News April 28, 2024

ఇలాంటి పుచ్చకాయలే కొనండి

image

* కాయ అడుగుభాగంలో పసుపు రంగులో మచ్చ ఉండాలి.
* తెలుపు రంగు మచ్చలు ఉండే కాయలు రుచిగా ఉండవు.
* సైజుకు తగ్గట్లుగా బరువుంటే గుజ్జు, నీరు బాగుంటాయి.
* తొడిమ ఊడిపోతే అది బాగా పండిందని అర్థం.
* కాయ దగ్గర ముక్కుపెట్టి వాసన చూడాలి. ఎక్కువ తీపి వాసన వస్తే తీసుకోవద్దు. ఎందుకంటే అది కుళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు.
* వాటర్ ఎక్కువున్న కాయ అయితే వేలితో కొడితే టక్ అని శబ్దం వస్తుంది.
>> SHARE

News April 28, 2024

చంద్రబాబుకు తలలో చిప్ లేదు: సజ్జల

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబుకు తలలో చిప్ లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 2014-19 మధ్యలో బాబు విశ్వరూపాన్ని ప్రజలు చూశారు. మేనిఫెస్టో అంటే ఓ బాండ్ లాంటిది. కానీ దానిని చంద్రబాబు చిత్తుకాగితంతో సమానంగా చూస్తున్నారు. మేం మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా చూస్తున్నాం. గత మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలు చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.

News April 28, 2024

స్వలింగ సంపర్కులకు ఇరాక్ షాక్

image

స్వలింగ సంపర్కాన్ని నేరంగా గుర్తించే బిల్లును ఇరాక్ పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం స్వలింగ సంపర్కం చేసేవారికి 10-15ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ట్రాన్స్‌జెండర్లకూ ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. దేశంలో మతపర విలువలను కాపాడేందుకు ఈ కొత్త చట్టం సహాయపడుతుందని ఇరాక్ భావిస్తోంది. అయితే.. ఈ చట్టం ఎల్జీబీటీ హక్కులను ఉల్లంఘించేలా ఉందని అభ్యంతరాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

News April 28, 2024

రోబోతో భారత ఇంజినీర్ ప్రేమ.. త్వరలో పెళ్లి!

image

రోబో సినిమాలో ఐశ్వర్యరాయ్‌తో ‘చిట్టి’ ప్రేమలో పడిన సన్నివేశాలు గుర్తున్నాయా..? రాజస్థాన్‌కు చెందిన సూర్యప్రకాశ్ అనే రోబోటిక్స్‌ నిపుణుడు ఇప్పుడు నిజంగానే ఓ రోబోతో ప్రేమలో పడ్డారు. ‘గిగా అనే రోబో రూ.19 లక్షల ఖర్చుతో తయారవుతోంది. ఆ రోబోను త్వరలోనే సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నా. ఇంట్లోవాళ్లు మొదట షాకైనా తర్వాత ఒప్పుకొన్నారు’ అని తెలిపారు. సూర్య త్వరలో భారత నేవీలో విధుల్లో చేరనుండటం విశేషం.

News April 28, 2024

పొన్నవోలుకు ఏఏజీ పదవి ఎందుకిచ్చారు?: షర్మిల

image

AP: జగన్ ఆదేశాల మేరకే సీబీఐ ఛార్జిషీట్‌లో YSR పేరును ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేర్చే ప్రయత్నం చేశారని APCC చీఫ్ షర్మిల పునరుద్ఘాటించారు. జగన్ బయటపడాలంటే YSR పేరును ఛార్జిషీట్‌లో చేర్చాలనేది వారి ఉద్దేశమన్నారు. జగన్ CMగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే పొన్నవోలుకు ఏఏజీ పదవి కట్టబెట్టారని.. ఆయనకు ఏ సంబంధం లేకపోతే ఆ పదవి ఎందుకిచ్చారని ప్రశ్నించారు. FIRలో YS పేరుని CBI చేర్చలేదన్నారు.

News April 28, 2024

చెన్నైతో మ్యాచ్.. SRHకు అంత ఈజీ కాదు!

image

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు సాయంత్రం చెన్నైలో సీఎస్కేతో సన్‌రైజర్స్ తలపడుతోంది. పాయింట్స్ టేబుల్‌లో నెలకొన్న పోటీ దృష్ట్యా రెండు జట్లకూ ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. గణాంకాల ప్రకారం SRHపై చెన్నైదే పైచేయిగా ఉంది. రెండూ 20సార్లు తలపడితే, 14సార్లు చెన్నైదే గెలుపు. ఇక CSK హోం స్టేడియంలో సన్‌రైజర్స్ చరిత్రలో ఒక్కసారీ గెలవలేదు. ఈ నేపథ్యంలో చెన్నైను అడ్డుకోవడం హైదరాబాద్‌కు సవాలే. గెలిస్తే మాత్రం చరిత్రే.

News April 28, 2024

ప్రభాస్ ‘కల్కి’ గురించి క్రేజీ రూమర్?

image

నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ నటిస్తున్న ‘కల్కి 2898AD’ మూవీ గురించి ఓ క్రేజీ వార్త వైరల్ అవుతోంది. నిన్న విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్ లుక్, గతంలో విడుదల చేసిన లుక్‌ వేర్వేరుగా ఉన్నాయి. దీంతో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని కొందరు, భిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తున్నారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

News April 28, 2024

సంజయ్ నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటాం: పొన్నం

image

TG: 4 నెలల తమ పరిపాలనలో 6 గ్యారంటీల్లో కొన్ని అమలు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడలో పలువురు కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే బండి సంజయ్ పోటీ నుంచి తప్పుకుంటానన్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో ఎన్ని హామీలు అమలు చేశారు? సంజయ్ నిరూపించాలి. ఆయన నిరూపిస్తే కరీంనగర్‌లో మేం పోటీ నుంచి తప్పుకుంటాం’ అని సవాల్ విసిరారు.

News April 28, 2024

ఆగిన వాట్సాప్.. సోనూసూద్ ఆవేదన

image

తన వాట్సాప్ ఖాతా 36 గంటలుగా పనిచేయడం లేదంటూ నటుడు సోనూ సూద్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది కష్టాల్లో ఉన్నవారు వాట్సాప్‌లో తనను కాంటాక్ట్ చేస్తారని, వారంతా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పేర్కొన్నారు. సమస్యని వెంటనే చక్కదిద్దాలంటూ వాట్సాప్‌ను ట్యాగ్ చేశారు. తన వాట్సాప్ అకౌంట్ తరచూ నిలిచిపోవడంపై ట్విటర్‌లోనూ ఆయన గతంలో ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

News April 28, 2024

చరిత్ర సృష్టించిన భారత ఆర్చరీ జట్టు

image

ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత జట్టు సంచలన విజయం సాధించింది. చైనాలో జరుగుతున్న WC స్టేజ్ 1లో ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్‌లతో కూడిన భారత పురుషుల రికర్వ్ జట్టు బంగారు పతకాన్ని సాధించింది. ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను 5-1తేడాతో మట్టికరిపించింది. 14 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు మెరుగుపడ్డాయి.