India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దక్షిణాఫ్రికా, భారత మహిళా జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ నేడు మొదలవనుంది. చిదంబరం స్టేడియం వేదికగా 9.30amకి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాపై 3వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన హర్మన్ సేన ఇప్పుడు టెస్ట్ సిరీస్‌పై కన్నేసింది. వన్డే సిరీస్‌లో సెంచరీలతో అదరగొట్టిన స్మృతి మంధానాపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. SAతో చివరిగా 2014లో భారత్ టెస్టు మ్యాచ్ గెలిచింది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 8,326 పోస్టులు (4,887 MTS+3,439 హవల్దార్) ఉన్నాయి. జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. OCT-NOVలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. MTS పోస్టులకు 18-25 ఏళ్లు, హవల్దార్ పోస్టులకు 18-27 ఏళ్ల వయసు ఉండాలి. టెన్త్ పాసైన వారు అర్హులు. పూర్తి వివరాలకు <

TG: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేస్తూ సమగ్రశిక్ష విద్యాశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి 12వ తరగతుల్లోని విద్యార్థులకు నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. రిజిస్ట్రేషన్ కాని విద్యార్థులను త్వరగా నమోదు చేయాలంది. కాగా గతంలో ఇదే విధానం టీచర్లకు సైతం అమలు చేసేందుకు విద్యాశాఖ యత్నించగా వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

అవినీతికి పాల్పడినట్లు తేలడంతో రక్షణ శాఖలో మంత్రులుగా పనిచేసిన ఇద్దర్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ తప్పించింది. పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు వారిపై విచారణ కూడా ప్రారంభించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. జనరల్ వే ఫంగ్హా(70), జనరల్ లీ షాంగ్‌ఫు(66) క్రమశిక్షణను, చట్టాలను ఉల్లంఘించారని, అధికార దుర్వినియోగంతో అవినీతికి పాల్పడ్డారని వివరించింది.

అభిమానిని క్రూరంగా హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్‌కు టాలీవుడ్ హీరో నాగశౌర్య మద్దతు తెలిపారు. రేణుకాస్వామి మృతిపై విచారం వ్యక్తం చేస్తూనే.. దర్శన్ కలలో కూడా ఎవరికీ హాని చేసే వ్యక్తి కాదన్నారు. ఈ విషయంలో ప్రజలు తొందరపాటుతో ఆయనను దోషిగా నిర్ధారిస్తుంటే బాధేస్తోందన్నారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, త్వరలోనే నిజం బయటికి వస్తుందని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

24 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోలేదని సుప్రీం కోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. యూకేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘భారత్‌లో జడ్జిలు ప్రభుత్వ రాజకీయ ప్రభావం నుంచి దూరంగా ఉంటారు. అయితే, తమ నిర్ణయాలు రాజకీయంగా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో న్యాయమూర్తులకు అవగాహన ఉండాలి. పాలనాపరమైన కేసుల విచారణ సందర్భంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని పేర్కొన్నారు.

TG: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్ ద్వారా రిలీజ్ చేయనున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరిగాయి. వీటికి దాదాపు 51, 237 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను WAY2NEWSలో వేగంగా, సులభంగా తెలుసుకోవచ్చు.

AP: వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 4 రోజుల పాటు యాత్రను నిలిపివేస్తున్నామన్నారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన ఈ పాపికొండల పర్వతశ్రేణి అందాలు ఆకట్టుకుంటాయి. గోదావరిపై లాంచీ ప్రయాణం, జలపాతాలు, గ్రామీణ వాతావరణం పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి.

టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా తన జైత్రయాత్ర కొనసాగిస్తూ ఫైనల్‌కు చేరింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్లపై ప్రతీకారం తీర్చుకుని మరీ పదేళ్ల తర్వాత ఫైనల్లో అడుగు పెట్టింది. వన్డే వరల్డ్ కప్ చేజారడంతో పొట్టి ప్రపంచకప్ సాధించాలని భారత్ పట్టుదలతో ఉంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ చేజిక్కించుకోవాలని యోచిస్తోంది.

TG: రాష్ట్రంలోని 18,942 మంది టీచర్ల ప్రమోషన్ల కల నెరవేరింది. చట్టపరమైన వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో ప్రమోషన్స్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. మల్టీజోన్1లో 10,083 మంది SGTలు స్కూల్ అసిస్టెంట్లుగా, 1,094 మంది స్కూల్ అసిస్టెంట్లు HMలుగా ప్రమోషన్ పొందారు. మల్టీజోన్2లో SGT నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా 6,989 మంది, 776 మంది స్కూల్ అసిస్టెంట్లు HMలు అయ్యారు.
Sorry, no posts matched your criteria.