India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు(D) తెనాలి రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. ఇక్కడి రాజకీయాల్లో ఓ కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోయింది. 1952,55,62లో ఆలపాటి వెంకట రామయ్య MLAగా గెలుపొందగా.. ఆయన కుమార్తె దొడ్డపనేని ఇందిర కూడా 1967, 72, 78 ఎన్నికల్లో విజయం సాధించారు. వారి తదనంతరం 1999లో ఆలపాటి మనమరాలు గోగినేని ఉమ MLAగా నెగ్గి.. ఎక్కువ మంది MLAలున్న కుటుంబంగా చరిత్ర సృష్టించారు. <<-se>>#ELECTIONS2024<<>>

ఉక్కపోతతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ (IMD) చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈ ఏడాది వడగాల్పులు వీచే అవకాశం లేదని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు చల్లబడటం వల్ల అటు నుంచి వస్తున్న గాలులతో దేశంలో వడగాల్పుల తీవ్రత తగ్గుతోందని తెలిపింది. పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పెరిగే అవకాశం ఉందని వివరించింది.

ఏపీ ఎన్నికల్లో ‘మెగా ఫ్యామిలీ’ మార్క్ కనిపిస్తోంది. ప్రచారానికి చివరిరోజు కావడంతో ఇవాళ పవన్ కళ్యాణ్‌కు మద్దతిచ్చేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురం వెళ్లారు. మరోవైపు తన ఫ్రెండ్ శిల్పా రవి కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల చేరుకున్నారు. అయితే మొన్న పవన్‌కు సప్పోర్ట్‌గా ట్వీట్ చేసిన బన్నీ.. ఈ రోజు వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతివ్వడం గమనార్హం.

AP: వైఎస్సార్ తనకు తండ్రిలా మార్గనిర్దేశం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కడప సభలో తెలిపారు. ‘రాజీవ్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి అన్నదమ్ముల్లా ఉండేవారు. వైఎస్సార్ ఏపీకే కాదు మొత్తం దేశానికే దారి చూపించారు. నా భారత్ జోడో పాదయాత్రకు ఆయనే స్ఫూర్తి. దేశమంతా పాదయాత్ర చేయాలని, అప్పుడే ప్రజల సమస్యలు తెలుస్తాయని వైఎస్సారే నాకు చెప్పారు’ అని రాహుల్ గుర్తు చేసుకున్నారు.

* కొత్త ఐఓఎస్ వెర్షన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.
* ఫోన్‌ను ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతల వద్దే ఉంచాలి. 35°C కంటే ఎక్కువ వేడి తగిలితే బ్యాటరీ సామర్థ్యం దెబ్బతింటుంది.
* ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ కేసు/పౌచ్ తీసేయాలి.
* కొన్ని రోజులు ఫోన్ వాడొద్దు అనుకున్నప్పుడు 50% ఛార్జింగ్‌తో స్టోర్ చేయడం మంచిది.
* ఛార్జింగ్ చాలా తక్కువ ఉంటే ‘లో పవర్ మోడ్’ను యాక్టివేట్ చేసుకోవాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏనాడూ కృషి చేయలేదని అమిత్ షా విమర్శించారు. ‘ఉగ్రవాదులను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చింది. దేశంలో ఉగ్రవాదాన్ని పారదోలడానికి మోదీ కృషి చేశారు. అయోధ్యలో రామమందిరం అంశాన్ని కాంగ్రెస్ 70ఏళ్లుగా నాన్చుతూ వచ్చింది. మోదీ రెండోసారి PM కాగానే ఐదేళ్లలో ఆలయాన్ని నిర్మించారు. కాంగ్రెస్, మజ్లిస్‌ను రాష్ట్రం నుంచి తరిమే శక్తి BJPకే ఉంది’ అని వికారాబాద్‌లో వ్యాఖ్యానించారు.

ఎన్నికల వేళ ప్రధాని మోదీ విస్తృత పర్యటనలతో దక్షిణాదిలో BJP భవిష్యత్తు చర్చనీయాంశమైంది. దక్షిణాదిపై పట్టు సాధించాలనేది ఆ పార్టీ కల. కర్ణాటకలో ఇప్పటికే BJP మార్క్ ఉన్నా తెలంగాణలో నిలదొక్కుకోవడాన్ని ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందంటున్నారు విశ్లేషకులు. ఫలితాల మాట అటుంచితే ఇతర దక్షిణాది రాష్ట్రాలతో (కర్ణాటక కాకుండా) పోలిస్తే తెలంగాణలో BJP పాగా వేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయట. <<-se>>#Elections2024<<>>

నిజాం, రజాకార్ల చరిత్రను బీజేపీ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోందనేది విశ్లేషకుల మాట. BJP తెలంగాణలో ఈ స్థాయికి రావడం వెనుక RSS కృషి సైతం ఉందన్నారు. ‘ఒకప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉండే TG ప్రాంతాలు ఆర్యసమాజ్‌కు కంచుకోట. ఆ ప్రభావం తగ్గాక దానిని RSS క్యాష్ చేసుకుని లెఫ్ట్ వ్యతిరేకుల మద్దతు కూడగట్టింది. 1984లో హనుమకొండ ఎంపీ సీటును బీజేపీ గెలవడమే ఇందుకు నిదర్శనం’ అని తెలిపారు.<<-se>>#Elections2024<<>>

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని సీఎం జగన్ విరుచుకుపడ్డారు. ‘బాలకృష్ణ రిషికొండలో, దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నారు. వీరిద్దరిని అడుగుతున్నా.. మీకు ఒరిజనల్ డాక్యుమెంట్లు ఇచ్చారా? జిరాక్సులిచ్చారా? ఏపీలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న 9 లక్షల మందికి ఒరిజనల్ డాక్యుమెంట్లే ఇచ్చాం. చంద్రబాబు కుట్రలతో పథకాల నగదును లబ్ధిదారులకు అందకుండా చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు.

TG: సర్జికల్ స్ట్రైక్స్‌పై CM రేవంత్ తమాషాగా మాట్లాడారని అమిత్‌షా ఫైరయ్యారు. ‘సర్జికల్ స్ట్రైక్స్ చేసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. మేం స్ట్రైక్స్ చేసి పాక్‌లో ఉగ్రవాదులను ఏరిపారేశాం. POK భారత్ ఆధీనంలోనే ఉంటుంది. BJP ఉన్నంత వరకు POKను పాక్ వశం కాకుండా చూస్తాం’ అని వికారాబాద్ సభలో ప్రసంగించారు. సర్జికల్ స్ట్రైక్స్ నిజంగా జరిగాయో లేదో ఎవరికీ తెలియదని రేవంత్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.