News May 2, 2024

సుకుమార్ కూతురికి అరుదైన పురస్కారం

image

దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతివేణికి అరుదైన పురస్కారం దక్కింది. ‘గాంధీ తాతా చెట్టు’ అనే సందేశాత్మక చిత్రంలో ఆమె నటనకు గానూ ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఫెస్టివల్’లో ఉత్తమ బాల నటిగా అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెలియజేసింది. ఇప్పటికే ఈ సినిమాకు పలు అవార్డులు వచ్చినట్లు పేర్కొంది.

News May 2, 2024

కార్పోరేట్ సరికొత్త ట్రెండ్.. ఆఫీస్ పికాకింగ్

image

కరోనాతో వర్క్ ఫ్రం‌హోమ్ అలవాటైన ఉద్యోగులను ఆఫీసు రప్పించేందుకు కార్పోరేట్ సంస్థలు కొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి. పని చేసే ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణం కల్పించి, ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించడమే ‘ఆఫీస్ పికాకింగ్’ ట్రెండ్. ఉద్యోగులను రప్పించేందుకు ఆఫీసులో ఇంటి తరహా వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అయితే దీని వల్ల ఫ్రెషర్లు, జూనియర్ ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News May 2, 2024

రిజర్వేషన్లపై రేవంత్ తప్పుడు ప్రచారం: బండి

image

TG: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ సీటుకు కాంగ్రెస్ నేతలు ఎసరు పెట్టారన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 14 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. దీంతో రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రిజర్వేషన్లపై రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

News May 2, 2024

చంద్రబాబు హామీలను బీజేపీ కూడా నమ్మడం లేదు: కేశినేని

image

AP: చంద్రబాబు ఇచ్చే హామీలను బీజేపీ కూడా నమ్మడం లేదని వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని విమర్శించారు. అందుకే బీజేపీ నేతల ఫొటోలు లేకుండా మేనిఫెస్టో రిలీజ్ చేశారని అన్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడని ప్రజలంతా చెప్పుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడే దమ్మున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి పేదల కోసం ఇన్ని పథకాలు అమలు చేయలేదన్నారు.

News May 2, 2024

మే 2: చరిత్రలో ఈరోజు

image

*1519: చిత్రకారుడు, వృక్ష శాస్త్రజ్ఞుడు లియొనార్డో డావిన్సీ మరణం.
*1911: తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు పి. పుల్లయ్య జననం.
*1921: భారత సినిమా దర్శకుడు సత్యజిత్‌ రే జననం.
*1969: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియన్ లారా జననం.
*2002: నటి దేవిక మరణం.

News May 2, 2024

అలాంటి వారిలో సత్యదేవ్ ఒకరు: రాజమౌళి

image

సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ‘కృష్ణమ్మ’ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. సత్యదేవ్ ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా నటిస్తారని కొనియాడారు. పూర్తిస్థాయి నటన కనబరిచే కొద్ది మందిలో సత్య ఒకరని ప్రశంసించారు. ఇలాంటి టాలెంటెడ్ నటులను ఏదో ఒక సినిమా స్టార్ చేస్తుందన్నారు.

News May 2, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 2, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: మే 2, గురువారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:33
సూర్యోదయం: ఉదయం గం.5:50
జొహర్: మధ్యాహ్నం గం.12:13
అసర్: సాయంత్రం గం.4:40
మఘ్రిబ్: రాత్రి గం.6:37
ఇష: రాత్రి గం.07.53
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News May 2, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 2, 2024

శుభ ముహూర్తం

image

తేది: మే 2, గురువారం
బ.నవమి: అర్ధరాత్రి 01:53 గంటలకు
ధనిష్ఠ: అర్ధరాత్రి 01:48 గంటలకు
దుర్ముహూర్తం:1.ఉదయం 09:58 నుంచి 10:48 గంటల వరకు
2.మధ్యాహ్నం 03:00 నుంచి 03:51 గంటల వరకు
వర్జ్యం: ఉదయం 06:57 నుంచి 08:27 గంటల వరకు