India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈవీఎం వ్యవస్థను అత్యంత సురక్షితమైన, కచ్చితమైన ఓటింగ్ ప్రక్రియగా ఈసీ పేర్కొంటుంది. ప్రస్తుతం 2006 తర్వాత వచ్చిన EVM మోడల్స్‌ను వినియోగిస్తున్నారు. ఒక్క ఈవీఎంలో 2వేల ఓట్ల వరకు నమోదు చేయొచ్చు. ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ సంయుక్తంగా రూపొందించిన ఈ మెషీన్లు 15 ఏళ్ల వరకు పనిచేయగలవు. ఇందులోని కంట్రోల్ యూనిట్ మనం వేసిన ఓట్లకు సంబంధించిన డేటాను 10ఏళ్ల వరకు స్టోర్ చేయగలదు.

తెలంగాణలో BJP కొత్త శక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్ర మంత్రి, BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర నాయకత్వం అనేక రకాలుగా తమకు సహకరించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి నడ్డా నాయకత్వంలో BJP సంపూర్ణ సహకారం అందించిందని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను ఏటా అధికారికంగా నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు..

బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ(72) కన్నుమూశారు. కొన్ని నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ట్వీట్ చేశారు. సుశీల్ కుమార్ మోదీ తన 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజ్యసభ, లోక్‌సభ, శాసన మండలి, శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీనగర్‌లో ఈరోజు పోలింగ్ జరిగింది. రాత్రి 8గంటలకు 36.58% పోలింగ్ నమోదైంది. 1998 తర్వాత ఇదే అత్యధికమని ఎన్నికల సంఘం తెలిపింది. 1996లో 40.94% రాగా.. 1998లో 30.06% నమోదైంది. 1999లో 11.93%, 2004లో 18.57% 2009లో 25.55%, 2014లో 25.86%, 2019లో 14.43% పోలింగ్ జరిగింది. అక్కడ మొత్తం 17.48లక్షల ఓటర్లున్నారు.

KKR, GT మధ్య జరగాల్సిన మ్యాచ్‌కి వర్షం అడ్డుతగిలింది. మ్యాచ్ జరగాల్సిన అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. ఇరుజట్లకూ చెరో పాయింట్ లభించింది. దీంతో KKR టేబుల్ టాప్‌ప్లేస్‌కు చేరగా, GT టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం GTకి 11పాయింట్లున్నాయి. తర్వాతి మ్యాచ్ SRHతో గెలిచినా 13పాయింట్లే అవుతాయి. దీంతో గుజరాత్ అధికారికంగా లీగ్ నుంచి ఎలిమినేట్ అయిన 3వ జట్టుగా నిలిచింది.

TG: ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు నిర్విరామంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ‘ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి. అంకితభావంతో మీరు పడిన కష్టం అందరికీ స్ఫూర్తిదాయకం’ అని హరీశ్ రావు తెలిపారు.

టీ20 వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్ జట్టును ప్రకటించింది. స్కాట్ ఎడ్వర్డ్స్ కెప్టెన్‌గా 15 మంది సభ్యులతో ప్రకటించిన టీమ్‌లో తెలుగు కుర్రాడు తేజా నిడమనూరుకి చోటు దక్కింది.
జట్టు: ఎడ్వర్డ్స్, ఆర్యన్ దత్, బాస్ డి లీడ్, డేనియల్ డోరమ్, ఫ్రెడ్ క్లాసెన్, లోగాన్ వాన్ బీక్, మాక్స్ ఓ’డౌడ్, మైఖేల్ లెవిట్, పాల్ వాన్ మీకెరెన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజా నిడమనూరు, ప్రింగిల్ సింగ్, విక్రమ్‌జిత్ కింగ్మా, వెస్లీ

TG: మెదక్ జిల్లాలోని సంగాయిపేట తండా ప్రజాస్వామ్య విలువను చాటి చెప్పింది. మెదక్ MP ఎన్నికల్లో భాగంగా కొల్చారం మండలంలోని సంగాయిపేట తండాలో ఏకంగా 100శాతం పోలింగ్ నమోదైంది. ఆ తండాలో మొత్తం 210 మంది ఓటర్లు ఉండగా.. అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 95 మంది పురుషులు, 115 మంది మహిళలు ఓట్లు వేయడంతో ఓటింగ్ సంపూర్ణమైంది. దీంతో తండా వాసులను మెదక్ కలెక్టర్ అభినందించారు.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, నాగర్‌కర్నూల్ జిల్లాలోని రాయలేటి పెంటలో ఓ పోలింగ్ కేంద్రం ఆకట్టుకుంది. అక్కడి పరిస్థితుల దృష్ట్యా అధికారులు ఓ పూరి గుడిసెను సహాయక పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. చెంచు గిరిజన ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటిఫుల్ కేంద్రాన్ని మీరూ చూసేయండి.

తన పేరుతో వేరే వాళ్లు ఓటు వేశారని పుణే కాంగ్రెస్ పార్టీ చీఫ్ అరవింద్ షిండే వెల్లడించారు. రాస్తా పేత్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వెళ్లగా అప్పటికే ఎవరో తన ఓటు వేసినట్లు గుర్తించి షాకయ్యానని చెప్పారు. అధికారులతో మాట్లాడి బ్యాలెట్ పేపర్ల ద్వారా ‘టెండర్ ఓటు’ వేసినట్లు తెలిపారు. కాగా మహారాష్ట్ర మొత్తంగా ఈరోజు 52.49శాతం ఓటింగ్ నమోదైంది.
Sorry, no posts matched your criteria.