News February 26, 2026

పదేళ్లలో ఒక్క గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వలేదు: CM రేవంత్

image

TG: గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక TGPSCని ప్రక్షాళన చేశామన్నారు. ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా కఠిన చర్యలు చేపట్టామని గ్రూప్-1,2 ఆఫీసర్ల ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారంతా ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయాలని సూచించారు.

News February 26, 2026

మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయండి.. MLCల వినతి

image

AP: శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఎదుట విచారణకు హాజరైన MLCలు బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ తమ రాజీనామాలను ఆమోదించాలని మరోసారి కోరారు. ఈ సందర్భంగా రాజీనామాలకు గల కారణాలపై ఛైర్మన్ వారిని ప్రశ్నించారు. ‘రాజీనామా ఎందుకు చేశారు. ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా?’ అని అడిగారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని వెంటనే అంగీకరించాలని జవాబిచ్చారు. వీరికి ఛైర్మన్ నోటీసులివ్వగా ఇవాళ హాజరై వివరణ ఇచ్చారు.

News February 26, 2026

తాళికట్టు శుభవేళ.. రష్మిక ఆనందబాష్పాలు

image

ఏ ఆడపిల్లకైనా వివాహమనేది జీవితంలో మధురమైన ఘట్టం. హీరోయిన్ రష్మిక మందన్న కూడా చిన్న కుటుంబం నుంచి నేషనల్ క్రష్ స్థాయికి చేరుకొని ఇప్పుడు విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్నారు. జీవితాంతం తోడుంటానంటూ అగ్నిసాక్షిగా విజయ్ తన మెడలో తాళికట్టిన శుభవేళ రష్మిక కళ్లలో నీళ్లు తిరిగాయి. తన ఆనందాన్ని కన్నీళ్ల రూపంలో వ్యక్తపరిచిన ఫొటో పైన చూడవచ్చు.

News February 26, 2026

ప్రభుత్వ విద్యార్థుల ట్రాన్స్‌పోర్టుపై సీఎం కీలక ఆదేశాలు

image

TG: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ట్రాన్స్‌పోర్టుకు ఎలక్ట్రిక్ బస్‌ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్ మినహా మిలిగిన నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో మండలంలో ట్రాన్స్‌పోర్ట్ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇక బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌లో తప్పనిసరిగా పాలు అందించాలని, అందుకోసం విజయ డెయిరీ నుంచి మిల్క్ సేకరించాలని చెప్పారు.

News February 26, 2026

పార్వతీ దేవి ఒడిలో పరమశివుడు.. ఈ దృశ్యం మరెక్కడా చూడలేరు!

image

సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగాకారంలోనే దర్శనమిస్తాడు. కానీ తిరుపతికి 75kms దూరంలోని సురుటుపల్లిలో ‘పళ్లికొండేశ్వర స్వామి’గా మానవ రూపంలో కొలువై ఉన్నాడు. క్షీరసాగర మథనంలో హాలాహలం మింగిన శివుడు కాస్త అస్వస్థతకు లోనై పార్వతీదేవి ఒడిలో తలపెట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఇక్కడ విగ్రహం ఉంటుంది. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇలాంటి వింత విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..

News February 26, 2026

లడ్డూపై చర్చకు రెడీ: పయ్యావుల

image

AP: తిరుమల లడ్డూ అంశంపై శాసన మండలిలో మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టంచేశారు. ‘లడ్డూ అంశంపై దేవదాయ శాఖ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే YCP సభ్యులు అడ్డుతగలడం సరికాదు. కేవలం సభకు రావాలి, అల్లరి చేయాలి, బట్ట కాల్చి మీద వేయాలనే ధోరణితో వస్తున్నారు. తర్వాత వాక్ అవుట్ చేసి పోతున్నారు. YCP వాక్ అవుట్ పార్టీగా మారిపోయింది’ అని ఎద్దేవా చేశారు.

News February 26, 2026

రష్మిక-విజయ్ పెళ్లి ఫొటోలు

image

విజయ్ దేవరకొండ-రష్మిక ఇవాళ ఉదయం గ్రాండ్‌గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పెళ్లి ఫొటోలను రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా’ అని క్యాప్షన్ ఇచ్చారు. విజయ్ సైతం పెళ్లి ఫొటోలను SMలో షేర్ చేశారు. దీంతో అభిమానులు విరోష్ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

News February 26, 2026

T20 WC: టాస్ ఓడిన భారత్

image

చెన్నై వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచులో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ఇండియా జట్టులో 2 మార్పులు జరిగాయి. రింకూ స్థానంలో సంజూ, సుందర్ ప్లేస్‌లో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు.
IND: సంజూ శాంసన్, అభిషేక్, ఇషాన్, సూర్య, తిలక్, హార్దిక్, దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, వరుణ్, బుమ్రా.
ZIM: మారుమని, బెనెట్, మేయర్స్, బర్ల్, రజా, మున్యోంగా, ముసెకివా, ఇవాన్స్, మపోసా, ముజరబని, ఎంగర్వ.

News February 26, 2026

డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ విధానం ప్రవేశపెట్టాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ‘అతివేగం, డ్రంకెన్ డ్రైవ్ వంటి కారణాలతో ఏటా 1.8L మంది చనిపోతున్నారు. అందుకే త్వరలో కొత్త విధానం తెస్తాం. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే పాయింట్ల కోత పడుతుంది. అన్ని పాయింట్లు కోల్పోతే లైసెన్స్‌ను 6నెలలు సస్పెండ్ చేస్తాం. రిపీట్ చేస్తే లైసెన్స్‌ రద్దు చేస్తాం’ అని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు.

News February 26, 2026

రోజూ లిప్‌స్టిక్ వాడుతున్నారా?

image

పెదాలు అందంగా కనిపించడానికి చాలామంది మహిళలు లిప్‌స్టిక్ వాడుతుంటారు. అయితే వీటిలో ఉండే రసాయనాల వల్ల అనారోగ్యాల ముప్పుందంటున్నారు నిపుణులు. చాలా లిప్‌స్టిక్‌ల తయారీలో కాడ్మియం, సీసం, క్రోమియం, అల్యూమినియం రసాయనాలు వాడతారు. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థలు దెబ్బతినడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తాయని హెచ్చరిస్తున్నారు. లెడ్ ఫ్రీ, నాన్ టాక్సిక్ ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.