India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఐపీఎల్‌లో నిన్న రాత్రి చెన్నై చేతిలో ఘోర ఓటమి అనంతరం ఆ జట్టుపై SRH ఫ్యాన్స్ పలు ఆరోపణలు చేస్తున్నారు. నటరాజన్ బౌలింగ్‌లో దూబేకు వేసిన ఓ బంతి వైడ్ కాకపోయినా థర్డ్ అంపైర్ వైడ్ ఇచ్చారంటున్నారు. ఇక చెన్నై బౌలింగ్ సమయంలో 12వ ఓవర్లో తడి బంతిని మార్చడం, 15వ ఓవర్లో రుతురాజ్ వేలికి చికిత్స కోసం ఆట ఆపడంవంటి వాటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాటిలో తప్పేం లేదంటున్నారు సీఎస్కే ఫ్యాన్స్.

ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. మే 7వ తేదీన రాష్ట్రానికి రానున్న ఆయన.. ఆ రోజున రాజమండ్రి, అనకాపల్లి సభల్లో పాల్గొంటారు. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం పీలేరు సభలో.. సాయంత్రం విజయవాడలో చంద్రబాబు, పవన్, పురందీశ్వరితో కలిసి రోడ్‌షోలో పాల్గొంటారు.

త్వరలో జరిగే T20WCకు జట్టును ఎంపిక చేసేందుకు BCCI కసరత్తులు చేస్తోంది. ఈనేపథ్యంలోనే ప్రస్తుత IPLలో ఆటగాళ్ల ప్రదర్శనలపై దృష్టి పెట్టింది. హార్దిక్, గిల్, సూర్యకుమార్, రింకూ సెలక్టర్లను ఆకట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు WC జట్టును ప్రకటించే గడువు సమీపిస్తోంది. మే 1న 15మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించాల్సి ఉంది. కాగా.. కెప్టెన్ రోహిత్, కోహ్లీ, బుమ్రా, కుల్దీప్ స్థానాలు ఖరారైనట్లు సమాచారం.

భారత కళాచరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు రాజా రవివర్మ. స్వదేశీ, పాశ్చాత్య చిత్రకళల్ని కలగలిపి జీవం ఉట్టిపడే చిత్రాలను గీయడం ఆయన శైలి. 1873లో వియన్నాలో తన పెయింటింగ్స్‌కు మొదటి బహుమతి అందుకున్న అనంతరం ఆయన పేరు మారుమోగింది. నేటికీ ఎవరైనా అమ్మాయి చూడచక్కగా ఉంటే రవివర్మ బొమ్మతో పోల్చడం కనిపిస్తుంటుంది. 1848, ఏప్రిల్ 29న కేరళలో జన్మించిన ఆయన 1906, అక్టోబరు 2న కన్నుమూశారు. నేడు ఆయన జయంతి.

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న వ్యాన్‌ను కారు ఢీకొట్టింది. దీంతో 9మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
> రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మీ కుటుంబాన్ని గుర్తుంచుకోండి.. జాగ్రత్తగా నడపండి.

ఏపీలో జరగబోయే ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు. ‘దేశంలో ఎక్కడైనా ప్రస్తుత ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడింది. APలో మేం(కాంగ్రెస్) షర్మిల నాయకత్వంలో ఇన్నింగ్స్ ప్రారంభించాం. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావాలనేదే మా ప్రణాళిక. పార్టీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై మా దృష్టి ఉంది’ అని రేవంత్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

తెలుగు రాష్ట్రాల ఎన్నికల సమరంలో అంతిమంగా నిలిచేదెవరో ఇవాళ తేలిపోనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల్లో చాలా మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకునే ఛాన్సుంది. ఇప్పటికే స్క్రూటినీలో కొందరి నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. తెరవెనుక చర్చలు, బుజ్జగింపులు, బేరసారాల అనంతరం అసంతృప్తులు, టికెట్లు దక్కక నామినేషన్లు వేసిన వారు వెనక్కి తగ్గే ఛాన్సుంది.

గుజరాత్‌తో మ్యాచులో ఆర్సీబీ సంచలనం సృష్టించింది. 24 బంతులు మిగిలి ఉండగానే 200 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. నిన్న 201 పరుగుల లక్ష్యాన్ని RCB 16 ఓవర్లలోనే ఛేదించిన సంగతి తెలిసిందే. అంతకుముందు 2023లో ఆర్సీబీపై ముంబై 21 బంతులు మిగిలి ఉండగానే 200పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.

AP: రాష్ట్రంలో ఉమ్మడి మేనిఫెస్టోను ఎన్డీయే కూటమి రేపు విడుదల చేయనుంది. వైసీపీ మేనిఫెస్టో ఇప్పటికే విడుదలైంది. టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం పేర్లతో చూచాయగా తమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ప్రధానంగా పెన్షన్‌పై కూటమి దృష్టి పెడుతున్నట్లు సమాచారం. క్రమంగా పెన్షన్‌ను పెంచుకుంటూ వెళ్తామని వైసీపీ అంటుండగా.. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రూ.4 వేల పెన్షన్ ఇస్తామని కూటమి హామీ ఇస్తోంది.

TG: రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. BJP, BRS ఒక్కటేనని అధికార కాంగ్రెస్ అంటుంటే.. కాంగ్రెస్, BRS ఏకమయ్యాయని BJP ఆరోపిస్తోంది. లేదులేదు రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణను నాశనం చేయాలని చూస్తున్నాయని BRS విమర్శిస్తోంది. ఇటీవల పదేపదే ఇవే మాటలు వినిపిస్తుండటంతో ఏయే పార్టీలు కలిసి ఉన్నాయి? అసలు ఈ మాటల్లో కొంతైనా నిజం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మీ కామెంట్? <<-se>>#ELECTIONS2024<<>>
Sorry, no posts matched your criteria.