News February 26, 2026

NCERT పుస్తకంపై మోదీ అసంతృప్తి!

image

NCERT 8వ తరగతి పుస్తకంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై PM మోదీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జవాబుదారీతనం తీసుకురావాలని ఆదేశించారని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు NDTV తెలిపింది. ఇదంతా ఎవరు చూసుకుంటున్నారని, 8వ తరగతి పిల్లలకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ఎందుకు బోధించాలని ప్రశ్నించినట్లు సమాచారం. ఆ పుస్తకాన్ని CJI <<19243239>>నిషేధించడం<<>> తెలిసిందే.

News February 26, 2026

గతేడాది ఎంతమంది విడాకులు తీసుకున్నారంటే?

image

భారతదేశంలో విడాకుల కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గతేడాది నమోదైన 8.27 లక్షల కేసుల్లో మహారాష్ట్ర (18.7%), కర్ణాటక(11.7%)లతో పాటు తెలంగాణ (6.7%) టాప్-6లో నిలిచింది. 33.2% మంది పరస్పర అంగీకారంతో విడిపోగా.. మిగిలినవి క్రూరత్వం, గృహహింస, వివాహేతర సంబంధాల వంటి కారణాలతో జరిగాయి. ఆర్థిక స్వతంత్రతతో మహిళలే ఎక్కువగా విడాకులు కోరుకుంటున్నారు. 40% వివాహాలు మొదటి మూడేళ్లలోనే పెటాకులవుతున్నాయి.

News February 26, 2026

EdCIL(ఇండియా) లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>EdCIL<<>>(ఇండియా) లిమిటెడ్‌ 7 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BTech/MTech, BE/LLB/LLM, డిగ్రీ( స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ అర్హత గలవారు మార్చి 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.70,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://edcilindia.co.in

News February 26, 2026

DGCA కొత్త రూల్స్.. 48 గంటల్లోగా..!

image

విమాన టికెట్ల రిఫండ్ రూల్స్‌లో DGCA సవరణలు చేసింది. టికెట్ కొన్న 48 గంటల్లోగా క్యాన్సిల్/మార్పులు చేస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు కట్టక్కర్లేదని చెప్పింది. అలాగే టికెట్లు క్యాన్సిలేషన్ డబ్బులను 14 రోజుల్లో రిఫండ్ చేయాలంది. అటు టికెట్లు బుక్ చేసుకున్న 24గంటల్లో పేర్లలో కరెక్షన్ చేసుకోవడానికి ఎలాంటి ఫీజ్ తీసుకోవద్దని ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. అనారోగ్య కారణాలతో కాన్సిల్ చేసుకున్నా ఇవి వర్తిస్తాయంది.

News February 26, 2026

బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ – లక్షణాలు

image

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్‌లో పంటకు సరైన ధర దక్కదు.

News February 26, 2026

BELలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>), సెంట్రల్ రీసెర్చ్ లాబోరేటరీ(ఘజియాబాద్)లో 10 రీసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. PhD(AI, కమ్యూనికేషన్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ) అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఏప్రిల్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in

News February 26, 2026

అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్ను: KTR

image

TG: దేశంలో అప్పుడు ఒరిజినల్ గాంధీ ఉండేవారని, ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. ‘ఖమ్మం జిల్లాలో ఇళ్ల కూల్చివేత పాపం ముగ్గురు మంత్రులదే. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్నేశారు. జిల్లా మంత్రులు మాయగాళ్లు.. చిచ్చుపెడుతున్నారు. పేదలకు ఇళ్లు కట్టించకపోగా ఇళ్లను కూల్చివేయడమేనా ఇందిరమ్మ రాజ్యం? మా ప్రభుత్వం వచ్చాక ఇదే స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తాం’ అని తెలిపారు.

News February 26, 2026

భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు

image

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో కీలక ఒప్పందాలు కుదిరాయి. యూపీఐ చెల్లింపులు, విద్య, వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏఐ, వాణిజ్యం, సైబర్ సెక్యూరిటీ, హెరిటేజ్, సర్వీస్ సెక్టార్లు సహా మొత్తం 27 రంగాలపై మోదీ-నెతన్యాహు సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం, ఇండియా-ఇజ్రాయెల్ మధ్య 100 ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

News February 26, 2026

వెస్టిండీస్ స్కోరు ఎంతంటే..

image

T20 WC: సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 పోరులో వెస్టిండీస్ 176-8 పరుగులు చేసింది. 83కే 7 వికెట్లు కోల్పోయిన దశలో షెఫర్డ్(52*), హోల్డర్(49) ముందుండి నడిపించారు. ఎంగిడి 3, బోష్, రబాడ తలో 2 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా టార్గెట్ 177. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే టీమ్ ఇండియా సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. ఒకవేళ ఓడితే మాత్రం జింబాబ్వే, వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

News February 26, 2026

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ముగిశాయి. రోజంతా ఒడుదొడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 27 పాయింట్ల నష్టంతో 82,249 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 25,497 వద్ద సెటిలయ్యాయి. సెన్సెక్స్‌లో BEL, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, ఎయిర్‌టెల్ షేర్లు లాభపడ్డాయి. ట్రెంట్, ఎటర్నల్, పవర్ గ్రిడ్, HDFC బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి.