India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కోచ్ రాహుల్ ద్రవిడ్ కోసమైనా టీ20 WC-2024ని టీమ్‌ఇండియా గెలవాలని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నారు. ‘సచిన్ కోసం 2011 ODI వరల్డ్‌కప్ గెలిచాం. ఇప్పుడు ద్రవిడ్ కోసం టీ20 WC గెలవాలి. ప్లేయర్‌గా ఆయనకు WC దక్కలేదు. కోచ్‌గా ఇప్పుడు గెలిచే ఛాన్సుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా భారత జట్టు కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ఈ టోర్నీ తర్వాత ముగియనున్న సంగతి తెలిసిందే.

లంక ప్రీమియర్ లీగ్(LPL-2024)లో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. 1-6 ఓవర్లలో ఉండే పవర్ ప్లేకు అదనంగా 16, 17 ఓవర్లలో ‘పవర్ బ్లాస్ట్ ఓవర్లు’ ఉంటాయని పేర్కొంది. ఈ ఓవర్లలో నలుగురు ఫీల్డర్లు మాత్రమే 30 యార్డ్ సర్కిల్ బయట ఉండేందుకు అనుమతి ఉంటుంది. శ్రీలంక బోర్డు ఈ టీ20 లీగ్‌ను 2020లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది LPL జులై 1 నుంచి ప్రారంభం కానుంది.

TG: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఆగస్టుకు ముందే చేసి చూపిస్తామని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రైతు భరోసాపై విధివిధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చించి అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించినవారు సంపదను దోచేసి రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి పారిపోయారని విమర్శించారు.

TPCC చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే CM రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు. మరికాసేపట్లో డిప్యూటీ CM భట్టి హస్తినకు పయనం కానున్నారు. ఇవాళ రాత్రి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్, మున్షీ, భట్టి భేటీ కానున్నారు. PCC చీఫ్ ఆశావహులపై చర్చించనున్నారు. కాగా జీవన్ రెడ్డి, మధుయాష్కీగౌడ్, మహేశ్ కుమార్ పదవి కోసం ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.

AP: 16,347 పోస్టులతో ఈ నెల 30 మెగా డీఎస్సీ <<13518354>>నోటిఫికేషన్<<>> విడుదలకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80 శాతం టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక <<13504415>>మొత్తం<<>> పోస్టుల్లో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661, ఎస్సీ సంక్షేమ శాఖలో 439, బీసీ సంక్షేమ శాఖలో 170, ఎస్టీ సంక్షేమ శాఖలో 2,024, విభిన్న ప్రతిభావంతుల శాఖలో 49 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మరో గంటలో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హన్మకొండ, HYD, జనగామ, గద్వాల, కామారెడ్డి, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండలో వాన పడొచ్చని పేర్కొంది. అలాగే నారాయణపేట, RR, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్‌లో వర్షంతో పాటు 40కి.మీ వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకరిగా పేరున్న ప్రభాస్ ‘కల్కి’కి ఫీజు సగానికి తగ్గించారట. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.150కోట్లు తీసుకుంటారని, ‘కల్కి’కి రూ.80కోట్లే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు భారీగా బడ్జెట్(రూ.600కోట్లు) పెట్టాల్సి రావడమే ప్రభాస్ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. అటు అమితాబ్, కమల్ హాసన్, దీపిక తలా రూ.20కోట్లు తీసుకున్నారట.

AP: వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవడానికే రెడ్ బుక్ అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైజాగ్ సీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఆమె సమావేశమయ్యారు. తాను సోషల్ మీడియా బాధితురాలినేనని చెప్పారు. అసభ్య పోస్టులపై చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. కేంద్ర నిధులొచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదన్నారు.

TG: మాజీ CM, BRS అధినేత KCR ఓమ్నీ వ్యాన్ నడిపారు. తుంటి గాయం నుంచి కోలుకుంటున్న ఆయనకు మాన్యువల్‌గా కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించడంతో తన పాత ఓమ్నీ వ్యాన్ నడిపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కేసీఆర్ వాహనం నడపడంతో ‘‘సారు మళ్లీ ‘కారు’ నడపడం మొదలుపెట్టారు’’ అని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని KTR అన్నారు. కేంద్రంతో CM రేవంత్ కుమ్మక్కై BJPకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి పరిధిలోని పార్టీ నేతలు, బొగ్గు గని కార్మిక నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ‘సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.