News April 25, 2024

వరల్డ్ కప్‌లో భారత్‌కు గోల్డ్

image

WSPS వరల్డ్ కప్‌లో భారత పారా షూటర్ మోనా అగర్వాల్ గోల్డ్ మెడల్ సాధించారు. R2 మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 విభాగంలో ఆమె ఈ ఘనత సాధించారు. భారత్‌లో జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌లో గెలిచిన 20 మంది క్రీడాకారులు పారిస్ పారాలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.

News April 25, 2024

ఒకే వేదికపై ఇద్దరు మాజీ సీఎంలు

image

AP: ఒకే వేదికపై ఇద్దరు మాజీ సీఎంలు కలిశారు. రాజంపేట బహిరంగ సభలో చంద్రబాబు, కిరణ్‌కుమార్ రెడ్డి కలిసి ప్రచారం నిర్వహించారు. గతంలో ఉప్పు నిప్పుగా ఉండే వీరిద్దరూ ఇప్పుడు ఒకే వేదిక పంచుకోవడం సర్వత్రా ఆసక్తిగా మారింది. రాజంపేట BJP MP అభ్యర్థిగా కిరణ్ పోటీ చేస్తున్నారు. అలాగే MLA అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం బరిలో ఉన్నారు. వీరి తరఫున బాబుతో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం నిర్వహించారు.

News April 25, 2024

ఓటేస్తే బీర్, ఫుడ్, క్యాబ్, హెల్త్ చెకప్ ఫ్రీ

image

ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వంతో పాటు పలు ప్రైవేటు సంస్థలూ తమవంతు కృషి చేస్తున్నాయి. యూపీ, కర్ణాటకలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. అయితే అక్కడి రెస్టారెంట్లు, ఆసుపత్రులు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ముందుకొచ్చాయి. ఓటు వేసిన వారికి బెంగళూరులో ఉచితంగా దోశలు, డిస్కౌంట్‌తో పాటు ఫ్రీ ర్యాపిడో రైడ్స్ ప్రకటించాయి. నోయిడాలోనూ 20% ఫుడ్ డిస్కౌంట్, ఫ్రీగా హెల్త్ చెకప్స్ చేస్తామని తెలిపాయి.

News April 25, 2024

బైరెడ్డి శబరి గెలుపు గర్జన వినిపించేనా?

image

దిగ్గజ నేతలను చట్టసభలకు పంపిన పార్లమెంట్ స్థానం నంద్యాల. మాజీ ప్రధాని PV నరసింహారావు 2సార్లు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఓసారి గెలిచారు. మొత్తంగా కాంగ్రెస్ 9సార్లు, TDP 4సార్లు, YCP 2 సార్లు గెలిచాయి. YCP నుంచి సిట్టింగ్ MP పోచా బ్రహ్మానందరెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. బైరెడ్డి శబరిని TDP బరిలోకి దింపింది. ఈ సెగ్మెంట్‌లో గెలిచిన తొలి మహిళగా శబరి రికార్డు సృష్టిస్తారేమో వేచి చూడాలి. <<-se>>#ELECTIONS2024<<>>

News April 25, 2024

‘సలార్-2’లో కియారా అద్వానీ?

image

ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో సలార్‌కి కొనసాగింపుగా రాబోతున్న ‘సలార్-2’ గురించి మరో ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సెకండ్ పార్ట్‌లో రెబల్ స్టార్ సరసన నటించనున్నట్లు సినీవర్గాలు పేర్కొంటున్నాయి. ఓ స్పెషల్ సాంగ్‌లోనూ ఆమె కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం కియారా గేమ్‌ఛేంజర్, వార్-2లో నటిస్తున్నారు.

News April 25, 2024

ఆధార్-పాన్ లింక్ చేయనివారికి ఐటీ కీలక సూచనలు

image

ఆధార్-పాన్ లింక్ చేయని వారికి IT కీలక సూచనలు చేసింది. మే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానం పూర్తయితేనే TDS షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఎలాంటి చర్యలు ఉండవని తెలిపింది. పన్ను చెల్లింపుదారుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు 2024 మార్చి 31కి ముందు చేసిన లావాదేవీలకు సాధారణ రేటుకే TDS/TCS వసూలు ఉంటుందని స్పష్టం చేసింది. IT నిబంధనల ప్రకారం లింక్ చేయకపోతే రెండింతలు TDS కోతలుంటాయి.

News April 25, 2024

పులివెందులలో 37, కుప్పంలో 32 నామినేషన్లు

image

AP: రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగియగా.. జగన్ పోటీ చేసే పులివెందుల నుంచి 37 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్ వివేకా హత్యలో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సైతం జగన్‌పై పోటీ చేస్తున్నారు. చంద్రబాబు బరిలో ఉన్న కుప్పంలో 32, పవన్ పిఠాపురంలో 19, లోకేశ్‌ మంగళగిరిలో 65, బాలకృష్ణ హిందూపురంలో 19, షర్మిల పోటీ చేస్తున్న కడపలో 42 నామినేషన్లు దాఖలయ్యాయి.

News April 25, 2024

ఆ బ్యాంకుల ఖాతాదారులకు అలర్ట్

image

దేశంలోని కీలక బ్యాంకులు సేవింగ్స్ ఖాతా సర్వీస్ ఛార్జీలను సవరించాయి. ICICI, ఎస్ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. మే 1 నుంచి సవరించిన కొత్త రుసుములు అమల్లోకి రానున్నాయి. కాగా ఈ బ్యాంకులు డెబిట్ కార్డు, చెక్ బుక్, యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్, క్రెడిట్ కార్డు, ఏటిఎం ట్రాన్సాక్షన్స్, ఇతర లావాదేవీలకు వసూలు చేసే ఛార్జీలను సవరించాయి.

News April 25, 2024

జగన్ ఇక బ్యాండేజీ తీస్తే బెటర్: సునీత

image

AP: సీఎం జగన్ ఇక బ్యాండేజీ తీస్తే బెటర్ అని వైఎస్ సునీత అన్నారు. గాలి ఆడితే ఆ గాయం త్వరగా మానిపోతుందని చెప్పారు. ‘అవినాశ్ రెడ్డి చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నారా? చిన్న పిల్లలకు పదవులెలా ఇచ్చారు? వివేకా మీకేం పాపం చేశారో ప్రజలకు సమాధానం ఇవ్వాలి. చనిపోయేదాకా జగన్ కోసమే ఆయన పనిచేశారు. వివేకా అంటే ఎందుకింత ద్వేషం? కోర్టులు, పోలీసులు అంటే CMకు గౌరవం లేదు’ అని ఆమె మండి పడ్డారు.

News April 25, 2024

అవినాశ్ అమాయకుడు అయితే హంతకుడు ఎవరు?: సత్యకుమార్

image

AP: ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ సంచలన ట్వీట్ చేశారు. సీఎం జగన్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘అవినాష్ రెడ్డీ అమాయకుడు అయితే మరి హంతకుడు ఎవరు? అర్ధరాత్రి మొబైల్ ఫోన్లలో మంతనాలు నడిపింది ఎవరు? గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించమని చెప్పింది ఎవరు? పాత్రధారిని, సూత్రధారిని రక్షిస్తూ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నది ఎవరు?’ అని ప్రశ్నించారు.