India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

UPలోని శ్రావస్తి జిల్లాలో దారుణం జరిగింది. తమ ఫంక్షన్‌కు ఎక్కువ డబ్బు తీసుకున్నాడనే సాకుతో DJ ఆపరేటర్(15ఏళ్ల బాలుడు)తో కొందరు యువకులు మూత్రం తాగించారు. లిక్కర్ బాటిల్‌లో మూత్రం పోసి బలవంతంగా బాధితుడితో తాగించి వీడియో తీశారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులైన కిషన్ తివారీ, దిలీప్ మిశ్రా, సత్యం తివారీ మద్యం మత్తులో ఈ దారుణం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇది ఆందోళన కలిగించే అంశమని CJI జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే ఇటువంటి కేసులను హైకోర్టుల్లో పరిష్కరించడం మంచిదని, పిటిషనర్ అలహాబాద్ (యూపీ) కోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోరింది.

వాల్మీకి కార్పొరేషన్ స్కాం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ MLA నాగేంద్రను ED అదుపులోకి తీసుకుంది. ఆయన షెడ్యూల్ తెగల సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న సమయంలో భారీ స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఈ శాఖ అకౌంట్స్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సూసైడ్ లెటర్‌లో పలువురి పేర్లు రాసిన విషయం తెలిసిందే. అప్పుడే నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

AP: MLA రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో మాజీ సీఎం జగన్, అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్‌పై గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి సీఎం జగన్ ఒత్తిడితోనే 2021 మే 14న తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని, హత్యాయత్నం చేశారని RRR ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో A-1గా ఐపీఎస్ సునీల్ కుమార్, A-2గా IPS సీతారామాంజనేయులు, A-3గా జగన్ పేరును పోలీసులు FIRలో చేర్చారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలి ఆఫీసుకు రావాలని TCS ఇప్పటికే ఉద్యోగులను హెచ్చరించినా ఇంకా చాలా మంది రావట్లేదు. ఈక్రమంలో వేరియబుల్ పేను అంటెండెన్స్‌కు లింక్ చేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో 70శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నట్లు చీఫ్ HR మిలింద్ లక్కడ్ తెలిపారు. ఉద్యోగులు కనీసం 85 శాతం హాజరు ఉంటేనే పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందుతారు. 60% కంటే తక్కువ హాజరు ఉంటే బోనసే రాదు.

విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 14న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అన్ని భాషల్లో కలిపి రూ.100కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

టీమ్‌ఇండియా బౌలింగ్ కోచ్‌గా రోజుకో పేరు వినిపిస్తోంది. తాజాగా సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ మోర్నీ మోర్కెల్ ఈ లిస్టులో చేరారు. ఆయనకు పాక్‌తో పాటు IPLలో LSGకి బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన అనుభవముంది. ఇప్పటికే బాలాజీ, జహీర్, వినయ్ కుమార్ ఈ రేసులో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అభిషేక్ నాయర్, డెస్కాటే అసిస్టెంట్ కోచ్‌గా వస్తారని ప్రచారం జరిగింది. వీరు IPLలో గంభీర్‌తో పనిచేశారు. మరి ఎవరికో ఛాన్స్ దక్కుతుందో చూడాలి.

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యలో జూ.ఎన్టీఆర్‌ను అధిగమించారు. ఎన్టీఆర్‌కు 7.5మిలియన్ల ఫాలోవర్లుండగా మంచు విష్ణును 8మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 26.5మిలియన్ల ఫాలోవర్లతో అల్లు అర్జున్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. రామ్ చరణ్ 23.9M, విజయ్ దేవరకొండ 21.7M ఫాలోవర్లతో ఉన్నారు. కాగా మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈరోజు జరగనున్న అనంత్ అంబానీ పెళ్లి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని నెలలుగా సాగుతున్న వేడుకల్లో ప్రపంచంలోని టాప్ సెలబ్రెటీలు పాల్గొన్నారు. కాగా, అనంత్-రాధికను ఆశీర్వదించేందుకు సెలబ్రెటీలు, పొలిటీషియన్స్ ముంబై చేరుకున్నారు. వివాహానికి మొత్తం రూ.5000 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇది అంబానీ నికర విలువలో 0.5% మాత్రమే.

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 16న సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో 9 కీలక అంశాలపై సీఎం చర్చించనున్నారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, ఆరోగ్యం-సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతిభద్రతలు, డ్రగ్స్ నిర్మూలన క్యాంపెయిన్ అంశాలపై వివరాలతో హాజరుకావాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.