News May 13, 2024

పోలింగ్‌లో శ్రీనగర్ కొత్త రికార్డు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీనగర్‌లో ఈరోజు పోలింగ్ జరిగింది. రాత్రి 8గంటలకు 36.58% పోలింగ్ నమోదైంది. 1998 తర్వాత ఇదే అత్యధికమని ఎన్నికల సంఘం తెలిపింది. 1996లో 40.94% రాగా.. 1998లో 30.06% నమోదైంది. 1999లో 11.93%, 2004లో 18.57% 2009లో 25.55%, 2014లో 25.86%, 2019లో 14.43% పోలింగ్ జరిగింది. అక్కడ మొత్తం 17.48లక్షల ఓటర్లున్నారు.

News May 13, 2024

టాప్ ప్లేస్‌కి KKR.. GT ఔట్

image

KKR, GT మధ్య జరగాల్సిన మ్యాచ్‌కి వర్షం అడ్డుతగిలింది. మ్యాచ్ జరగాల్సిన అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. ఇరుజట్లకూ చెరో పాయింట్ లభించింది. దీంతో KKR టేబుల్ టాప్‌‌ప్లేస్‌కు చేరగా, GT టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం GTకి 11పాయింట్లున్నాయి. తర్వాతి మ్యాచ్ SRHతో గెలిచినా 13పాయింట్లే అవుతాయి. దీంతో గుజరాత్ అధికారికంగా లీగ్ నుంచి ఎలిమినేట్ అయిన 3వ జట్టుగా నిలిచింది.

News May 13, 2024

కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి: హరీశ్ రావు

image

TG: ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు నిర్విరామంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ‘ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి. అంకితభావంతో మీరు పడిన కష్టం అందరికీ స్ఫూర్తిదాయకం’ అని హరీశ్ రావు తెలిపారు.

News May 13, 2024

నెదర్లాండ్స్ T20WC టీమ్‌లో తెలుగు కుర్రాడు

image

టీ20 వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్ జట్టును ప్రకటించింది. స్కాట్ ఎడ్వర్డ్స్ కెప్టెన్‌గా 15 మంది సభ్యులతో ప్రకటించిన టీమ్‌లో తెలుగు కుర్రాడు తేజా నిడమనూరుకి చోటు దక్కింది.
జట్టు: ఎడ్వర్డ్స్, ఆర్యన్ దత్, బాస్ డి లీడ్, డేనియల్ డోరమ్, ఫ్రెడ్ క్లాసెన్, లోగాన్ వాన్ బీక్, మాక్స్ ఓ’డౌడ్, మైఖేల్ లెవిట్, పాల్ వాన్ మీకెరెన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజా నిడమనూరు, ప్రింగిల్ సింగ్, విక్రమ్‌జిత్ కింగ్మా, వెస్లీ

News May 13, 2024

గ్రేట్.. వందశాతం పోలింగ్ నమోదు

image

TG: మెదక్ జిల్లాలోని సంగాయిపేట తండా ప్రజాస్వామ్య విలువను చాటి చెప్పింది. మెదక్ MP ఎన్నికల్లో భాగంగా కొల్చారం మండలంలోని సంగాయిపేట తండాలో ఏకంగా 100శాతం పోలింగ్ నమోదైంది. ఆ తండాలో మొత్తం 210 మంది ఓటర్లు ఉండగా.. అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 95 మంది పురుషులు, 115 మంది మహిళలు ఓట్లు వేయడంతో ఓటింగ్ సంపూర్ణమైంది. దీంతో తండా వాసులను మెదక్ కలెక్టర్ అభినందించారు.

News May 13, 2024

VIRAL: అవును.. ఇదీ పోలింగ్ కేంద్రమే

image

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, నాగర్‌కర్నూల్ జిల్లాలోని రాయలేటి పెంటలో ఓ పోలింగ్ కేంద్రం ఆకట్టుకుంది. అక్కడి పరిస్థితుల దృష్ట్యా అధికారులు ఓ పూరి గుడిసెను సహాయక పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. చెంచు గిరిజన ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ బ్యూటిఫుల్ కేంద్రాన్ని మీరూ చూసేయండి.

News May 13, 2024

నా ఓటు వేరేవాళ్లు వేశారు: పుణే కాంగ్రెస్ చీఫ్

image

తన పేరుతో వేరే వాళ్లు ఓటు వేశారని పుణే కాంగ్రెస్ పార్టీ చీఫ్ అరవింద్ షిండే వెల్లడించారు. రాస్తా పేత్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వెళ్లగా అప్పటికే ఎవరో తన ఓటు వేసినట్లు గుర్తించి షాకయ్యానని చెప్పారు. అధికారులతో మాట్లాడి బ్యాలెట్ పేపర్ల ద్వారా ‘టెండర్ ఓటు’ వేసినట్లు తెలిపారు. కాగా మహారాష్ట్ర మొత్తంగా ఈరోజు 52.49శాతం ఓటింగ్ నమోదైంది.

News May 13, 2024

అసెంబ్లీ ఓటమి తర్వాత గట్టిగా పోరాడారు: KTR

image

TG: లోక్‌సభ ఎన్నికల్లో పనిచేసిన బీఆర్ఎస్ సైనికులకు ధన్యవాదాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘అసెంబ్లీ ఓటమి తర్వాత పోరాటం అంత సులువు కాదు. అయినా గట్టిగా పుంజుకుని పోరాడారు. కేసీఆర్ అండగా నిలబడటంతో అద్భుత ధైర్యం ప్రదర్శించారు. క్లిష్టమైన యుద్ధంలో పోరాడిన అందరికీ ధన్యవాదాలు’ అని కేటీఆర్ రాసుకొచ్చారు.

News May 13, 2024

ముగిసిన పోలింగ్.. 22 రోజులు ఉత్కంఠ

image

AP: రాష్ట్రంలో రెండు నెలలుగా ఎన్నికల పోరు హోరెత్తింది. వైసీపీ- కూటమి(TDP,BJP,JSP) ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. కొందరు ఓటర్లను ప్రలోభపెట్టారు. చివరికి ఇవాళ అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 22 రోజుల తర్వాత.. అంటే జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తేలాలంటే అప్పటివరకు ఆగాల్సిందే. అప్పటివరకు అభ్యర్థులు, వారి అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగనుంది.

News May 13, 2024

ఊహించని ఫలితాలు చూడబోతున్నాం: CBN

image

AP: ఈసారి ఊహించని ఫలితాలు చూడబోతున్నామని TDP అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కసి ప్రతీ ఒక్కరిలో కనిపించిందని అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే YCP వాళ్లు కుట్రలు పన్నుతూ వచ్చారని, అయితే.. ప్రజాస్వామ్యస్ఫూర్తితో వారి కుట్రలను TDP శ్రేణులు భగ్నం చేశాయని అన్నారు. YCP హింసను ప్రేరేపించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిందని, తాము దీటుగా ఎదుర్కోవడంతో వారి ఆటలు సాగలేదని బాబు అన్నారు.