India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కన్నడలో హిట్‌గా నిలిచిన ‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’ సినిమాను OTT నుంచి అమెజాన్ ప్రైమ్ తొలగించింది. సడెన్‌గా ఈ సినిమా మాయమైందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జీ5 నెట్‌వర్క్ సొంతం చేసుకోగా.. కొన్ని బిజినెస్ డీల్స్ వల్ల తొలుత ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యిందట. త్వరలో జీ5 OTTలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

TG: సీవీ ఆనంద్ నేతృత్వంలోని ఏసీబీ లంచం తీసుకుంటున్న అధికారుల భరతం పడుతోంది. దీంతో లంచం అడిగిన అధికారుల వివరాలను తెలిపేందుకు బాధితులు సైతం ముందుకొస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఉమా రాణి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెయింగ్ మెషీన్‌లకు సంబంధించిన వ్యాలిడిటీ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం ఆమె రూ.10వేలు డిమాండ్ చేశారు.

జపాన్‌లో భూకంపం భయాందోళనలకు గురిచేసినట్లు SS కార్తికేయ <<12894254>>ట్వీట్<<>> చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మహేశ్ అభిమాని ఒకరు స్పందిస్తూ మహేశ్-రాజమౌళి మూవీ ట్రైలర్ ఇంపాక్ట్‌కు రిహార్సల్ చేస్తున్నారని కార్తికేయను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి కార్తికేయ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఆ ఇంపాక్ట్ జపాన్‌లోనే కాకుండా ప్రపంచమంతా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో హైప్‌కే పోయేలా ఉన్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

AP: అధికారంలోకి వచ్చేందుకు అప్పటికప్పుడు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారని చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. పార్టీని మాఫియా ముఠాలా తయారు చేశారని దుయ్యబట్టారు. విజయవాడలో ‘మహా దోపిడీ’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. బాబు దోపిడీలు, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో ఈ పుస్తకంలో వివరించారని చెప్పారు. మరోసారి రాక్షసుల ముఠా ఏకమైందని టీడీపీ కూటమిపై విమర్శలు చేశారు.

AP: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ YCPకి మరో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఆమె భర్త తాళ్ల సత్యనారాయణ మూర్తి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. తాజాగా మూర్తి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరిని కలిశారు. అమలాపురం ఎంపీ లేదా పి.గన్నవరం అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అమలాపురం ఎంపీ సీటుకు రాపాక వరప్రసాద్ పేరును వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) అనారోగ్యంతో కన్నుమూశారు. 1958-1973 మధ్య ఆయన పాక్ తరఫున 41 టెస్టులు ఆడి 2,991 పరుగులు చేశారు. ఈ క్రమంలో 5 సెంచరీలు సాధించిన ఆయన, అందులో 3 భారత్‌పైనే నమోదు చేశారు. ఆఫ్ స్పిన్ వేసే సయీద్ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 22 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్‌తో జరిగిన 3 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

AP: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. HYDలోని చంద్రబాబు నివాసంలో దాదాపు గంటకు పైగా వారిద్దరూ వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల పేర్లు, స్థానాల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. త్వరలోనే కూటమి పార్టీలు తమ అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.

కర్ణాటక సర్కారుకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో షాక్ తగిలింది. హిందూ దేవాలయాలపై పన్ను విధించేందుకు ప్రవేశపెట్టిన బిల్లును రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ తిప్పిపంపారు. ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు ఇదే తరహా పన్ను వర్తింపు ఉందా అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో ఈ అంశంపై కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో మరింత స్పష్టత అవసరమని పేర్కొన్నారు. తాను అడిగిన ప్రశ్నల్ని అనుసరించి బిల్లును సవరించాలని సూచించారు.

రేపు జరిగే IPL తొలి మ్యాచ్‌లో CSK జట్టుకు షాక్ తగిలేలా కనిపిస్తోంది. గత సీజన్‌లో CSK విజయానికి కృషి చేసిన బౌలర్ పతిరణ తొలి మ్యాచ్‌లో ఆడటం లేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. గాయం కారణంగా కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకుంటున్న పతిరణకు శ్రీలంక క్రికెట్ బోర్డు IPL ప్రారంభ మ్యాచ్‌కు వెళ్లేందుకు ఇంకా NOC జారీ చేయలేదని సమాచారం. కాగా, రచిన్ రవీంద్ర అరంగేట్రం చేయనున్నారు.

TG: ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్, మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.