India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ముంబైతో జరుగుతున్న మ్యాచులో SRH ప్లేయర్లు వీర విధ్వంసం సృష్టిస్తున్నారు. అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లో 50 రన్స్‌తో చెలరేగారు. అతడి ఇన్నింగ్సులో 6 సిక్సర్లు, 2 ఫోర్లున్నాయి. IPLలో SRH తరఫున ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ఇదే మ్యాచులో కొద్దిసేపటి క్రితమే హెడ్(18 బంతుల్లో 50) రికార్డును అభిషేక్ బద్దలుకొట్టారు.

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సిక్సులు, ఫోర్ల వర్షం కురుస్తోంది. హైదరాబాద్ ప్లేయర్లు ముంబై బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. బౌలర్ ఎవరని చూడకుండా సిక్సులు, ఫోర్లు బాదుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. దీంతో SRH కేవలం 7 ఓవర్లలోనే 102* పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లోనే 62 పరుగులతో విధ్వంసం సృష్టించారు. మరో బ్యాటర్ అభిషేక్ శర్మ 11 బంతుల్లోనే 32* రన్స్‌తో క్రీజులో ఉన్నారు.

AP: ఇటీవల సీఎం జగన్ సభల్లో ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా ప్రొద్దుటూరు సభలో ప్రసంగించిన తర్వాత జగన్ ప్రజలను క్షమించమని కోరారు. ‘చీకటి పడింది కాబట్టి సెక్యూరిటీ వాళ్లు ర్యాంప్ వాక్ వద్దంటున్నారు. ఈసారికి క్షమించమని అడుగుతున్నా’ అని కోరారు. ఇక ప్రతి ఇంటికీ సంక్షేమం అందాలంటే జగనన్నే సీఎం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

AP: టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మరో 8 <<12937700>>అసెంబ్లీ<<>> స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ జాబితాలో టీడీపీ పోటీ చేసే ఆరు నియోజకవర్గాలు చీపురుపల్లి, భీమిలి, దర్శి, అనంతపురం అర్బన్, గుంతకల్లు, ఆలూరు ఉన్నాయి. ఇక జనసేన పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానాల్లో ఆశావహుల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో ఆయా పార్టీల అధినేతలకు తలనొప్పిగా మారింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విజృంభిస్తున్నారు. ముంబైతో మ్యాచ్‌లో సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతున్నారు. బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా కేవలం 18 బంతుల్లోనే 52* రన్స్ చేశారు. అందులో 2 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. SRH చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

AP: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి సిద్ధమవుతోంది. అందులో భాగంగా మొత్తం 175 స్థానాలకు గానూ 167 మంది అభ్యర్థులను ఎన్డీఏ కూటమి ప్రకటించింది. టీడీపీ ఐదు స్థానాలు, జనసేన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనతే, బీజేపీ లీడర్ దిలీప్ ఘోష్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై ‘వేశ్య’ అని సుప్రియ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ‘ఎవరి కూతురో’ అనే అర్థం వచ్చేలా అభ్యంతరకరంగా మాట్లాడినందుకు బీజేపీ లీడర్ దిలీప్ ఘోష్‌కు సైతం EC నోటీసులిచ్చింది.

శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ అభ్యర్థి అమోల్ కీర్తికర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కరోనా సమయంలో వలస కార్మికులకు ఆహారం పంపిణీకి సంబంధించి కాంట్రాక్టుల అప్పగింతలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. కాగా.. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే అతణ్ని భయపెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఈడీతో నోటీసులు పంపించినట్లు శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండు స్థానాలతో ఏడో జాబితాను విడుదల చేసింది. మహారాష్ట్రలోని అమరావతి నుంచి నటి నవనీత్ కౌర్ రాణా పోటీ చేయనున్నారు. 2019 ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ గెలిచారు. తర్వాత BJPలో చేరారు. ఇక కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి గోవింద్ కర్జాల్ బరిలో నిలిచారు. హరియాణాలోని కర్నాల్ నుంచి ఆ రాష్ట్ర సీఎం నాయబ్ సింగ్ సైనీ పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది.

AP: ప్రత్యర్థులంతా ఒక్కటై తనపై యుద్ధం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. ‘టీడీపీ, బీజేపీ, దత్తపుత్రుడు కలిసిపోయారు. చంద్రబాబుకి శవరాజకీయాలు, కుట్రలు అలవాటు. నాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్లు నా చెల్లెల్ని కూడా తీసుకొచ్చారు. ఒంటరిగా వచ్చే ధైర్యం ఒక్కరికి కూడా లేదు. మోసాలు చేసే కూటమి మనకు ప్రత్యర్థిగా ఉంది. వారికి నైతిక విలువలు లేవు’ అని జగన్ మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.