India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ప్రభుత్వ ఉద్యోగులు సైతం జగన్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘విశాఖలో శంకర్ అనే కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులకు ఇవ్వాల్సిన నిధులు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ దుర్మార్గులు మళ్లీ వస్తే ప్రజలు పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. గోదావరి, కృష్ణా లాంటి పవిత్ర నదులు పారే ఈ రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చారు’ అని ఫైర్ అయ్యారు.

AP: పచ్చని అందమైన కోనసీమను YCP ప్రభుత్వం కలహాల సీమగా మార్చేందుకు ప్రయత్నించిందని పవన్ మండిపడ్డారు. అంబాజీపేట సభలో మాట్లాడిన పవన్.. ‘కోనసీమను ప్రేమ సీమగా మార్చేందుకు మేం ముందుకు వచ్చాం. 2.5 లక్షల హెక్టార్ల కొబ్బరి తోటలతో నిండిన కోనసీమను కొట్లాట సీమగా మారకుండా మేం కృషి చేశాం. భవిష్యత్తులో కూడా ప్రేమ సీమగా ఉండేలా, అన్ని కులాల ప్రజలు, మైనార్టీలు కలిసి ఉండేలా పనిచేస్తాం’ అని వెల్లడించారు.

AP: చెత్తపై పన్ను వేసిన దుర్మార్గుడు CM జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘CM ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సిద్ధం అంటున్న వారిపై యుద్ధం చేద్దామని పవన్ చెప్పారు. 2014లో పవన్ పోటీ చేయకుండా మద్దతిచ్చారు. గోదావరి జిల్లాల ప్రజలు వన్‌సైడ్ తీర్పిచ్చారు. మరోసారి మోదీ, నేను, పవన్ జతకట్టాం. నిలబడే దమ్ము జగన్‌కు ఉందా?మీరు నిలబడనిస్తారా? ఎన్నికలు లాంఛనమే. కూటమి గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు వాంఖడే స్టేడియంలో ముంబై, బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.
ముంబై జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్, తిలక్, హార్దిక్, టిమ్ డేవిడ్, రొమారియో, నబీ, కోయెట్జీ, శ్రేయస్ గోపాల్, బుమ్రా, ఆకాశ్ మధ్వాల్
ఆర్సీబీ జట్టు: విరాట్, డుప్లెసిస్, విల్ జాక్స్, పాటీదార్, మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, లోమ్రోర్, టోప్లీ, వైశాఖ్, సిరాజ్, ఆకాశ్ దీప్

వియత్నాంలో ప్రజల్ని మోసం చేసిన కోటీశ్వరురాలు ట్రువాంగ్ మైలాన్‌కు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది. 2012-2022 మధ్యకాలంలో ఆమె వేలాది నకిలీ సంస్థల్ని స్థాపించి వాటి ద్వారా రూ.లక్ష కోట్ల(2022లో వియత్నాం స్థూలదేశీయోత్పత్తిలో ఇది 3శాతం) అవినీతికి పాల్పడ్డారు. ఈ కేసుపై విచారణ చేస్తున్న హో చిన్ మిన్ నగరంలోని కోర్టు, మైలాన్‌కు మరణశిక్ష విధిస్తున్నట్లు తాజాగా తీర్పు చెప్పింది.

AP: పులివెందులలో వైఎస్ జగన్‌పై పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి ప్రాణహాని ఉందని ఆ పార్టీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పులివెందులలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, రవికి ప్రాణహాని లేదంటూ ఎస్పీ తోసిపుచ్చుతున్నారని ఆరోపించారు. వెంటనే తమ అభ్యర్థికి భద్రత కల్పించాలని లేఖలో కోరారు.

ధోనీ మాజీ బిజినెస్ పార్ట్‌నర్ మిహిర్ దివాకర్‌ను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా ఉన్న మిహిర్.. దేశంలో పలు చోట్ల అకాడమీలు ప్రారంభించారు. అయితే అనుమతి లేకుండా తన పేరును క్రికెట్ అకాడమీల కోసం వాడుకున్నారని రాంచీ కోర్టులో మిహిర్, సౌమ్యాదాస్‌పై ధోనీ ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలు చేపట్టారు. సౌమ్యా దాస్ కోసం గాలిస్తున్నారు.

AP: సీఎం జగన్ సన్నిహితుడు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు టీడీపీలో చేరారు. మంగళగిరి సమీపంలోని కురగల్లు గ్రామానికి చెందిన ఆయన.. జగన్‌కు సంఘీభావంగా ఇడుపులపాయ నుంచి విశాఖ వరకు 2వేల కి.మీ పాదయాత్ర చేశారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ విధానాలతో విభేదించిన ఆయన.. ఎస్సీ కమిషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

మైదానంలో చురుకుగా ఉంటూ పరుగుల వరద పారించే కింగ్ కోహ్లీ తన వీక్‌నెస్ గురించిన ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. విమానంలో ప్రయాణించేటప్పుడు ప్రతికూల వాతావరణం కారణంగా ఫ్లైట్ ఒడుదొడుకులకు లోనైతే కోహ్లీ భయపడిపోతారట. ఆ సమయంలో పిరికివాడిలా ప్రవర్తిస్తానని, ఏదైనా తేడా వస్తే సీట్లను గట్టిగా పట్టుకునే మొదటి వ్యక్తిని తానే అని చెప్పుకొచ్చారు. అలా జరిగినప్పుడల్లా ఇక తన పనైపోయిందని అనుకుంటారట.

AP: రాజకీయ ఉద్దండులను చట్టసభలకు పంపిన ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం. ఇక్కడ TDP 6సార్లు, కాంగ్రెస్, స్వతంత్రులు 3సార్లు, కృషికార్, జనతా, YCP ఒక్కోసారి గెలిచాయి. YCP నుంచి మరోసారి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు బరిలోకి దిగగా.. ఆయనను ఢీకొట్టేందుకు సర్పంచ్ గొండు శంకర్‌ను టీడీపీ పోటీకి దింపింది. దీంతో దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ నేత ధర్మాన, జూనియర్ లీడర్ మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Sorry, no posts matched your criteria.