India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

IPL హిస్టరీలో ఒకే ఓవర్‌లో 20కి పైగా పరుగులు ఎక్కువసార్లు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోనీ అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. మిస్టర్ కూల్ 10 సార్లు ఈ ఫీట్ సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(8), పంత్(8), సెహ్వాగ్(5), యూసఫ్ పఠాన్(5), హార్దిక్ పాండ్య(5), సంజూ శాంసన్(5), సూర్యకుమార్ యాదవ్(5) ఉన్నారు.

రచయిత, డైరెక్టర్ వంశీ పైడిపల్లి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్‌తో మూవీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. వంశీ చెప్పిన కథకు షాహిద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దిల్ రాజ్ ఈ సినిమాను హిందీ-తెలుగు భాషల్లో తెరకెక్కిస్తారని టాక్. వంశీ పైడిపల్లి గత ఏడాది తమిళ హీరో విజయ్‌తో చేసిన ‘వారసుడు’ తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోని విషయం తెలిసిందే.

AP ఎన్నికల చరిత్రలో రెండు కుటుంబాలకు చెందిన 3 తరాల వ్యక్తులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా 1955లో పర్వత గుర్రాజు, 1994లో ఆయన కుమారుడు పర్వత సుబ్బారావు, 1999లో గుర్రాజు కోడలు బాపనమ్మ, 2009లో మనవడు సత్యనారాయణ మూర్తి గెలిచారు. పెందుర్తి నుంచి 1978లో గుడివాడ అప్పన్న, 1989లో ఆయన కుమారుడు గురునాథరావు, 2019లో అనకాపల్లి నుంచి మనవడు అమర్‌నాథ్ విజయం సాధించారు.
<<-se>>#ELECTIONS2024<<>>

TG: రూపంలోనే కాదు చదువులోనూ తాము సమానమేనని నిరూపించారు కవల విద్యార్థులు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(S)కు చెందిన డేగల రామ్, లక్ష్మణ్ ప్రతిభ చూపారు. ఆరో తరగతి నుంచి ఆదర్శ పాఠశాలలోనే వీరు చదివారు. MPC విభాగంలో లక్ష్మణ్ 983, రామ్ 981 మార్కులు సాధించారు. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కావడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.

APలో అసెంబ్లీ, లోక్‌సభ, TGలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు నేటితో ముగియనుంది. రేపు నామినేషన్ల పరిశీలన చేస్తారు. ఉపసంహరణకు ఈ నెల 29 వరకు ఛాన్స్ ఉంటుంది. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. ఈ నాలుగో దశలో AP, TGతో పాటు బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, UP, బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

AP: టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మే 3, 4 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు సమాచారం. అనకాపల్లి లేదా రాజమండ్రి సభల్లో ఈ కార్యక్రమం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు కూటమి వర్గాలు చెబుతున్నాయి.

AP: నిన్నటితో మేమంతా సిద్ధం బస్సు యాత్రను ముగించిన సీఎం జగన్.. ఇవాళ పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 7.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందుల వెళ్తారు. అక్కడ సీఎస్ఐ చర్చి గ్రౌండులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు.

రోడ్లు, తాగు నీటి సదుపాయం కోసం ఓటింగ్ బహిష్కరించిన ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా పుణేలోని కళ్యాణీ నగర్‌లో రోజూ అర్ధరాత్రి వరకు పబ్‌లు, సౌండ్‌లతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో విసిగిపోయామని వారు చెబుతున్నారు. నివాస ప్రాంతాల్లో పబ్‌లను అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇక్కడ ఎల్లుండి పోలింగ్ జరగనుంది.

మానవత్వానికి సరిహద్దులు లేవని నిరూపితమైంది. గుండె వ్యాధితో బాధపడుతోన్న పాకిస్థాన్‌కు చెందిన ఆయేషా రశన్(19) అనే యువతికి చెన్నైలోని ఆస్పత్రిలో ఓ స్వచ్ఛంద సంస్థ చికిత్స అందించింది. ఇటీవల చనిపోయిన ఢిల్లీకి చెందిన వ్యక్తి గుండెను ఆమెకు విజయవంతంగా అమర్చింది. రూ.35 లక్షలకు పైగా ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఫ్రీగా చేసింది. తమ కూతురికి జీవితాన్నిచ్చిన ట్రస్టు, వైద్యులకు ఆమె తల్లి ధన్యవాదాలు తెలిపారు.

మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీమ్యాట్ పరీక్ష తేదీ ఖరారైంది. మే 15న పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. తాజాగా CMAT దరఖాస్తు గడువు ముగిసిన సంగతి తెలిసిందే. పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ వివరాలు వెల్లడిస్తామని NTA తెలిపింది.
Sorry, no posts matched your criteria.