India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

1827: సంఘ సంస్కర్త జ్యోతీరావు పూలే జననం
1869: కస్తూరిబాయి గాంధీ జననం
1904: నటుడు, గాయకుడు కుందన్ లాల్ జననం
1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది
2010: నక్సలైట్ ఉద్యమకారుడు పైల వాసుదేవరావు మరణం
* ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవం
* జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

తేది: ఏప్రిల్ 11, గురువారం
చైత్రము
శు.తదియ: మధ్యాహ్నం: 3:03 గంటలకు
కృత్తిక: అర్ధరాత్రి 1:38 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 10:04 నుంచి ఉదయం 10:54 గంటల వరకు
తిరిగి మధ్యాహ్నం 3:00 నుంచి మధ్యాహ్నం 3:50 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 2:21 నుంచి మధ్యాహ్నం 3:52 వరకు

➣AP: టీడీపీ గెలిస్తే జన్మభూమి కమిటీ సభ్యులే వాలంటీర్లు: CM జగన్
➣జగన్ గొడ్డలి వేటుకు బలి కానివారు ఉన్నారా?: CBN
➣రౌడీరాజ్యం పోవాలి.. రామరాజ్యం రావాలి: పవన్
➣పవన్ కళ్యాణ్‌కు EC నోటీసులు
➣TG: BRS ఎమ్మెల్యేలతో రేవంత్ సొంత దుకాణం: BJP MLA మహేశ్వర్ రెడ్డి
➣నువ్వు సీఎంవా.. చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా?: హరీశ్
➣మోదీ గెలిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది: కిషన్ రెడ్డి
IPL: RRపై GT విజయం

IPL-2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఆఖరి బంతికి టార్గెట్‌ను చేధించింది. ఆ జట్టు బ్యాటర్లలో గిల్ 72, సుదర్శన్ 35 రన్స్‌తో రాణించారు. చివర్లో రాహుల్ తెవాటియా(22), రశీద్ ఖాన్(24*) బౌండరీలు బాది తమ జట్టుకు విజయాన్నందించారు.

స్థానిక ప్రభావంతో లండన్‌లో స్కూల్‌కు వెళ్లే రోజుల్లో తన భారత మూలాలు, సంస్కృతుల గురించి సిగ్గుపడేవాడినని బ్రిటిష్ నటుడు దేవ్ పటేల్ తెలిపారు. కానీ స్లమ్‌డాగ్ మిలియనీర్‌తో సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక డైరెక్షన్ చేసి భారతీయ సంస్కృతిని గొప్పగా చూపాలని డిసైడ్ అయ్యానని తెలిపారు. కాగా దేవ్ స్వీయదర్శకత్వంలో నటించిన ‘మంకీ మ్యాన్’ రేపు విడుదల కానుంది. హనుమంతుడి స్ఫూర్తితో ఈ కథను తీర్చిదిద్దానని దేవ్ తెలిపారు.

పర్యావరణ మార్పుల నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు మానవాళికి రెండేళ్ల సమయమే ఉన్నట్లు UN క్లైమెట్ ఏజెన్సీ చీఫ్ హెచ్చరించారు. 2025లోగా కార్బన్ కాలుష్యంపై ప్రపంచ దేశాలు సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతిఒక్కరికీ ఉందన్నారు. తన హెచ్చరిక నాటకీయంగా అనిపిస్తున్నా ఇది నిజమని, ఈ రెండేళ్ల కాలం ఎంతో కీలకమని పేర్కొన్నారు. కాలుష్యం తీవ్రమైతే ఆర్థిక అసమానతలు పెరుగుతాయన్నారు.

ఈరోజు చందమామ కనిపించడంతో రేపు దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్‌ను జరుపుకోనున్నారు. ఈక్రమంలో హైదరాబాద్‌లోని చార్మినార్ మార్కెట్లు జనంతో నిండిపోయాయి. గాజులు, అత్తర్లు సహా మహిళలు ఇష్టంగా కొనుగోలు చేసే పలు రకాలైన అలంకరణ వస్తువులు, దుస్తులు అక్కడ లభిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంజాన్ మాసంలో కులమతాలకు అతీతంగా అక్కడ జనం షాపింగ్ చేస్తుంటారు.

థ్రిల్ ఉంటుందని స్నేహితుడు డ్రగ్స్ ఇవ్వడంతో యువతి చనిపోయిన ఘటన యూపీలోని లక్నోలో జరిగింది. ‘బెంగళూరుకు వెళ్లే ముందు డ్రగ్స్ కావాలని నాకు ఫోన్ చేసింది. ఫ్రెండ్ ప్లాటుకు తీసుకెళ్లి అక్కడ ఇంజెక్షన్‌లో డ్రగ్స్ కలిపి ముందు నేను తీసుకుని తర్వాత ఆమెకు ఇచ్చాను’ అని నిందితుడు వివేక్ పోలీసులకు వెల్లడించాడు. కాగా డ్రగ్స్‌కు బానిసైన నిందితుడు యువతికి కూడా మాదకద్రవ్యాలు అలవాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
Sorry, no posts matched your criteria.