India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

APR-SEPలో సెక్యూరిటీ బాండ్ల ద్వారా భారీగా రుణ సమీకరణకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024-25కు స్థూల మార్కెట్ రుణ అంచనాలు ₹14.13 లక్షల కోట్లు కాగా, తొలి 6 నెలలకు అందులో 53% లేదా ₹7.50 లక్షల కోట్లు తీసుకోనుంది. రెవెన్యూ లోటును పూడ్చడం, ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 3, 5, 7, 10, 15, 30, 40, 50 ఏళ్ల కాలపరిమితితో నిధులు సమీకరించనున్నట్లు పేర్కొన్నారు.

కంగనా రనౌత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుప్రియా శ్రీనతేకు కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. అభ్యర్థుల లిస్టు నుంచి ఆమె పేరును తొలగించింది. ఆమె స్థానంలో మహారాజ్‌గంజ్(UP) టికెట్‌ను వీరేంద్ర చౌదరికి కేటాయించింది. కంగనాకు BJP MP టికెట్ ప్రకటించిన అనంతరం, ఆమెను వేశ్యగా పేర్కొంటూ సుప్రియ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత డిలీట్ చేశారు. దీనిపై ఆమెకు ఈసీ నోటీసులిచ్చింది.

న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కోల్పోయేలా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని 600 మంది లాయర్లు సంయుక్తంగా CJI జస్టిస్ చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ‘ముఖ్యంగా పొలిటికల్ కేసుల్లో న్యాయవ్యవస్థపై కొందరు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పటి న్యాయవ్యవస్థ బాగుండేదని దుష్ప్రచారం చేస్తుంటే దానికి కొందరు లాయర్లు వంతపాడటం బాధాకరం. వీరిపై సుప్రీంకోర్టు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.

మహారాష్ట్ర ఆంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ సదానంద్ వసంత్ దాతెను NIA డైరెక్టర్‌గా కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న దినకర్ గుప్తా ఈనెల 31న రిటైర్ కానున్నారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్న వసంత్ 2026 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. 26/11 ముంబై పేలుళ్ల ఘటనలో కీలక ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబు ఇస్మాయిల్‌ను ఈయనే పట్టుకున్నారు. అప్పుడు ఈయన ముంబై అడిషనల్ సీపీగా పనిచేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 2022లో 1.5 బిలియన్ టన్నుల ఆహారం వృథా అయ్యిందని UNEP ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. అందుబాటులో ఉన్న మొత్తం ఆహారంలో ఇది ఐదో వంతు అని తెలిపింది. ఫుడ్ వేస్టేజ్ కారణంగా $1 ట్రిలియన్ నష్టపోయినట్లు పేర్కొంది. మరోవైపు 78.3 కోట్ల మంది ఆకలితో బాధపడుతున్నారని వెల్లడించింది. ప్రపంచంలో ఒక్కో వ్యక్తి సగటున ఏడాదికి 79 కేజీలు, ఇండియాలో 55 కేజీలు వృథా చేస్తున్నారట.

2024-25 విద్యాసంవత్సరం నుంచి NET స్కోరుతో PhD ప్రవేశాలు కల్పించవచ్చని యూనివర్సిటీలకు యూజీసీ సూచించింది. PhD ప్రవేశ పరీక్షల స్థానంలో నెట్ స్కోరును పరిగణించవచ్చని పేర్కొంది. జూన్ 2024 సెషన్‌కు సంబంధించిన NET దరఖాస్తు ప్రక్రియను వచ్చే వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ వెల్లడించారు.

క్లాసెన్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ ప్లేయర్. IPLలో చాలా సీజన్ల పాటు అలరించిన వార్నర్‌ను SRH వదులుకోవడంతో అలాంటి ఆటగాడి కోసం అభిమానులు ఎదురుచూశారు. వారి ఆశలను నెరవేరుస్తూ తాను ఉన్నానంటూ క్లాసెన్ ముందుకొచ్చారు. ఎవరు ఆడినా, ఆడకున్నా తాను మాత్రం అద్భుతమైన షాట్లతో భారీ స్కోర్లు చేస్తున్నారు. గత సీజన్లోనూ ఒంటరి పోరాటం చేశారు. ప్రస్తుతం టీ20ల్లో తానే బెస్ట్ ప్లేయర్‌నని నిరూపించుకుంటున్నారు.

AP: గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కామినేని శ్రీనివాస్ BJP తరఫున మళ్లీ బరిలోకి దిగుతున్నారు. 2014లో TDP-BJP పొత్తులో ఈయన కృష్ణా(D) కైకలూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో కీలకమైన వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత TDPతో పొత్తు ముగియడంతో మంత్రి పదవికి రాజీనామా చేసి పాలిటిక్స్‌లో సైలెంట్ అయ్యారు. ఈ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మహిళల్లో ఎక్కువగా వచ్చే రొమ్ము క్యానర్స్ ‘ఈస్ట్రోజన్ రిసెప్టర్ పాజిటివ్’. అయితే చికిత్స తర్వాత కూడా కొందరిలో మళ్లీ ఈ క్యాన్సర్ తిరగబెడుతోంది. చికిత్స సమయంలో క్యాన్సర్ కణాలు స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్లి కొన్నాళ్లకు తిరిగి క్రియాశీలం అవ్వడమే దీనికి కారణమని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. G9a అనే ఎంజైమ్ వల్లే ఇలా జరుగుతోందని.. దీనిని నియంత్రించడంపై దృష్టి సారిస్తున్నామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

AP: వివేకా హత్యకు ముందు జరిగిన విషయాలను మరుగున పడేశారని.. హత్య వెనుక చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి హస్తం ఉందంటూ కమలాపురం MLA రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యపై సీఎం జగన్ ఇచ్చిన <<12937346>>వివరణ <<>>టీడీపీకి చెంపపెట్టులాంటిదని మండిపడ్డారు. కడప జిల్లా ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలుసని అన్నారు. జగన్ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.