News February 26, 2026

తొమ్మిది మందిలో ఒకరికి షుగర్ వ్యాధి: వైద్యులు

image

ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి షుగర్ ఉన్నా సగం మందికి ఆ విషయమే తెలియట్లేదని వైద్యులు చెబుతున్నారు. చక్కెర వల్లే షుగర్ వ్యాధి వస్తుందనుకోవడం అపోహ అని, వ్యాయామం చేయకపోవడంతో పాటు వంశపారంపర్య కారణాలు కూడా ఉంటాయని తెలిపారు. సన్నగా ఉన్నా, చిన్న వయసు వారైనా పరీక్షలు చేయించుకోవాలని.. బెల్లం, తేనె వాడినా షుగర్ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ట్యాబ్లెట్స్ వాడుతున్నా ఆహార నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.

News February 26, 2026

సునీల్ నాయక్‌పై అరెస్ట్ వారెంట్ జారీ

image

AP: బిహార్ క్యాడర్ IPS సునీల్ నాయక్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. Dy.స్పీకర్ RRRపై YCP ప్రభుత్వ హయాంలో CID కస్టడీలో హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ నమోదైన కేసులో గుంటూరు మొబైల్ కోర్టు ఈ వారెంట్‌ను ఇష్యూ చేసింది. పోలీసుల నోటీసులపై సునీల్ స్పందించకపోవడంతో ఇటీవల ఎస్పీ దామోదర్ బృందం బిహార్ వెళ్లగా అక్కడి హైకోర్టు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయలేదు. దీంతో GNT మొబైల్ కోర్టులో అరెస్ట్ వారెంట్ పిటిషన్ వేశారు.

News February 26, 2026

కోళ్లలో రక్తపారుడు వ్యాధిని ఎలా గుర్తించాలి?

image

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు లిట్టరును పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.

News February 26, 2026

RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>RITES<<>> లిమిటెడ్‌ 9 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, పీజీ (సివిల్ ఇంజినీరింగ్), ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. మార్చి 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rites.com

News February 26, 2026

గ్యాస్ సబ్సిడీ ఆగొద్దంటే వెంటనే ఈ పని చేయండి

image

మీకు గ్యాస్ సబ్సిడీ వస్తోందా? అయితే వెంటనే e-KYC పూర్తి చేయండి. మార్చి 31 లోపు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవ్వకపోతే సబ్సిడీ ఆగిపోయే ఛాన్స్ ఉంది. గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే మీ ఫోన్‌లో ఆయిల్ కంపెనీ యాప్, ‘Aadhaar FaceRD’ యాప్‌ సాయంతో ఇంటి నుంచే KYC చేసుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్ ద్వారా చేసే ఈ ప్రాసెస్ చాలా ఈజీ. డౌట్స్ ఉంటే 18002333555 టోల్ ఫ్రీ నంబర్‌ లేదా మీ డిస్ట్రిబ్యూటర్‌కు కాల్ చేయొచ్చు.

News February 26, 2026

గంగ-కావేరీ అనుసంధానం నా కోరిక: CBN

image

AP: గంగ-కావేరీ నదుల అనుసంధానం జరగాలన్నది తన కోరిక అని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నదుల అనుసంధానం కోసం మేం ప్రయత్నిస్తున్నాం. వంశధార నుంచి పెన్నా వరకు ఇది జరగాలి. అప్పుడే రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా పోతుంది’ అని అసెంబ్లీలో అన్నారు. నల్లమల సాగర్‌తో తెలుగు రాష్ట్రాలకు లాభమే తప్ప నష్టం లేదని చెప్పారు. తెలంగాణ వాళ్లు ఈ ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పొద్దని కోరారు.

News February 26, 2026

‘ది కేరళ స్టోరీ-2’ సినిమాపై స్టే

image

‘ది కేరళ స్టోరీ-2’ సినిమా విడుదలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. ఇందులో వివాదాస్పద అంశాలున్నాయని పేర్కొంది. మూవీ చూడకుండానే CBFC సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఈ సినిమా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ దాఖలైన పిటిషన్లపై రెండు రోజుల క్రితం HC విచారణ జరిపింది. తాము సినిమా చూశాకే నిర్ణయం చెబుతామని తెలిపింది. ఈక్రమంలోనే సినిమా చూసి స్టే ఇచ్చింది.

News February 26, 2026

రేపటి వరకు ఈ జిల్లాల్లో వర్షాలు!

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం 8.30 గంటల వరకు తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మీ ప్రాంతంలో ఇవాళ వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.

News February 26, 2026

37 రాజ్యసభ స్థానాలు.. నామినేషన్లు షురూ

image

దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. చివరి తేదీ మార్చి 5. నిర్ణీత స్థానాల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో మార్చి 16న 9AM నుంచి 5PM వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. మహారాష్ట్ర-7, TN-6, బిహార్-5, బెంగాల్-5, ఒడిశా-4, అస్సాం-3, <<19214239>>TG-2<<>>, ఛత్తీస్‌గఢ్-2, హరియాణా-2, హిమాచల్‌-ఒక సీటుకు ఎన్నికలు జరగనున్నాయి.

News February 26, 2026

భారత్ ప్లేయింగ్-11 అంచనా.. ఎలా ఉంది?

image

T20WC: భారత్ సెమీస్ వెళ్లాలంటే నేడు జింబాబ్వేతో తప్పక గెలవాల్సిందే. రా.7 గం.కు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ప్లేయింగ్-11 ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. కొందరు స్పోర్ట్స్ అనలిస్టుల ప్రకారం తుది జట్టు..
భారత్: అభిషేక్, ఇషాన్, సంజూ శాంసన్, సూర్య (C), తిలక్ వర్మ, హార్దిక్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
> టీమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.