News April 25, 2024

చెత్తపన్ను రద్దు చేస్తాం: చంద్రబాబు

image

AP: తాము అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఆమదాలవలస ప్రజాగళంలో మాట్లాడిన ఆయన.. ‘ఉత్తరాంధ్రకు జగన్ ఏం చేశారు? నాగావళి, వంశధార ఇసుక విశాఖకు వెళ్తోంది. ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్నారు. దేశంలోనే ఎక్కువ అప్పులున్న రాష్ట్రం AP. అప్పులు ఎక్కువ ఉన్న రైతులు కూడా ఏపీలోనే ఉన్నారు. అధికారంలోకి రాగానే పంటల బీమా అమలు చేస్తాం’ అని ప్రకటించారు.

News April 25, 2024

పీవీసీయూలో అన్ని ఇండస్ట్రీల స్టార్ నటులు: ప్రశాంత్ వర్మ

image

‘హనుమాన్’ మూవీ 100 రోజుల విజయోత్సవ కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU)లో కొత్తవారిని పరిచయం చేస్తామని చెప్పారు. దీని కోసం అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్ నటులను ఎంపిక చేస్తామన్నారు. తన సినిమా నచ్చి పలువురు నటులు యూనివర్స్‌లో భాగమవ్వాలని అడిగినట్లు పేర్కొన్నారు. అన్ని విభాగాల్లోనూ ‘జై హనుమాన్’ మరో స్థాయిలో ఉంటుందన్నారు.

News April 25, 2024

శివమ్ దూబేకు WC టికెట్ కన్ఫామ్?

image

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆల్‌రౌండర్ శివమ్ దూబే (66) మరో అర్ధసెంచరీతో చెలరేగారు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 311 రన్స్ బాదారు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా దూబే మిడిలార్డర్‌లో నిలకడగా రాణిస్తుండటంతో అభిమానులు అతడికి టీ20 వరల్డ్ కప్‌కు టికెట్ కన్ఫామ్ అయినట్లేనని కామెంట్లు చేస్తున్నారు. తప్పకుండా టీ20 జట్టులో అతడికి చోటు దక్కుతుందని భావిస్తున్నారు.

News April 25, 2024

‘KGF 1’ రీరిలీజ్

image

కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన ‘KGF 1’ రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 27న ఈ సినిమాను రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. అర్చన జోయిస్, వశిష్ట ఎన్ సింహ, రామచంద్రరాజు కీలక పాత్రలు పోషించారు.

News April 25, 2024

ఏపీ సీఎస్‌పై చర్యలు తీసుకోవాలి: కోటంరెడ్డి

image

AP: సీఎస్ జవహర్‌రెడ్డిపై EC చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతల విధులు చూడాల్సిన ఇంటెలిజెన్స్ చీఫ్ <<13110732>>సీతారామాంజనేయులు <<>>గతంలో నాకు ఫోన్ చేసి పరోక్షంగా బెదిరించారు. పెన్షన్లపై ఈసీ ఆదేశాలను సీఎస్ సరిగా అమలు చేయలేదు. జవహర్ రెడ్డిని సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలి. వైసీపీని వీడాక నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు’ అని ఆరోపించారు.

News April 25, 2024

నిత్య పెళ్లికొడుకు గుట్టురట్టు

image

TG: వరంగల్‌కు చెందిన రాజేశ్ నిత్య పెళ్లి కొడుకు అవతారమెత్తాడు. హైదరాబాద్‌లో కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ 2022లో ప్రియను పెళ్లాడాడు. అదే ఏడాది శ్రావణిని 2వ పెళ్లి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా సారికతో ప్రేమాయణం సాగించి ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాడు. వీరిని వేర్వేరు చోట్ల అద్దె ఇళ్లల్లో ఉంచి ప్రస్తుతం కరుణ అనే యువతితో తిరుగుతున్నాడు. ఈ విషయం సారిక తల్లిదండ్రులకు తెలియడంతో అతడి గుట్టురట్టైంది.

News April 25, 2024

మలయాళ చిత్రాల సక్సెస్‌కు కారణమిదే: ఫహాద్

image

ఈ ఏడాది మలయాళ సినిమాలు భారీ విజయాలు సాధించడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సక్సెస్‌కు కారణం భిన్నమైన కంటెంట్ అని చెప్పారు. కొత్త కథలను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారన్నారు. ప్రయోగాలు చేసేందుకు ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఫహాద్ నటించిన ‘ఆవేశం’ మూవీ థియేటర్లలో మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం తెలుగులో ఆయన ‘పుష్ప-2’ సినిమాలో నటిస్తున్నారు.

News April 25, 2024

చెన్నై భారీ స్కోర్

image

LSGతో మ్యాచ్‌లో CSK బ్యాటర్లు రాణించారు. కెప్టెన్ గైక్వాడ్ 108(60 బంతుల్లో) సెంచరీతో కదం తొక్కగా.. శివం దూబె 66(27బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీ చేశారు. దీంతో చెన్నై 20ఓవర్లలో 4 వికెట్లకు 210 రన్స్ చేసింది. రహానే(1), మిచెల్(11), జడేజా(16) విఫలమయ్యారు. ధోనీ 4(1) రన్స్ చేశారు.

News April 25, 2024

రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే సహించను: కేసీఆర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్ చేయించకపోతే తానే స్వయంగా చేయిస్తానని కేసీఆర్ అన్నారు. చిల్లర రాజకీయాల కోసం ప్రాజెక్టును బలిపెడితే ఊరుకోమని చెప్పారు. కాళేశ్వరం ద్వారా ప్రజలు ప్రయోజనం పొందారని చెప్పారు. తన మీద కోపంతో కాంగ్రెస్ నేతలు రైతుల పొలాలు ఎండబెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే సహించనని అన్నారు.

News April 25, 2024

రేపటి నుంచి KCR బస్సు యాత్ర

image

TG: రేపటి నుంచి కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం HYD తెలంగాణ భవన్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుండగా.. ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్ మీదుగా మిర్యాలగూడ వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు మిర్యాలగూడలో జరిగే రోడ్‌షోలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు సూర్యాపేట రోడ్‌షోలో మాట్లాడనున్నారు. మే 10వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది.