News February 26, 2026

మార్చి 2న ‘పెద్ది’ నుంచి సెకండ్ సింగిల్

image

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రం నుంచి మరో పాట విడుదలవుతోంది. మార్చి 2న ‘రాయ్ రాయ్ రా రా’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్‌ను షేర్ చేశారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాట మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా పెద్ది సినిమా రిలీజ్ కానుంది.

News February 26, 2026

ఇండియా-జింబాబ్వే మ్యాచ్.. ‘డ్యూ’ రాకుండా ఏం చేశారంటే..?

image

T20 WC సూపర్-8లో ఇండియా-జింబాబ్వే మధ్య చెన్నైలో మరికొన్ని గంటల్లో కీలక పోరు జరగనుంది. డ్యూ(మంచు) ప్రభావం ఉండకుండా తేమను నియంత్రించే ప్రత్యేక రసాయనాన్ని గ్రౌండ్‌లో స్ప్రే చేశారు. ఇందుకోసం ‘డ్యూ క్యూర్’ కెమికల్‌ను US నుంచి తెప్పించారని తెలుస్తోంది. డ్యూ వల్ల బంతి స్కిడ్ అయి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేసే జట్టు ఇబ్బంది పడుతుంది. అలా జరగొద్దని కెమికల్ స్ప్రే చేశారు. మరి అదెలా పని చేస్తుందో!

News February 26, 2026

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>సోలార్ <<>>ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(SECI) 19 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BTech/BE, CA, MBA/PGDM, MCom/BCom అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. GMకు గరిష్ఠ వయసు 55, మేనేజర్‌కు 40ఏళ్లు, మిగతా పోస్టులకు 28ఏళ్లు. స్క్రీనింగ్ టెస్ట్/ రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.seci.co.in

News February 26, 2026

ఎందుకలా?!: షుగర్ ఉన్నవారిలో తరచూ నీరసం..

image

షుగర్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉన్నా అవయవాల్లోని కణాలకు అవసరమైన శక్తి అందక నీరసంగా అన్పిస్తుంది. దీనికి కారణం ఇన్సులిన్ అనే హార్మోన్ పని చేయకపోవడం. ఇన్సులిన్‌ను క్లోమం ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించి కణాలకు శక్తిని అందిస్తుంది. శరీరంలో ఇది తగినంత ఉత్పత్తి కాకపోతే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి డయాబెటిస్‌కు దారి తీస్తుంది. ప్రతిరోజూ 4pmకు ఎందుకలా?!.

News February 26, 2026

బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

image

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.

News February 26, 2026

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో స్టీఫెన్ హాకింగ్.. బికినీల్లోని మహిళల మధ్యలో!

image

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఫొటోలు బయటపడటం సంచలనం రేపుతోంది. US న్యాయ శాఖ రిలీజ్ చేసిన చిత్రంలో ఆయనకు ఇరువైపులా బికినీల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ముగ్గురి చేతుల్లో డ్రింక్స్ ఉండటం గమనార్హం. ఈ ఫొటోను 2006లో ఎప్‌స్టీన్‌కు చెందిన లిటిల్ సెయింట్ జేమ్స్ ద్వీపంలో తీసినట్లు తెలుస్తోంది. అయితే ఆ మహిళలు హాకింగ్ సహాయకులని, చాలా కాలంపాటు వెంట ఉన్నారని ఆయన కుటుంబం తెలిపింది.

News February 26, 2026

బంధాలకు మిడ్‌లైఫ్‌ క్రైసిస్‌ ముప్పు

image

40 దాటిన తర్వాత చాలామందిని మిడ్ లైఫ్ క్రైసిస్ చుట్టుముడతాయి. పెళ్లి, పిల్లలు, వారి చదువుల తర్వాత దంపతుల్లో మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి వ్యక్తిగతంగా, మరి కొన్నిసార్లు బంధాలపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కెరీర్‌ను, కుటుంబాన్ని, ఇష్టాలను బ్యాలెన్స్‌ చేసుకోవాలంటున్నారు. ముందునుంచీ మనసు ఏం కోరుకుంటుందో దానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

News February 26, 2026

ఒకే జిల్లాకు భార్య కలెక్టర్, భర్త ఎస్పీ

image

TG: రాష్ట్రంలో ఇవాళ <<19241780>>ఐఏఎస్‌ల బదిలీ<<>> తర్వాత ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ కలెక్టర్‌గా స్నేహా శబరీశ్ నియమితులు కాగా అదే జిల్లాకు ఆమె భర్త శబరీశ్ ఎస్పీగా పనిచేస్తుండటం విశేషం. ఒకే జిల్లాకు భార్యాభర్తలు కలెక్టర్, ఎస్పీలుగా ఉండటం అరుదైన విషయం. కాగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న అద్వైత్ కుమార్ సింగ్ మరోచోటుకు బదిలీ అయ్యారు. స్నేహా గతంలో హనుమకొండ కలెక్టర్‌గా పనిచేశారు.

News February 26, 2026

FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర <<19241792>>మరోసారి<<>> తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.870 తగ్గి రూ.1,61,020కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.800 పతనమై రూ.1,47,600 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News February 26, 2026

731 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>హిందుస్థాన్ <<>>పెట్రోలియం కార్పొరేషన్ 731 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, BE/BTech, MBA, CA/CMA, MSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, CBT/రాత పరీక్ష/ టైపింగ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: hindustanpetroleum.com