India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ముస్లింలను ఉద్దేశించి PM మోదీ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ‘ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారని ఎందుకు భయం సృష్టిస్తున్నారు? గణాంకాల ప్రకారం వారి జనాభా, సంతాన వృద్ధి రేటు తగ్గింది. ముస్లింలే ఎక్కువగా కండోమ్‌లు వాడుతారు. ఈ విషయం చెప్పేందుకు నేనేమీ సిగ్గు పడను’ అని స్పష్టం చేశారు. ఇంకెంత కాలం ఇలా భయపెడతారని.. మతమే వేరు కానీ తామంతా భారతీయులమని ఒవైసీ అన్నారు.

ఎన్నికల వేళ మధ్యప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బమ్ నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గుజరాత్‌లోని సూరత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడంతో బీజేపీకి ఏకగ్రీవ విజయం దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండోర్ పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

వేసవి సెలవులు వచ్చేసినా టాలీవుడ్‌లో ఈసారి పెద్ద సినిమాల సందడి లేదు. ఈ గ్యాప్‌లో కొన్ని చిన్న సినిమాలు ఈవారం పలకరించనున్నాయి. అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’, సుహాస్ కీలక పాత్రలో ‘ప్రసన్న వదనం’, తల్లీకూతుళ్ల సెంటిమెంట్‌తో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో ‘శబరి’, తమన్నా, రాశీఖన్నా నటించిన హారర్ కామెడీ ‘బాక్’ చిత్రాలు మే 3న థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

NCP (SP) చీఫ్ శరద్ పవార్ తనను పుతిన్ అని అభివర్ణించడంపై ప్రధాని మోదీ స్పందించారు. “ఆయనపై ఎంతో గౌరవం ఉంది. ఈ ‘పుతిన్’ నేతృత్వంలోని ప్రభుత్వమే 2017లో ఆయనను పద్మవిభూషణ్‌తో గౌరవించినప్పుడు ఆయన గర్వంగా ఫీలయ్యారు” అని తెలిపారు. ED, CBI లేకుండా బీజేపీ ఎన్నికలు గెలవలేదన్న కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చారు. 2014 ఎన్నికల టైమ్‌లోనూ ED, CBI ఉన్నాయని మరి కాంగ్రెస్ ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు.

APలో ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇసుక తవ్వకాలపై మే 9లోపు వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రం, AP ప్రభుత్వాన్ని ఆదేశించింది. NGT తీర్పుపై స్టే విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీం.. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇండియన్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించేందుకు జియో సిద్ధమైంది. మధ్యతరగతి ప్రజలు సులువుగా కొనుగోలు చేసేలా తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురానుంది. Wyzr పేరుతో ఎయిర్ కూలర్లను ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘జియో ఫోన్’లాగే తక్కువ ధరలకే టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషీన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అందించనుంది. పలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకుంది.

UPలోని లక్నోలో విషాదం జరిగింది. 19ఏళ్ల మనీషా ఖాన్ ఇందిరా కెనాల్‌పై తన సోదరి, స్నేహితురాలితో కలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం డాన్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో సోదరి నిషా ఖాన్, దీపాలి 112 ఎమర్జెన్సీ సర్వీస్‌ను సంప్రదించారు. అయితే కాలువలో గజ ఈతగాళ్లతో వెతికించినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదని పోలీసులు తెలిపారు.

AP: టీడీపీ అధినేత చంద్రబాబుకి ఓటేస్తే పథకాలు అన్నీ ఆగిపోతాయని సీఎం జగన్ అన్నారు. అనకాపల్లిలోని చోడవరంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2014లో చంద్రబాబుకి ఓటేస్తే అన్ని వర్గాలను మోసం చేశారని, ఇప్పుడు మళ్లీ నమ్మితే మరోసారి మోసపోవడం ఖాయమని జగన్ ఆరోపించారు. భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. బాబు వస్తే వర్షాలు కూడా రావని అన్నారు.

హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ రివేంజ్ తీర్చుకున్నారు. గత మ్యాచ్‌లో SRH గెలవడంతో ‘సైలెన్స్’ అంటూ చెన్నై అభిమానులను హైదరాబాద్ ఫ్యాన్స్ నోరుమూయించారు. నిన్న CSK గెలవడంతో చెన్నై ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సైలెన్స్ అంటూ SRH ఫ్యాన్స్‌పై రివేంజ్ తీర్చుకున్నారు. స్టేడియంలో సీఎస్‌కే.. సీఎస్‌కే అంటూ నినదించారు. భీకర ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కొంతమంది దుండగులు అమెరికా జెండాను దించి, పాలస్తీనా పతాకాన్ని ఎగురవేశారు. గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌తో అమెరికా సంబంధాలు తెంచుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. హార్వర్డ్ మేనేజ్‌మెంట్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. దీనికి కారణమైన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేసింది.
Sorry, no posts matched your criteria.