India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రైలు ప్రయాణికులకు భారత రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ.20కే భోజనం అందించే పథకాన్ని 100 స్టేషన్లకు పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 51 స్టేషన్లలో ఈ కార్యక్రమం నడుస్తోంది. రైళ్ల జనరల్ క్లాస్ బోగీలు ఆగే చోట ఈ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే వివరించింది. రూ.20కి భోజనంతో పాటు రూ.50కి స్నాక్స్‌ను పరిశుభ్రంగా, అందరికీ అందుబాటు ధరలో ఇస్తున్నామని ఓ ప్రకటనలో చెప్పింది.

AP: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు పెంచాలని ఈసీని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఈ నెల 30 వరకు గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని కోరాయి. అంతకుముందు ఈ నెల 26వరకు పోస్టల్ బ్యాలెట్‌కు ఈసీ గడువు పొడిగించింది.

SRHతో మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన RCB 20ఓవర్లలో 7 వికెట్లకు 206 రన్స్ చేసింది. ఆ జట్టులో ఓపెనర్ కోహ్లీ(51)కి తోడు పాటీదార్(50) మెరుపు హాఫ్ సెంచరీ చేశారు. చివర్లో గ్రీన్(37) రాణించడంతో RCB 200 మార్క్ దాటింది. SRH బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ 3 వికెట్లతో రాణించారు. మరి SRHకి ఈ స్కోర్ సరిపోతుందా? కామెంట్ చేయండి.

AP: సీఎం జగన్‌పై గులకరాయి వేసిన వారిని నిమిషాల్లోనే పట్టుకున్నారని, తన తండ్రి వివేకానందను చంపి ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగలేదని సునీత వాపోయారు. పులివెందులలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు. తన తండ్రి హత్య విషయంలో న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నానని, ప్రజలైనా తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపికపై టీమ్ ఇండియా కోచ్ ద్రవిడ్‌కు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక సూచనలు చేశారు. ‘జట్టులో వికెట్లు తీసే బౌలర్లు ఉండాల్సిందే. బిష్ణోయీ, కుల్‌దీప్, జడేజా, మయాంక్ యాదవ్, ఖలీల్, ముకేశ్, మొహ్‌సీన్‌ను ద్రవిడ్ ఎంపిక చేయాలి. ఇండియాకు చాలా ఆప్షన్లున్నాయి. నాణ్యమైన ఆటగాళ్లతో వెళ్తేనే కప్ కొడతాం’ అని స్పష్టం చేశారు. ఆయన బుమ్రా పేరును చెప్పకపోవడం గమనార్హం.

AP: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాంట్‌కు చెందిన ఆస్తులు, భూములను యథాతథంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేఏ పాల్, వీవీ లక్ష్మీనారాయణ పిటిషన్‌లపై హైకోర్టు విచారించింది. ప్లాంట్‌కు సంబంధించిన ఎలాంటి ఆస్తులు విక్రయించమని ఏఎస్‌జీ నరసింహ శర్మ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేసింది.

హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీకి పోటీగా బీజేపీ మాధవీలతను బరిలోకి దించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె రామబాణం వేస్తున్నట్లు, గాలి పటాన్ని(ఎంఐఎం గుర్తు) తెంచేస్తున్నట్లుగా చేతులకు పని చెబుతున్నారు. మరోవైపు ఒవైసీ సైతం గాలిపటాన్ని ఎగరేస్తున్నట్లుగా సైగలు చేస్తూ కౌంటర్ ఇస్తున్నారు.

TG: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఫిర్యాదులకు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ప్రాజెక్టు అక్రమాలపై విచారణ సమయంలో ప్రజలు తమ ఫిర్యాదులు, నివేదనలను సాక్ష్యాధారాలతో నోటరీ ద్వారా అఫిడవిట్ల రూపంలో హైదరాబాద్‌లో అందించవచ్చని తెలిపింది. మే 31లోగా ఆర్కే భవన్‌లో ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాలయంలో అందించాలని పేర్కొంది. పోస్ట్ ద్వారా కూడా పంపవచ్చని తెలిపింది.

AP: రేపు 56 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 174 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత కొనసాగుతుందని.. ఎల్లుండి 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 170 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవాళ నంద్యాల(D) నందవరంలో 45.6 డిగ్రీలు, విజయనగరం(D) రాజాంలో 45.5 డిగ్రీలు, అల్లూరి(D) కొండైగూడెంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.

SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో RCB బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచారు. కోహ్లీ.. 2011(557 రన్స్), 2013(634), 2015(505), 2016(973), 2018(530), 2019(464), 2020(466), 2021(405), 2023(639) సీజన్లతో పాటు 2024లోనూ ఈ ఫీట్ సాధించారు. ఓపెనర్‌గానూ 4000 పరుగుల మైలురాయి అందుకున్నారు.
Sorry, no posts matched your criteria.