India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీరిక లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇండియా కూటమి తరఫున ప్రధాని రేసులో ఉన్నారా అని కేజ్రీవాల్‌ను ప్రశ్నించగా.. తాను లేనని బదులిచ్చారు. కేంద్రంలో కూటమి అధికారంలోకి వస్తే ఆప్ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

అమ్మ అనే పిలుపు లేకుండా మన రోజు గడవదు. సినిమాల్లోనూ అమ్మ పాత్రను దర్శకులు ప్రత్యేకంగా నిలిపారు. ఈ సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’ సహా ఎన్నో సినిమాలు తల్లి ప్రేమతో ముడిపడినవే. ఒకే ఒక జీవితం, అమ్మ చెప్పింది, బిచ్చగాడు, ఛత్రపతి, యోగి, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, నానీ, యమలీల, మాతృదేవోభవ, అమ్మ రాజీనామా వంటి చిత్రాలు మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కి హిట్టయ్యాయి.
మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

సినీ ప్రపంచంలో ప్రఖ్యాత పురస్కారంగా భావించే ‘ఆస్కార్’ శతాబ్ది వేడుకలకు నిర్వాహకులు సన్నాహాలు మొదలుపెట్టారు. 2028లో జరిగే ఈ కార్యక్రమం కోసం 500 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.4,000 కోట్లు) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 100 మిలియన్ డాలర్లు సమకూర్చుకున్నారు. ఈ వేడుకల్లోనే మరో వందేళ్లు ఎలా నిర్వహించాలనే దానిపై చర్చించనున్నారు. 97వ ఆస్కార్ వేడుకలు వచ్చే ఏడాది మార్చి 2న జరగనున్నాయి.

AP: ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైనందుకు నంద్యాల SP రఘువీరారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం DGPని ఆదేశించింది. ఆయనపై ఛార్జెస్ ఫైల్ చేయాలని సూచించింది. SPతోపాటు SDPO రవీంద్రనాథ్ రెడ్డి, CI రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నిన్న హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు అనుమతి లేకపోయినా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై ఫిర్యాదులు అందడంతో EC చర్యలకు ఆదేశించింది.

మమతా బెనర్జీ పాలనలో చొరబాటుదారులు అభివృద్ధి చెందుతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. బరాక్‌పూర్‌లో మాట్లాడుతూ.. ‘ఇక్కడి ప్రజలకు 5 గ్యారంటీలు ఇస్తున్నా. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు. SC, ST, OBC రిజర్వేషన్లను ఎవరూ టచ్ చేయలేరు. శ్రీరామ నవమి జరుపుకోకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. రామ మందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు కాదు. CAA అమలును ఎవరూ అడ్డుకోలేరు’ అని స్పష్టం చేశారు.

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు తనకు వేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తుండగా ఓటు హక్కు మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. పొత్తులో భాగంగా మంగళగిరి నుంచి టీడీపీ తరఫున నారా లోకేశ్ పోటీ చేస్తుండటంతో పవన్ సైకిల్ గుర్తుకే ఓటు వేసే అవకాశం ఉంది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చివరి నిమిషంలో ఖరారు కావడంతో ఓటు ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం లేకుండా పోయిందని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.

బెల్జియంలోనే కాకుండా అర్జెంటీనాలోనూ పౌరులు ఓటు వేయడం తప్పనిసరి. అక్కడ 112 ఏళ్ల నుంచి ఈ చట్టం అమల్లో ఉంది. 18-70 ఏళ్ల వారు కచ్చితంగా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. ఉల్లంఘిస్తే అందుకు సరైన కారణాలు వెల్లడించాలి. లేదంటే 5-50 డాలర్ల ఫైన్ చెల్లించడం, మూడేళ్ల పాటు ప్రభుత్వ పదవుల్లో ఉండకుండా నిషేధం వంటి ఆంక్షలు ఉన్నాయి. అయితే పాలకుల నిర్లక్ష్యంతో ఈ నిబంధనలు అమలుకావడం లేదు.

AP: ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు. ‘సీవిజిల్’ యాప్‌లో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ప్రలోభాలకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. అర్బన్ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వందశాతం పోలింగ్ అయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

TG: పోలింగ్ సమీపిస్తుండటంతో ఓటర్లు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో ఆర్టీసీలో సంక్రాంతి రికార్డు బ్రేక్ అయింది. సంక్రాంతి కన్నా 10 శాతం అదనంగా ఆర్టీసీ బస్సులను ప్రయాణికులు వినియోగించుకున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 9 నుంచి 11 వరకు 1.42 లక్షల మంది ప్రయాణం చేసినట్లు పేర్కొన్నారు. ఏపీకి 59,800 మంది ప్రయాణించినట్లు తెలిపారు. ఇవాళ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ హింసతో అట్టుడుకుతోంది. తాజాగా ఓ పోలీసుపై అవామీ యాక్షన్ కమిటీ ఆందోళనకారులు మూకుమ్మడిగా దాడి చేయడంతో.. అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 90 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా పెరిగిన ధరలను నిరసిస్తూ ఉచిత విద్యుత్, గోధుమలపై రాయితీ కల్పించాలని అవామీ యాక్షన్ ఆందోళనలు చేస్తోంది. ఈ విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని ఉద్యమకారుడు అంజాద్ డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.