News February 26, 2026

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

image

టారిఫ్‌ల విషయంలో <<19195677>>ఎదురుదెబ్బ<<>> తిన్న US అధ్యక్షుడు ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. అక్రమ వలసదారులను వారి దేశాలకు కాకుండా ఇతర దేశాలకు తరలించడాన్ని ఫెడరల్ కోర్టు తప్పుపట్టింది. వారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం సరికాదని, చట్టబద్ధత కూడా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడానికి అవకాశమిచ్చింది.

News February 26, 2026

తీర్థం ఎందుకు తీసుకోవాలి?

image

తీర్థం తీసుకోవడం వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య కారణాలున్నాయి. తీర్థం సకల పాపాలను హరించి, అకాల మరణం కలగకుండా కాపాడుతుందని నమ్మకం. పూజలో ఉంచే తీర్థం రోగనిరోధక శక్తిని పెంచి, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఇది మంత్రోక్తమైన దైవ శక్తిని కలిగి ఉంటుందని పండితులు మాట. ‘తీర్థం తీసుకుంటే మనసు ప్రశాంతమవుతుంది. ఆత్మశుద్ధి కలుగుతుంది. ఏ గుడికి వెళ్లినా తీర్థం తప్పక తీసుకోవాలి’ అంటున్నారు.

News February 26, 2026

APPLY NOW: JIPMERలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

image

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్& రీసెర్చ్(<>JIPMER<<>>)లో 26 జూనియర్ రెసిడెంట్ పోస్టులకు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. MBBS అర్హత గల అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఫిబ్రవరి 28న రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,10,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://jipmer.edu.in

News February 26, 2026

విజయ్-రష్మిక పెళ్లి విందులో పోర్క్ కర్రీ!

image

విజయ్-రష్మిక పెళ్లి విందులో అతిథులకు పసందైన వంటకాలు రెడీ చేశారు. మెనూలో తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, నాటుకోడి పులుసు, గారెలు, పప్పు, పచ్చిపులుసు, ఓల్డ్ సిటీ కీమా సమోసాలు ఉన్నాయి. ఇక కర్ణాటక స్పెషల్ బిసిబెలే బాత్, పంది (పోర్క్) కర్రీ, మైసూర్ పాక్ వడ్డించనున్నట్లు సమాచారం. కాగా తాను ‘కొడగు’ సంప్రదాయమైన పంది కూర తింటానని గతంలో రష్మిక చెప్పడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

News February 26, 2026

వంటింటి చిట్కాలు

image

* బత్తాయి, నారింజ పండ్లను మైక్రోఓవెన్‌లో కొన్ని సెకన్ల పాటు ఉంచితే తొక్క సులభంగా వస్తుంది.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు/బెల్లం వేస్తే చేదు తగ్గుతుంది.
* అరటిపండ్లను ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెడితే నల్లగా మారవు.
* ఐస్ క్యూబ్స్ వేసిన నీళ్లలో ఉడికించిన బంగాళదుంపలు వేసి, తర్వాత తొక్కలు తీస్తే సులువుగా వస్తాయి.
* పోపు గింజలు వేయించి నిల్వ చేస్తే పాడవకుండా ఉంటాయి.

News February 26, 2026

షాకింగ్.. కుక్క నాకడంతో కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ!

image

రేబీస్ సోకిన కుక్కలు కరవడం వల్లే కాకుండా పెంపుడు కుక్కలు నాకినా కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు. UKకు చెందిన మంజీత్ సంఘ(56) చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. ఆస్పత్రిలో 32 వారాలు ఉండి, పలుమార్లు గుండెపోట్లను ఎదుర్కొని కాళ్లు, చేతులను కోల్పోయి ఇంటికి చేరారు. ఈమె కాలికి ఉన్న ఓ గాయాన్ని కుక్క నాకడంతో ‘సెప్సిస్’ వ్యాధి వచ్చి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఇది అరుదైనప్పటికీ జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

News February 26, 2026

సెప్సిస్ వ్యాధి ఎలా సోకుతుంది?

image

శరీరంలో వచ్చిన ఇన్ఫెక్షన్(బ్యాక్టీరియా/వైరస్/ఫంగస్) సకాలంలో తగ్గకపోతే సెప్సిస్‌గా మారుతుంది. రోగనిరోధక వ్యవస్థ సొంత కణజాలంపైనే దాడి చేయడంతో రక్తం విషతుల్యమై ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు, ఒక్కోసారి మరణానికి దారితీస్తుంది. చలి, జ్వరం, ఫాస్ట్ బ్రీతింగ్, చర్మం రంగుమారడం, లోబీపీ దీని లక్షణాలు. యాంటీబయాటిక్స్, సర్జరీ ద్వారా చికిత్స చేస్తారు. కుక్కలు మనుషుల గాయాలపై నాకడం వల్ల కూడా ఈ వ్యాధి రావొచ్చు.

News February 26, 2026

మార్చి 1 నుంచి సెస్ వసూలు.. పెరగనున్న వాహనాల ధరలు

image

TG: మార్చి 1 నుంచి నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయనున్నట్లు రవాణాశాఖ GO జారీ చేసింది. బైకులకు రూ.2వేలు, ఫోర్ వీలర్లకు రూ.5వేలు, ఇతర వాహనాలకు రూ.10వేలు సెస్‌గా నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ సమయంలో దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో TG ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం సమకూరనుంది. రూల్స్ ప్రకారం ఈ నిధులను రోడ్డు ప్రమాదాల నివారణకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.

News February 26, 2026

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ భువనేశ్వర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

image

భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ 7 అసిస్టెంట్ ప్రొఫెసర్/రీడర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. థియోరిటికల్ హై ఎనర్జీ ఫిజిక్స్, థియోరిటికల్ కండెన్స్ మ్యాటర్ ఫిజిక్స్, ఎక్సపర్మెంటల్ కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్ విభాగంలో పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. రీడర్‌కు 38ఏళ్లు. వెబ్‌సైట్: https://www.iopb.res.in

News February 26, 2026

గొర్రె పిల్లలకు వివిధ దశల్లో ఇవ్వాల్సిన ఆహారం

image

గొర్రె పిల్లల పెరుగుదలకు అందించాల్సిన ఆహారంపై వెటర్నరీ నిపుణుల సూచనలు
☛ పిల్ల పుట్టిన మొదటి 3 రోజుల వరకు: తల్లితో పాటు పిల్లను ఉంచి.. పిల్ల శరీర బరువులో 20 శాతం జున్నుపాలను ప్రతి రోజూ అందించాలి.
☛ తొలి 2 వారాల వరకు: పిల్లలను పూర్తిగా తల్లిపాల మీదనే ఉంచాలి. పుట్టిన పిల్ల శరీర బరువు 3 కిలోలు ఉంటే రోజుకి 600ml పాలు అందించాలి. తల్లి వద్ద సరిపడినన్ని పాలు లేకపోతే ఆవు లేదా గేదె పాలను అదనంగా అందించాలి.