News February 26, 2026

బెన్నెట్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 26 రన్స్

image

T20WC: భారత్‌పై 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే పోరాడుతోంది. శివమ్ దూబే వేసిన 15వ ఓవర్‌లో ఏకంగా 26 రన్స్ వచ్చాయి. అందులో బెన్నెట్ 2 సిక్సులు, 2 ఫోర్లు, ఓ టుడీ బాదారు. మిగతావి వైడ్లు, నో బాల్ ద్వారా యాడ్ అయ్యాయి. ప్రస్తుతం 78 పరుగుల వద్ద ఉన్న బెన్నెట్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. జింబాబ్వే స్కోర్ 16.2 ఓవర్లకు 144/3గా ఉంది.

News February 26, 2026

TG ప్రభుత్వానికి విద్యాకమిషన్ ప్రతిపాదనలు

image

* బోధనా మాధ్యమంగా ఇంగ్లిష్. త్రిభాషా విధానం(తెలుగు/ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ) ఒకటో తరగతి నుంచే అమలు.
* SSC, ఇంట‌ర్ బోర్డులు విలీనం చేసి, 12వ త‌ర‌గ‌తిలో బోర్డు ఎగ్జామ్స్ నిర్వ‌హించాలి. కనీస ఉత్తీర్ణ‌త శాతాన్ని 45కు పెంచాలి.
* EAPCET ర‌ద్దు చేసి ఇంజినీరింగ్‌, వ్య‌వ‌సాయం, ఫార్మ‌సీ ప్ర‌వేశాలు 12వ త‌ర‌గ‌తి మార్కుల ఆధారంగా కేటాయించాలి.
* IIT-JEE/NEET కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నియంత్రణకు చట్ట సవరణ చేయాలి.

News February 26, 2026

పనితీరు ఆధారంగానే టీచర్లకు ప్రమోషన్లు.. విద్యా కమిషన్ ప్రతిపాదన

image

TG: టీచర్లకు ఆటోమేటిక్ పదోన్నతులు రద్దు చేసి, పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విద్యాకమిషన్ కీలక సూచనలు చేసింది. ఐదేళ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా వేయడం తప్పనిసరి చేయాలని, రెండేళ్లలో మెరుగుపడకపోతే సర్వీస్ నుంచి తొలగించేలా నిబంధనలు మార్చాలంది. ఈ నిబంధన ఇకపై నియమించే ఉపాధ్యాయులకు వర్తింపచేయాలని అభిప్రాయపడింది. ఈ మేరకు నివేదికను CM రేవంత్ రెడ్డికి అందజేసింది.

News February 26, 2026

ఆధార్ సెంటర్ ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చు!

image

మీ ప్రాంతంలో ఆధార్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవడం ఇబ్బందిగా ఉందా? త్వరలో అలాంటి సమస్య ఉండదు. గూగుల్ మ్యాప్స్‌‌లో సెంటర్ అడ్రస్‌, అక్కడ అందే సేవల డిటైల్స్ కనిపించనున్నాయి. పార్కింగ్, సెంటర్ టైమింగ్స్ తదితర వివరాలూ తెలుసుకోవచ్చు. అందుకు గూగుల్‌‌తో UIDAI ఒప్పందం కుదుర్చుకుంది. ఆధార్ నమోదు, తప్పుల సవరణ తదితరాలకు ఈజీగా అధికారిక సెంటర్లను గుర్తించడానికి ఇది దోహదపడుతుందని UIDAI తెలిపింది.

News February 26, 2026

లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి రిమాండ్

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి ACB కోర్టు రేపటి దాకా రిమాండ్ విధించింది. గుంటూరు(D) జైలుకు అతడిని తరలించారు. A1 రాజ్ కసిరెడ్డితో కలిసి అవినాశ్ ₹కోట్ల లావాదేవీలు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ‘మద్యం సిండికేట్‌కు ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. ముడుపులు చెల్లించే కొత్త బ్రాండ్లకు అనుకూలంగా ఆర్డర్ ఫర్ సప్లై కేటాయించారు’ అని అందులో వెల్లడించారు.

News February 26, 2026

కన్నులపండువగా శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

image

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. తొలిరోజు స్వామి పుష్కరిణిలో తెప్పపై మూడు సార్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.

News February 26, 2026

జింబాబ్వేపై భారత్ విధ్వంసం.. స్కోర్ ఎంతంటే?

image

T20WC: చెన్నై వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగారు. దీంతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్(55) హాఫ్ సెంచరీ చేశారు. ఇషాన్(38), సంజూ(24), సూర్య(33) రాణించారు. చివర్లో హార్దిక్(23 బంతుల్లో 50*), తిలక్(16 బంతుల్లో 44*) మెరుపులు మెరిపించారు. జింబాబ్వే టార్గెట్ 257 రన్స్.

News February 26, 2026

ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవే!

image

శరీర కండరాల బలం, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగవ్వడానికి ప్రొటీన్ ఫుడ్ చాలా అవసరం. చికెన్ బ్రెస్ట్, చేపలు, గుడ్లు, పనీర్, పెరుగు, పప్పుధాన్యాలు, సోయా, బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, గుమ్మడికాయ గింజల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని డైలీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆకలిని తగ్గించి బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.

News February 26, 2026

అసైన్డ్ భూములు లీజుకు.. ఎకరాకు ₹31 వేలు: అనగాని

image

AP: అసైన్డ్ భూముల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కొన్నిచోట్ల అసైన్డ్ భూములు అవసరం. అసైన్‌దారుల అనుమతితో లీజుకు తీసుకుంటాం. లీజుతో వారికి ఆదాయం వస్తుంది. ఎకరాకు ₹31వేలు చొప్పున ఇస్తాం. రెండేళ్లకోసారి 5% వరకు పెంచుతాం’ అని చెప్పారు. 10వేల MW సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటవుతాయని, 7.5L మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు.

News February 26, 2026

హార్వర్డ్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నాం: CM రేవంత్

image

TG: హార్వర్డ్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని గ్రూప్-1,2 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో CM రేవంత్ వెల్లడించారు. ‘ఇక్కడి నుంచి హార్వర్డ్‌కు వెళ్లేందుకు చాలామందికి కష్టమవుతోంది. అందుకే MCHRD-హార్వర్డ్ మధ్య ఓ ఒప్పందం చేసుకుంటున్నాం. వాళ్లే ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ క్లాసెస్ చెబుతారు’ అని రేవంత్ వివరించారు. ఇక ఆఫీసర్లంతా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని సూచించారు.