News May 10, 2024

TGలో రైతు భరోసాకు ఎలా అనుమతిచ్చారు?: హైకోర్టు

image

AP: ఎన్నికల నిర్వహణపై ఒక్కో రాష్ట్రానికి వేర్వేరుగా ప్రమాణాలు ఎందుకని ఈసీని హైకోర్టు ప్రశ్నించింది. ‘TGలో రైతు భరోసాకు ఎలా అనుమతిచ్చారు? APలో పథకాలను ఏవిధంగా అడ్డుకుంటున్నారు? 2019లో పసుపు-కుంకుమకు అనుమతి ఇచ్చినప్పుడు అనుసరించిన నియమాలను ఇప్పుడు పాటించడం లేదని స్పష్టమవుతోంది’ అని పేర్కొంది. నిధుల విడుదలకు ఇక సమయం లేనందున ఎన్నికల తర్వాతే జమ చేయాలని ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.

News May 10, 2024

రెచ్చగొట్టడమే రాజకీయమా?

image

నాయకులు తామేం చేశారో, ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడగాలి. కానీ.. ప్రస్తుతం తెలంగాణలో కొందరు అలా చేయడం లేదు. ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పర్యవసానాల గురించి ఆలోచించట్లేదు. గతంలో MIM నేత అక్బరుద్దీన్ ‘పోలీసులు పక్కకు జరగండి మాకు 15నిమిషాలు చాలు’ అని నోరు జారితే.. తాజాగా దానికి కౌంటరిస్తూ ‘మాకు 15సెకన్లు చాలు’ అంటూ BJP లీడర్ నవనీత్ కౌర్ అన్నారు. దీనిపై మీ కామెంట్?

News May 10, 2024

IPL: టాస్ గెలిచిన చెన్నై

image

గుజరాత్‌తో మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో కెప్టెన్ రుతురాజ్ బౌలింగ్ ఎంచుకున్నారు.
చెన్నై: రుతురాజ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, దూబే, మొయిన్ అలీ, జడేజా, ధోనీ, సాంట్నర్, సిమర్‌జీత్ సింగ్, శార్దూల్, తుషార్ దేశ్‌పాండే
గుజరాత్: గిల్, సాయి సుదర్శన్, షారుక్, మిల్లర్, మాథ్యూ వేడ్, తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్

News May 10, 2024

పల్నాడులో రక్తచరిత్ర సృష్టించారు: చంద్రబాబు

image

AP: పల్నాడు ప్రాంతాన్ని YCP పాలనలో రక్తంతో తడిపేశారని TDP అధినేత చంద్రబాబు ఆరోపించారు. వాతావరణం అనుకూలించక మాచర్ల సభకు వెళ్లలేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన.. ‘పైరుపంటలతో పచ్చగా ఉండాల్సిన పల్నాడును నాశనం చేశారు. MLA పిన్నెల్లి హత్యా రాజకీయాలు చేశారు. ఆయన పద్ధతి మార్చుకోవాలి. కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు. మేం గెలిచాక ఫ్యాక్షన్ రాజకీయాలను పూర్తిగా అణచివేస్తాం’ అని స్పష్టం చేశారు.

News May 10, 2024

అందుకే పెళ్లి చేసుకోలేదు: కోవై సరళ

image

తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో అనేక వైవిధ్యమైన పాత్రల్ని చేశారు కోవై సరళ. తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం వెనుక కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘పెళ్లి చేసుకోవాలన్న రూలేం లేదు కదా. స్వేచ్ఛగా ఉండాలనే చేసుకోలేదు. మరీ బోర్ కొడితే హిమాచల్ ప్రదేశ్, షిరిడీ లాంటి ప్రాంతాలకు వెళ్తుంటాను. ఒంటరిగా భూమ్మీదకు వచ్చాం. ఆ తర్వాతేగా బంధాలు ఏర్పడ్డాయి. ఒకరిమీద ఆధారపడి బతకాలని నేను అనుకోను’ అని వివరించారు.

News May 10, 2024

బీజేపీ ఇవ్వకపోతే ఇవన్నీ ఎవరు ఇచ్చారు?: మోదీ

image

తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులను కాంగ్రెస్ నేతలు ATMగా మార్చుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘4 వందే భారత్ రైళ్లు తెలంగాణకు ఎవరు ఇచ్చారు? తొలి ఎయిమ్స్, ఫర్టిలైజర్స్ పరిశ్రమ, పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఎవరు ఇచ్చారు? తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని కాంగ్రెస్ అంటోంది. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ బీజేపీ నినాదం’ అని మోదీ పేర్కొన్నారు.

News May 10, 2024

ఈసీ ఏ అధికారంతో క్లారిఫికేషన్ అడిగింది?: హైకోర్టు

image

AP: హైకోర్టు కన్నా తామే ఎక్కువని EC భావిస్తున్నట్లుందని డివిజన్ బెంచ్ మండిపడింది. DBT నిధుల విడుదలకు తాము ఆదేశాలిచ్చిన తర్వాత EC ఏ అధికారంతో క్లారిఫికేషన్ అడిగిందని ప్రశ్నించింది. నవతరం పార్టీ హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘రిట్ అప్పీల్ చేయకుండా హైకోర్టు ఆదేశాలను EC ఎలా పక్కన పెడుతుంది?’ అని నిలదీశారు. నిధుల విడుదలకు సమయం లేనందున విచారణను జూన్‌కు వాయిదా వేశారు.

News May 10, 2024

‘ల్యాండ్ టైటిలింగ్ చట్టం’ కర్త, కర్మ బీజేపీనే: IYR

image

AP: రాష్ట్రంలోని విపక్షాలు విమర్శిస్తోన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు కర్త, కర్మ BJPనేనని మాజీ సీఎస్ IYR కృష్ణారావు వెల్లడించారు. ఆ చట్టాన్ని విమర్శిస్తూ కూటమి నేతలు కొన్ని పత్రికల్లో ఇచ్చిన ప్రకటనను ఆయన ఖండించారు. ‘ఆ యాడ్ ఇచ్చింది TDP తరఫునా లేక కూటమి తరఫునా? ఇలాంటి ప్రకటనలకు కమలం పార్టీ భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? AP BJP నిద్రావస్థలో ఉందా? ఇంకో కారణం ఉందా?’ అని Xలో <>ప్రశ్నించారు.<<>>

News May 10, 2024

తెలంగాణలో RRR టాక్స్: మోదీ

image

తెలంగాణలో కొత్తగా RRR టాక్స్ కూడా మొదలైందని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘RR టాక్స్ విషయంలో నేను ఎవరి పేరు చెప్పలేదు. కానీ ఇక్కడి సీఎం దీనిపై భుజాలు తడుముకున్నారు. RRR టాక్స్‌లో 3వ ఆర్ అంటే రజాకార్ టాక్స్ అని అర్థం. మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదనేది బీజేపీ సిద్ధాంతం. ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని మాత్రమే బీజేపీ చెప్పింది. దానికి కట్టుబడి ఉన్నాం’ అని వెల్లడించారు.

News May 10, 2024

కేజ్రీవాల్ బెయిల్ న్యాయానికి ప్రతీక: స్టాలిన్

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ స్వాగతించారు. దీన్ని అన్యాయానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో సాధించిన విజయంగా అభివర్ణించారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ విడుదలతో ఇండియా కూటమి పుంజుకొని ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.