India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలతో పాటు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. తొలుత ఇచ్చిన గడువు నిన్నటితో ముగియగా, తాజాగా 30వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోసారి గడువు పెంపు ఉండదని స్పష్టం చేసింది.

AP: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టైమ్ స్లాట్ దర్శనానికి భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. దర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం అవుతోంది. రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు ఉన్న భక్తులకు 3 గంటలు పడుతోంది. నిన్న 64వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

తిండి కోసం కక్కుర్తి పడిన భారత సంతతి వ్యక్తి తన ఉద్యోగం కోల్పోయాడు. మెహుల్ ప్రజాపతి కెనడాలోని టీడీ బ్యాంకులో డాటా సైంటిస్టుగా పని చేస్తున్నాడు. సంవత్సరానికి రూ.60 లక్షల జీతం. అయితే ఇతడు యూనివర్సిటీల్లో పేద విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన ఫుడ్ బ్యాంకుల నుంచి పండ్లు, కూరగాయలు, నిత్యావసరాలు వాడేసుకునేవాడు. ఆ వీడియోలు వైరల్ కావడంతో బ్యాంకు అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.

ఓటర్లను పోలింగ్ బూత్‌ల వైపు నడిపించేందుకు హరియాణా రాష్ట్ర ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇన్విటేషన్ కార్డులను పంపుతోంది. 50 లక్షల కుటుంబాలకు ఆహ్వాన పత్రాలు పంపుతున్నట్లు ఈసీ పేర్కొంది. కాగా హరియాణాలో 10లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 70.36శాతం పోలింగ్ నమోదైంది.

AP విభజన చట్టం ప్రకారం ఆంధ్రా విద్యార్థులకు తెలంగాణలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. ఉమ్మడి ప్రవేశాల అమలు గడువు జూన్ 2తో ముగియనుందని, ఆలోగా TGలో జరిగే ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తామని స్పష్టం చేసింది. ఆ తర్వాత TG వారికే స్థానికత వర్తిస్తుందని, జూన్2 తర్వాత పరీక్షలు రాసే AP విద్యార్థులకు రిజర్వేషన్లు ఉండవని తెలిపింది.

TG: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కూనారపు సిరి ఇంటర్ సీఈసీలో 927 మార్కులు సాధించింది. ఇందులో గొప్పేముంది అనుకుంటున్నారా? ఆమె ఐదేళ్లుగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతోంది. 8 నెలల క్రితం కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో వారానికి రెండు సార్లు డయాలసిస్(రక్త శుద్ధి) చేయించుకుంటోంది. అయినా చదువుపై ఆసక్తితో కష్టపడి చదివింది. కాలేజీకి వెళ్లకపోయినా ఫోన్‌లోనే చదువుతూ మంచి మార్కులు సాధించింది.

AP: విజయవాడ MP స్థానానికి ఒకే కుటుంబం నుంచి ముగ్గురు బరిలో నిలిచారు. ఇప్పటికే అన్నదమ్ములు కేశినేని నాని(YCP), కేశినేని చిన్ని(TDP).. తాజాగా కాంగ్రెస్ నుంచి వల్లూరి భార్గవ్ నామినేషన్ వేశారు. కేశినేని వెంకయ్య కుమారుడు రామస్వామి, ఆయన తనయులు కేశినేని నాని, చిన్ని. కాగా వెంకయ్య కుమార్తె వల్లూరు కుస్తూరి మనవడు భార్గవ్. అంటే వెంకయ్య మనవళ్లు నాని, చిన్ని అయితే భార్గవ్ మునిమనవడు.

TG: ఇంటర్ ఫస్ట్, సెకండియర్‌లో ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్టియర్‌కు ఉ.9 నుంచి మ.12 వరకు, సెకండియర్‌కు మ.2.30 నుంచి సా.5.30 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ పరీక్షల ఫీజును నేటి నుంచి మే 2 వరకు కాలేజీల్లో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.600 చెల్లించాలి. దీనికి కూడా మే 2 వరకు ఛాన్స్ ఉంది.

AP: బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై మాజీ వాలంటీర్ బరిలో దిగుతున్నారు. చీరాల మండలం వడ్డే సంఘానికి చెందిన వాలంటీర్ కట్టా ఆనంద్ బాబు ఉద్యోగానికి రాజీనామా చేసి.. బాపట్ల ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గత ఐదేళ్లలో ఎంపీ సురేశ్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అతను విమర్శించాడు. ఇసుక మాఫియాతో ఎంపీ దోచుకున్నారని ఆరోపించాడు.

పరీక్షల్లో ఫెయిలయ్యామని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపెడుతోంది. పిల్లలకు అండగా తల్లిదండ్రులే ఉండాలి. వారికి స్ఫూర్తినిచ్చే నిజజీవిత కథను నటుడు అనుపమ్ ఖేర్ గతంలో చెప్పారు. ‘మా క్లాసులో 60 మంది ఉంటే నాకు 59వ ర్యాంక్ వచ్చింది. నాన్న కోప్పడలేదు. నువ్వు కష్టపడితే ముందుకెళ్లొచ్చు.. ఫస్ట్ ర్యాంకర్ తన స్థానం పోతుందేమోనని భయపడుతూ ఉంటాడు. మార్కులు జీవితాన్ని నిర్ణయించలేవని చెప్పాడు’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.