News March 23, 2024

ఢిల్లీపై పంజాబ్ విజయం

image

కొత్త హోం గ్రౌండ్‌లో పంజాబ్ తొలి మ్యాచ్‌లోనే విజయం నమోదు చేసింది. చండీగఢ్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 175 రన్స్ టార్గెట్‌తో ఛేదనకు దిగిన పంజాబ్‌ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.. సామ్ కరన్ (63) హాఫ్ సెంచరీతో రాణించారు. పంజాబ్ తన హోం గ్రౌండ్‌ను మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఇటీవల మార్చుకుంది.

News March 23, 2024

రామ్ చరణ్ బర్త్ డే కామన్ మోషన్ పోస్టర్

image

హీరో రామ్ చరణ్ మార్చి 27న తన బర్త్ డే జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేయడానికి ఆయన ఫ్యాన్స్ ప్రణాళికలు సిద్ధం చేశారు. చరణ్ కోసం సిద్ధం చేసిన కామన్ డిస్ప్లే పిక్చర్ (CDP)ని టాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలతో విడుదల చేయించారు. ‘నా ప్రియమైన వ్యక్తి CDPని విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక వేడుకలు ప్రారంభిద్దాం’ అని నటుడు రానా ట్వీట్ చేశారు.

News March 23, 2024

కేజ్రీవాల్ CMగా కొనసాగడం చెత్త రాజకీయం: ఠాకూర్

image

లిక్కర్ స్కాం కేసులో ఈడీ రిమాండ్‌లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ పదవిలో కొనసాగడం సరికాదని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. వీటిని చెత్త రాజకీయాలు అని ఆయన అభివర్ణించారు. ఇదిలా ఉంటే ఆయన స్థానంలో సీఎం బాధ్యతలు చేపట్టేందుకు ఆప్ లీడర్లు పోటీ పడుతున్నారని, కానీ.. ఈ రేసులోకి కేజ్రీవాల్ భార్య కూడా చేరారని బీజేపీ మంత్రి అన్నారు.

News March 23, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు

image

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, SIBలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని 8 గంటలపాటు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీరిద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రణీత్ రావుతో కలిసి వీరిద్దరూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

News March 23, 2024

ఆ అమైనో యాసిడ్ తగ్గిస్తే దీర్ఘాయువు!

image

మన శరీరంలోని 20 రకాల అమైనో యాసిడ్స్‌లో ఒకటైన ఐసోలియూసిన్ వినియోగం తగ్గిస్తే వృద్ధాప్యం త్వరగా దరిచేరదని పరిశోధకులు కనుగొన్నారు. తమ పరిశోధనలో ఎలుకల ఆయుష్షు 33% పెరిగిందని తెలిపారు. ఆరోగ్యానికి సంబంధించిన 26 అంశాల్లో ఇవి వృద్ధి సాధించాయట. మనుషులకు ఇది వర్తించొచ్చని దీనిపై సమగ్ర పరిశోధన చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఐసోలియూసిన్ గుడ్లు, మాంసం, డైరీ ఉత్పత్తులు మొదలైన పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది.

News March 23, 2024

మెగాస్టార్ ఆఫర్లు తిరస్కరించా: పృథ్వీరాజ్

image

‘సలార్’లో వరదరాజ మన్నార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన పృథ్వీరాజ్ సుకుమారన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. HYD వచ్చిన ఆయన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. సైరా నరసింహారెడ్డిలో నటించాలని, గాడ్ ఫాదర్‌కి దర్శకత్వం వహించాలని మెగాస్టార్ తనను కోరారని చెప్పారు. ఆ రెండుసార్లు తాను ‘ఆడుజీవితం’లో బిజీగా ఉండటంతో చిరంజీవికి క్షమాపణ చెప్పినట్లు వెల్లడించారు.

News March 23, 2024

రష్యా ఉగ్రదాడి.. 150కి చేరిన మృతుల సంఖ్య

image

రష్యా రాజధాని మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 150 మంది చనిపోయారు. మరికొంత మంది ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. కాగా ఇప్పటికే 11 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులకు ఉక్రెయిన్‌తో సంబంధం ఉందని అందుకే వారు ఆ దేశంలోకి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారని రష్యా సెక్యూరిటీ సర్వీస్ పేర్కొంది.

News March 23, 2024

ఉల్లి ఎగుమతులపై నిషేధం పొడిగింపు

image

ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నిషేధంపై గతంలో విధించిన గడవు ఈనెల 31న ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కాగా ఈ నిర్ణయాన్ని పలువురు నిపుణులు తప్పుపడుతున్నారు. ఈ నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని.. నిజానికి ఇప్పుడు బ్యాన్ పొడగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

News March 23, 2024

ఫలితాలు విడుదల

image

TS: ప్రభుత్వ వెటర్నరీ&ఏనిమల్ హస్బెండరీ విభాగంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. TSPSCలో పరీక్షకు హాజరైన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను అందుబాటులో ఉంచారు. ఎంపికైన వారికి త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండనుంది. డిసెంబర్ 22, 2022లో ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 185 పోస్టులు ఉన్నాయి. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News March 23, 2024

కవిత ఆడపడుచు ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు

image

TG: ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. మాదాపూర్‌లోని కవిత బంధువుల ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 11 గంటలపాటు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత మేనల్లుడు శరణ్ పాత్రపై ఆరా తీస్తున్నారు.