News April 21, 2024

యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల

image

భారత వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, పీహెచ్‌డీకి అర్హత కోసం నిర్వహించే ‘యూజీసీ నెట్‌’కు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలైనట్లు యూజీసీ తెలిపింది. ఈ ఏడాది జూన్ 16న దేశవ్యాప్తంగా పరీక్షను నిర్వహించనున్నారు. వచ్చే నెల 10న రాత్రి 11.50గంటలకు దరఖాస్తుల గడువు ముగియనుంది. అప్లికేషన్లలో పొరపాట్లుంటే వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ మధ్యలో సరిచేసుకోవచ్చు.

News April 21, 2024

స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లకు ‘నందిని’ స్పాన్సర్

image

కర్ణాటకకు చెందిన ‘నందిని’ డెయిరీ బ్రాండ్ 2 క్రికెట్ జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. జూన్ 1 నుంచి జరగనున్న T20 WCలో పాల్గొనే స్కాట్లాండ్, ఐర్లాండ్ టీమ్స్‌కు ‘నందిని’ స్పాన్సర్‌గా ఉండనున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(KMF) ప్రకటించింది. అలాగే టోర్నీ సందర్భంగా అమెరికాలో ‘నందిని స్ప్లాష్’ పేరిట ఎనర్జీ డ్రింక్‌ను కూడా విక్రయించనున్నట్లు పేర్కొంది. అమెరికా, వెస్టిండీస్‌లో WC జరగనుంది.

News April 21, 2024

IPL: ఒకే ఓవర్‌లో 6,4,4,6,4,4

image

బెంగళూరుతో మ్యాచులో KKR ఓపెనర్ ఫిల్ సాల్ట్ విరుచుకుపడ్డారు. ఫెర్గూసన్ వేసిన 4వ ఓవర్‌లో ఏకంగా 6,4,4,6,4,4 బాదారు. దీంతో ఆ ఓవర్‌లో 28 రన్స్ పిండుకున్నారు. సాల్ట్ కేవలం 14 బంతుల్లోనే 48 పరుగులు చేసి ఔటయ్యారు.

News April 21, 2024

మాల్దీవుల్లో ఎలక్షన్స్.. అధికార పక్షానికి అగ్నిపరీక్ష!

image

మాల్దీవుల్లో 93 స్థానాలకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. 6 పార్టీల నుంచి 368 మంది పోటీలో ఉన్నారు. ఫలితాలు రేపు రానుండగా, ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు పార్టీ ‘పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్’కు షాక్ తగిలే ఛాన్సుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముయిజ్జు చేపట్టిన భారత వ్యతిరేక చర్యల నేపథ్యంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన ప్రతిపక్షమైన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీకి మెజారిటీ రావొచ్చని అంటున్నారు.

News April 21, 2024

కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు

image

పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ కొత్త రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ T20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 3వేల పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచారు. 79 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత అందుకున్నారు. 81 ఇన్నింగ్సుల్లో ఈ మైలురాయిని చేరుకున్న కోహ్లీ, బాబర్‌లను రిజ్వాన్ వెనక్కి నెట్టారు. నిన్న కివీస్‌తో మ్యాచులో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో 3వేల పరుగులు చేసిన ఎనిమిదో బ్యాటర్ రిజ్వాన్.

News April 21, 2024

బాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లుంది: సజ్జల

image

AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లో ఏ కోశానా నాయకుడి లక్షణాలు లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ‘చంద్రబాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లు ఉంది. ఒక పార్టీ అధ్యక్షుడిలా ఆయన వ్యవహరించడం లేదు. బాబు బటన్ నొక్కితేనే పవన్ మాట్లాడతారు. కాపుల హక్కుల కోసం ఆయన ఏనాడైనా నోరువిప్పారా? జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకే కూటమిగా వస్తున్నారు. జగన్ ఓ వైపు.. గుంటనక్కలు మరో వైపు’ అని ఆయన మండిపడ్డారు.

News April 21, 2024

శభాష్.. నటరాజన్

image

నిన్నటి మ్యాచులో SRH బౌలర్ నటరాజన్ ప్రదర్శన ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ బౌలింగ్ చేసిన నటరాజన్ మూడు వికెట్లు తీయడమే కాకుండా.. ఏకంగా మెయిడిన్ వేశారు. మొత్తం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన నటరాజన్ 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీశారు. బ్యాటర్లు రెచ్చిపోయిన మ్యాచులో 5లోపు ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘శభాష్.. నటరాజన్’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News April 21, 2024

అనపర్తి టీడీపీ టికెట్‌పై సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెర

image

AP: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్‌పై సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ససేమిరా అంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మెత్తబడ్డారు. చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి బుజ్జగించడంతో బీజేపీలో చేరేందుకు ఆయన అంగీకరించినట్లు సమాచారం. ఎన్నికల నిమిత్తం నల్లమిల్లి త్వరలోనే బీజేపీలో చేరతారని, దీనికోసం బీజేపీ నేతలతో స్వగృహంలో భేటీ అయ్యారని సన్నిహితులు చెబుతున్నారు.

News April 21, 2024

రేపు ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం

image

AP: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. అయితే వీటన్నిటికన్నా ఒంటిమిట్ట చాలా ప్రత్యేకం. ఆంధ్రా భద్రాద్రిగా పేరొందిన ఒంటిమిట్ట క్షేత్రంలో రేపు రాములోరి కళ్యాణం జరుగుతుంది. సా.6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సీతారాముల కళ్యాణం వేడుకగా నిర్వహిస్తారు. కోదండరాముడి కళ్యాణోత్సవం కోసం తూ.గో జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు అప్పారావు 180 కిలోల తలంబ్రాలను అందజేశారు.

News April 21, 2024

IPL: బెంగళూరు బౌలింగ్

image

కోల్‌కతాతో మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నారు. మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచుకు కూడా దూరమయ్యారు.
KKR: సాల్ట్, నరైన్, వెంకటేష్, శ్రేయాస్, రఘువంశీ, రింకు, రస్సెల్, రమణదీప్, స్టార్క్, చక్రవర్తి, హర్షిత్.
RCB: డుప్లెసిస్, కోహ్లి, జాక్స్, పటీదార్, గ్రీన్, దినేష్ కార్తీక్, లోమ్రోర్, కర్ణ్ శర్మ, ఫెర్గూసన్, దయాల్, సిరాజ్.