News April 1, 2024

రాజకీయ ‘పెళ్లి పత్రిక’

image

ఈ మధ్య వివాహ ఆహ్వాన పత్రికల్లో తమకు ఇష్టమైన నేతలపై అభిమానాన్ని చాటుకునేందుకు కొందరు ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన ఓ పెళ్లి పత్రిక వైరలవుతోంది. కారెం సంజయ్ వివాహం చంద్రికారాణితో జరగనుంది. ఈ క్రమంలో పత్రికపై తన అభిమాన నేతలు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, టీడీపీ చీఫ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలను ముద్రించి పంచారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

News April 1, 2024

కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క

image

TG: మిషన్ భగీరథపై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి సీతక్క బహిరంగ లేఖ విడుదల చేశారు. గత ప్రభుత్వం కన్నా సమర్థవంతంగా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని అన్నారు. నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని.. అర్థం లేని విమర్శలు సరికాదని పేర్కొన్నారు.

News April 1, 2024

అద్దంకి కోటపై ఏ జెండా ఎగురునో?

image

రెడ్డి రాజుల రాజధానిగా వెలుగొందిన ప్రాంతం బాపట్ల జిల్లా అద్దంకి. 1955లో ఈ సెగ్మెంట్ ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, TDP 5 సార్లు, స్వతంత్రులు, CPI, YCP ఒక్కోసారి గెలిచాయి. ఇక్కడ మూడుసార్లు(2009లో కాంగ్రెస్, 14లో YCP, 19లో TDP) గెలిచి గొట్టిపాటి రవికుమార్ హ్యాట్రిక్ కొట్టారు. మరోసారి ఆయన TDP నుంచి బరిలో నిలువగా.. YCP నుంచి నాన్ లోకల్ అయిన పాణెం చిన హనిమిరెడ్డి పోటీ చేస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 1, 2024

పంత్‌కు రూ.12లక్షలు ఫైన్

image

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు రూ.12లక్షలు ఫైన్ పడింది. రెండు వరుస పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి ఢిల్లీ బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దీంతో కెప్టెన్‌కు ఫైన్ పడింది. ఈ సీజన్‌లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షలు జరిమానా పడింది. పంత్ రెండో కెప్టెన్‌గా నిలిచారు.

News April 1, 2024

ఈడీ విషయంలో మేం జోక్యం చేసుకోం: పీఎం మోదీ

image

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనేది స్వతంత్ర సంస్థ అని, దాని పనితీరు విషయంలో తమ జోక్యం ఉండదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ‘ఈడీ వద్ద 7వేల కేసులు ఉన్నాయి. వాటిలో రాజకీయ నేతలపై కేసులు 3శాతం కంటే తక్కువే. ఆ సంస్థ పనిని మేం అడ్డుకోం. స్వతంత్రంగా పనిచేసి, నిజాల్ని బయటపెట్టాల్సిన బాధ్యత ఈడీదే’ అని పేర్కొన్నారు. కేంద్రం ఈడీని ఆయుధంలా వాడుకుంటోందన్న ‘ఇండియా కూటమి’ ఆరోపణలపై ప్రధాని స్పందించడం ఇదే తొలిసారి.

News April 1, 2024

వాలంటీర్లపై కీలక ఆదేశాలు

image

AP: ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించడంతో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ రంగంలోకి దిగింది. వాలంటీర్లకు ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు, సిమ్‌లు, ట్యాబ్‌లు వంటివి వెంటనే స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు సచివాలయాల శాఖ స్పష్టం చేసింది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని వాలంటీర్ల వద్ద పరికరాలను స్వాధీనం చేసుకునేలా చూడాలని కలెక్టర్లకు సూచించింది.

News April 1, 2024

6 నుంచి సమ్మెటివ్ ఎగ్జామ్స్

image

AP: ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో సమ్మెటివ్-2 పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1-9 తరగతులు, ప్రైవేటులో 6-9 తరగతులకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి ప్రశ్నపత్రాలను అందిస్తుంది. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతి ఆధారిత మదింపు(CBA) ఎగ్జామ్ నిర్వహిస్తారు. దీనికి ప్రశ్నపత్రంతో పాటు OMR షీట్ కూడా ఇస్తారు. ప్రైవేట్ పాఠశాలలకు క్వశ్చన్ పేపర్ మాత్రమే అందిస్తారు.

News April 1, 2024

యాక్షన్ సీన్స్‌ చిత్రీకరణలో ‘విశ్వంభర’

image

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మల్లిడి వశిష్ట కాంబోలో వస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ త్రిష లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నేటి నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించనున్నారు. ఇది ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీన్ అని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది.

News April 1, 2024

ఈ ఇన్సింగ్స్ జీవితాంతం గుర్తుండిపోతుంది: గంగూలీ

image

నిన్నటి మ్యాచులో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ప్రదర్శనపై ఆ జట్టు డైరెక్టర్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘రిషభ్ అద్భుతంగా ఆడావు. ఈ ఇన్నింగ్స్ నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. నీవు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినా ఇది నీకు ప్రత్యేకంగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ఏడాదిన్నర తర్వాత క్రికెట్ ఆడుతున్న పంత్ నిన్నటి మ్యాచులో అర్ధసెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

News April 1, 2024

9,144 రైల్వే ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

రైల్వే శాఖ విడుదల చేసిన 9,144 ఉద్యోగాలకు అప్లై చేసేందుకు గడువు ఈ నెల 8తో ముగియనుంది. టెక్నీషియన్ గ్రేడ్-1 1,092, గ్రేడ్-3 8,052 పోస్టులు ఖాళీలున్నాయి. బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటర్, టెన్త్, పాలిటెక్నిక్ చేసిన వారు అర్హులు. రీజియన్ల వారీగా పోస్టులు, వయో పరిమితి, ఇతర వివరాల కోసం ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేయండి. దరఖాస్తు చేసేందుకు వెబ్‌సైట్‌ను https://indianrailways.gov.in సంప్రదించాలి.