News July 13, 2024

ఇకపై అడ్డదారిలో డ్రైవింగ్ లైసెన్స్ కుదరదు!

image

TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియను ఆర్టీఏ కట్టుదిట్టం చేయనుంది. దీంతో ఇక నుంచి డ్రైవింగ్ టెస్టు ప్రక్రియ కంప్యూటర్‌‌లో రికార్డు కానుంది. డ్రైవింగ్ సరిగా చేయకపోతే కంప్యూటరే రిజెక్ట్ చేస్తుంది. అధికారులను మ్యానేజ్ చేసే అవకాశం ఉండదు. ఫెయిలైతే నెల తర్వాత టెస్టుకు రావాల్సి ఉంటుంది. కొత్త పద్ధతుల్లో 5 ట్రాకులు(H, S, మలుపులు, ఎత్తుపల్లాలు, గతుకుల K) ఉంటాయి.

News July 13, 2024

త్వరలో అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు: పొన్నం

image

TG: రద్దీకి అనుగుణంగా వెయ్యి కొత్త బస్సులు కొనుగోలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మరో 1,500 బస్సులకు ఆర్డర్ ఇచ్చామన్నారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డితో కలిసి కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. తర్వాత మాట్లాడుతూ.. త్వరలో అన్ని జిల్లా కేంద్రాలకు AC బస్సులు, నియోజకవర్గ కేంద్రాల నుంచి లగ్జరీ బస్సులు నడుపుతామన్నారు. RTC ఉద్యోగులకు 21% DA ఇచ్చామని, వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

News July 13, 2024

ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం సతీమణి

image

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు సతీమణి కమ్‌లేశ్ ఠాకూర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. కాంగ్రెస్ తరఫున డెహ్రా నుంచి పోటీ చేసిన కమ్‌లేశ్ బీజేపీ అభ్యర్థి హోశ్యార్ సింగ్‌పై 9వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. గత 20 ఏళ్లుగా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

News July 13, 2024

మాంసం అమ్మకాలు చట్టవిరుద్ధం.. తొలి నగరంగా రికార్డు

image

ప్రపంచంలోనే మాంసం అమ్మకాలు చట్టవిరుద్ధం చేసిన తొలి నగరంగా గుజరాత్‌ రాష్ట్రంలోని భావ్‌నగర్(D)లోని పాలిటనా నిలిచింది. ఈ సిటీలో మాంసం కోసం జీవాలను చంపడం, అమ్మడం, రవాణా చేస్తే చట్ట విరుద్ధమని, అతిక్రమిస్తే శిక్షలు తప్పవని స్థానిక అధికారులు నిబంధనలు తీసుకొచ్చారు. దుకాణాలను మూసేయాలంటూ జైనుల నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఇతర చోట్ల అమలు చేయనున్నారు.

News July 13, 2024

YCP చేసిన తప్పులు మనం చేయొద్దు: CM చంద్రబాబు

image

AP: ప్రజల నుంచి వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ, కమిటీలు ఏర్పాటు చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. ‘పవర్‌లోకి వచ్చేశామనే అలసత్వం వీడాలి. రోజూ ఇద్దరు మంత్రులు పార్టీ ఆఫీసులో ప్రజల వినతులు స్వీకరించాలి. నేతలెవరూ కక్షసాధింపులకు దిగొద్దు. YCP చేసిన తప్పులే మనం చేస్తే వారికి మనకు తేడా ఉండదు. కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల నుంచి చట్టపరంగా విముక్తి కలిగిద్దాం’ అని ముఖ్య నేతలతో సమావేశంలో CBN అన్నారు.

News July 13, 2024

REWIND: ‘రోబో’లో మైఖేల్ జాక్సన్ పాడతానన్నారట.. కానీ!

image

హీరో రజినీకాంత్-డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన హిట్ మూవీ ‘రోబో’లో తమిళ సాంగ్ పాడేందుకు పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్‌ ఒప్పుకున్నారట. అయితే కొన్నాళ్లకే ఆయన అనారోగ్యానికి గురవడంతో అది సాధ్యం కాలేదని ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గుర్తు చేసుకున్నారు. ఆస్కార్ వచ్చినప్పుడు తాను లాస్ ఏంజెలిస్‌లో జాక్సన్‌ను కలిసి వచ్చానన్నారు. శంకర్ సూచనతో జాక్సన్‌ను సాంగ్ పాడాలని కోరగా ఆయన ఒప్పుకున్నారన్నారు.

News July 13, 2024

పురపాలికల్లో అభివృద్ధే కనిపించడం లేదు: ఎంపీ రమేశ్

image

AP: వైసీపీ హయాంలో కడప ఉక్కు పరిశ్రమ ఒక్క శాతం కూడా పూర్తి కాలేదని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ విమర్శించారు. గడిచిన ఐదేళ్లు జగన్ తన సంపాదనకే ప్రాధాన్యం ఇచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని పురపాలికల్లో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి వసూళ్లపై ప్రజలు ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి వచ్చేలా చేస్తామన్నారు. కడప జిల్లాలో భూ దందాలపై విచారణ చేయిస్తామన్నారు.

News July 13, 2024

ఈ ఫ్యాన్సీ నంబర్‌కు రూ.6,00,999

image

TG: వాహనాల నంబర్ ప్లేట్ల వేలంలో నిన్న సికింద్రాబాద్ ఆర్టీఓకు రూ.18.28లక్షల ఆదాయం వచ్చింది. అత్యధికంగా TG 10 9999 నంబర్‌ రూ.6,00,999 పలికింది. దీని కోసం ఐదుగురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఆ తర్వాత TG 10A 0001కు రూ.3.60లక్షలు, TG 10A 0009 రూ.2.61లక్షలు పలికాయి. కాగా గతంలో నిర్వహించిన TG సిరీస్‌లో ఫస్ట్ నంబర్ TG 09 0001కి రూ.9.61లక్షలు పలికింది.

News July 13, 2024

వర్షాకాలం.. ఈ జాగ్రత్తలు పాటించండి!

image

వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం మర్చిపోకండి.
* స్ట్రీట్ ఫుడ్‌ కలుషితమయ్యే అవకాశం ఎక్కువ. దానికి దూరంగా ఉండండి.
* ఇంటిని తరచూ శుభ్రం చేసుకోండి.
* కాచి చల్లార్చిన నీరు, వేడి ఆహారం తీసుకోండి.
* సీ ఫుడ్‌‌కు కాస్త విరామం ఇవ్వడం మంచిది.
* వర్షంలో తడిస్తే తప్పనిసరిగా స్నానం చేయండి.
>> SHARE

News July 13, 2024

రెడ్ బుక్ కాదు.. హామీలు అమలు చేయండి: అంబటి

image

AP: వైసీపీ శ్రేణులపై దాడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మేనిఫెస్టోలోని అంశాలపై కాకుండా రెడ్‌ బుక్‌పైనే చంద్రబాబు, నారా లోకేశ్ దృష్టి పెట్టారని ఆరోపించారు. ‘రెడ్ బుక్‌ని కాదు, మేనిఫెస్టోని అమలు చేయండి’ అని Xలో విమర్శించారు.