News April 25, 2024

నేనలా అనలేదు.. అంబటి రాయుడు ఫైర్

image

LSG చేతిలో CSK ఓటమికి కెప్టెన్ రుతురాజ్ వైఫల్యమే కారణమని తాను వ్యాఖ్యానించినట్లు వస్తున్న వార్తలపై అంబటి రాయుడు స్పందించారు. ‘ఆరోజు నేను కామెంటరీ చేయలేదు. నా తోటలో మామిడిపండ్లు కోస్తున్నా. ఏదైనా రాసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించండి. ఇలాంటి వాటిని వ్యాప్తి చేయకండి’ అంటూ ఫైరయ్యారు. రాయుడు వ్యాఖ్యలకు ‘క్రెడిట్ ధోనీ.. బ్లేమ్ గైక్వాడ్’ అంటూ నవజోత్ సిద్ధూ కౌంటర్ వేసినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

News April 25, 2024

ఉక్రెయిన్‌కు రహస్యంగా క్షిపణుల్ని పంపిన అమెరికా

image

ఉక్రెయిన్‌కు తాము దీర్ఘ పరిధి క్షిపణుల్ని రహస్యంగా పంపించినట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సలివాన్ తాజాగా తెలిపారు. ఆ దేశానికి తాము అందించే 300 మిలియన్ డాలర్ల సాయంలో క్షిపణులూ భాగమని పేర్కొన్నారు. మున్ముందు మరిన్ని పంపుతామని తేల్చిచెప్పారు. తొలుత క్షిపణుల్ని పంపాలని అనుకోనప్పటికీ, రష్యా ఉత్తర కొరియా మిస్సైల్స్‌ను వాడుతుండటంతో ఉక్రెయిన్‌కు అండగా నిలవాలనుకున్నామని స్పష్టం చేశారు.

News April 25, 2024

రుణమాఫీ హామీ ‘గేమ్ ఛేంజర్’ అవుతుందా?

image

TG: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ అంశాన్ని బాగా ప్రచారం చేస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేస్తామని సీఎం రేవంత్ ప్రతి సభలోనూ నొక్కి చెబుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీల హామీ మాదిరిగా ఎంపీ ఎలక్షన్స్‌లో రుణమాఫీ గేమ్‌ఛేంజర్‌గా మారి కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓట్లు పడేలా చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీరేమంటారు?

News April 25, 2024

ఓటీటీలోకి వచ్చిన ‘భీమా’

image

గోపీచంద్ హీరోగా నటించిన ‘భీమా’ సినిమా డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఏ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీని కేకే రాధామోహన్ నిర్మించారు. మాళవిక శర్మ, ప్రియ భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మార్చి 8న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

News April 25, 2024

APK ఫైల్స్‌తో జాగ్రత్త: పోలీసులు

image

TG: స్క్రీన్ మిర్రరింగ్ యాక్సెస్‌తో కూడిన APK ఫైల్స్‌ను పంపి సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాదారులను దోచుకుంటున్నారని HYD పోలీసులు వెల్లడించారు. ప్రముఖ వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. లింకులు పంపుతూ హ్యాక్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయని, వాట్సాప్‌లో, SMS రూపంలో వచ్చే లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

News April 25, 2024

భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్

image

AP: రాష్ట్రంలో వేసవి అల్లాడిస్తుండటంతో విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఏపీ జెన్‌కో వివరాల ప్రకారం.. నిన్న ఒక్కరోజే 245.756 మెగా యూనిట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది వేసవిలో ఇదే సమయంతో పోలిస్తే ఇది 16.36శాతం అధికం. నిన్నటికి రోజూవారీ సగటు డిమాండ్ 10240 మెగావాట్లుగా ఉంది. డిమాండ్‌ను అందుకునేందుకు ప్రైవేటు డిస్కంల నుంచి అదనంగా 42.152 మెగావాట్లను తీసుకున్నట్లు జెన్‌కో వెల్లడించింది.

News April 25, 2024

మాజీ వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించొద్దు: కనకమేడల

image

AP: రాజీనామా చేసిన గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా అనుమతించవద్దని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలను పంపిణీ చేసిన వారు ఓటు వేసేందుకు వచ్చిన పేదలను అధికార పార్టీకి అనుకూలంగా ఓటేయమని ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు.

News April 25, 2024

50+వికెట్+క్యాచ్.. అక్షర్ అరుదైన ఘనత

image

నిన్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో DC ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అరుదైన ఘనత సాధించారు. ఆ టీమ్ తరఫున 50+ స్కోర్, వికెట్, క్యాచ్ పట్టిన నాలుగో ఆటగాడిగా నిలిచారు. గతంలో డుమినీ SRHపై(2015), కాలింగ్‌వుడ్ KKRపై(2010), సెహ్వాగ్ CSKపై(2008) ఈ ఫీట్ నమోదు చేశారు. కాగా నిన్న అక్షర్ 66 రన్స్ చేయడంతో పాటు ఒక వికెట్ తీసి 3 క్యాచ్‌లు పట్టి గెలుపులో కీలక పాత్ర పోషించారు.

News April 25, 2024

ఏపీలో భారీగా దాఖలైన నామినేషన్లు

image

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు నిన్న భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కరోజే ఎంపీ స్థానాలకు 203 మంది అభ్యర్థులు, అసెంబ్లీ స్థానాలకు 1,123 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు ఎంపీ స్థానాలకు 555 మంది, ఎమ్మెల్యే స్థానాలకు 3,084 మంది నామినేషన్ వేసినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది.

News April 25, 2024

మోదీ పాలనపై నేడు కాంగ్రెస్ ఛార్జ్‌షీట్

image

TG: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ ఇవాళ ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్నారు. పదేళ్ల మోదీ పాలనలో వైఫల్యాలను అందులో పేర్కొననున్నట్లు సమాచారం. అనంతరం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఆయన రోడ్ షోలు నిర్వహించనున్నారు.