాదించిందంతా వారి పిల్లలకు దక్కదు’ అని ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.

వేసవి సెలవులు వచ్చేశాయి. హాలిడేస్ అంటే చాలు తల్లిదండ్రులకు పెద్ద టెన్షన్. ఈ క్రమంలో.. కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదంటున్నారు నిపుణులు.
* మిట్టమధ్యాహ్నం పిల్లల్ని బయటికి పంపొద్దు.
* ఫోన్ అలవాటు కాకుండా వారిని ఇండోర్ గేమ్స్‌లో తలమునకలుగా ఉంచండి.
* వాహనాల తాళాలు పిల్లలకు తెలియకుండా దాచండి.
* చెరువులు, కాలువల వద్దకు ఒంటరిగా పంపొద్దు.
* నీడ పట్టున స్నేహితులతో ఆడుకునేలా చూడండి.

ముస్లింలపై ప్రధాని మోదీ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ముస్లింలపై ద్వేషమేనా మోదీ గ్యారంటీ? 2002 నుంచి ఆయన ఇదే చేస్తున్నారు. రేపు దేశంలో అల్లర్లు మొదలైతే కచ్చితంగా ప్రధానే బాధ్యత వహించాలి. దేశంలో 17కోట్లమంది ముస్లింలున్నారు. వారికి కూడా ఆయనే ప్రధాని. ఈ విధంగా ముస్లింలను ద్వేషించడం దారుణం’ అని వ్యాఖ్యానించారు.

రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ సాధించింది. ఈ మూవీకి కొనసాగింపుగా మొదలు పెట్టిన ‘డబుల్ ఇస్మార్ట్’కు సంబంధించి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ మూవీని హీరో రామ్ రెమ్యునరేషన్ లేకుండా చేస్తున్నట్లు సమాచారం. సినిమాకు వచ్చిన లాభాల్లో వాటా తీసుకోవడానికి ఆయన అంగీకరించినట్లు చెబుతున్నారు. రెమ్యునరేషన్ కోసం షూటింగ్‌ను ఆపేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెల్త్ సర్వే చేపడతామన్న వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. ‘మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పలేదు. ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందనే విషయం తెలుసుకోవాలని అన్నాను. దీనికే దేశాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర అంటూ ప్రధాని మోదీ, BJP ఆరోపిస్తున్నాయి’ అని తెలిపారు. కాగా ఈనెల 7న హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా అధికారంలోకి వస్తే వెల్త్ సర్వే చేస్తామని ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.