India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేషనల్ ఆయుష్ మిషన్‌లో 20 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండి వరకే అవకాశం ఉంది. ఉద్యోగాన్ని బట్టి పీజీ డిప్లొమా పబ్లిక్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్/మేనేజ్‌మెంట్/MBA, BAMS/BUMS/BHMS/BSMS/BYNS, MCom, ICWA, CA, MCA, BCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 21 నుంచి 60ఏళ్లు మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://ayush.gov.in

BSNL డైరెక్టర్ వివేక్ బంజల్ 4 పేజీల గొంతెమ్మ కోర్కెల చిట్టాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాగ్‌రాజ్ వ్యక్తిగత పర్యటన కోసం అండర్‌వేర్, కొత్త చెప్పులు, దువ్వెన, ఆయిల్, డ్రైఫ్రూట్స్, టవల్స్ సిద్ధం చేయాలని, 50 మంది అధికారులు తన కోసం ఉండాలని ఆదేశించారు. ఈ చిట్టా వైరలవడంతో కేంద్రం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎంత ఉన్నతాధికారైతే మాత్రం ఇంత అధికార దర్పం అవసరమా అని నెటిజన్లు ఫైరవుతున్నారు.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.210 తగ్గి రూ.1,61,680కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పతనమై రూ.1,48,200 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

APలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. MAR 7న అనకాపల్లి(D) నక్కపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి PM మోదీ, CM CBN, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ₹1.35L Crతో 2 దశల్లో స్టీల్‌ప్లాంట్‌ను నిర్మించేందుకు ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.

45 మంది IAS అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
*పంచాయతీరాజ్ స్పెషల్ CSగా సంజయ్ కుమార్
*ఫైనాన్స్ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్
*ఐటీ, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీగా N.శ్రీధర్
*జనగామ కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా
*యాదాద్రి కలెక్టర్‌గా అనురాగ్ జయంతి
*గద్వాల కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా
*కరీంనగర్ కలెక్టర్‌గా చిత్రా మిశ్రా
*భద్రాద్రి కలెక్టర్‌గా అంకిత్

<

గర్భిణులు, బాలింతలకీ అదనపు పోషకాలు తప్పనిసరి. ఈ ఆహారమే బిడ్డ శారీరక, మానసిక పెరుగుదల, ఇమ్యునిటీని ప్రభావితం చేస్తుందంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ తొలి 28 రోజుల్లో తీసుకునే ఫోలిక్ ఆమ్లం బిడ్డలో నాడీలోపాలు రాకుండా చేస్తుంది. రక్తకణాల నిర్మాణానికి ఐరన్, దంతాలు, ఎముకల నిర్మాణానికి విటమిన్ D, కాల్షియం అవసరం, విటమిన్ A, అయొడిన్‌లు శిశువు మెదడు, శారీరక పెరుగుదలకి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

అవును మీరు విన్నది నిజమే. తెలంగాణలో విద్యుత్ శాఖలో పనిచేస్తోన్న సీనియర్ స్వీపర్ జీతం రూ.2లక్షల వరకూ ఉందని CS రామకృష్ణారావు తెలిపారు. వరుస PRCల వల్లే జీతం ఇంతగా పెరిగిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం ప్రతి నెలా రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిన్న జరిగిన రివ్యూ మీటింగ్‌లో వెల్లడించారు. 2014లో ఇది కేవలం ₹1,500 కోట్లుగా ఉండేదని వివరించారు.

AP: శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న దళారులు, నకిలీ వెబ్‌సైట్లపై TTD విజిలెన్స్ అప్రమత్తమైంది. తిరుమల చిత్రాలు, TTD పేరును ఉపయోగించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించింది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, ఫేక్ వెబ్‌సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసు నమోదు చేసింది. https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే సేవలు పొందాలని సూచించింది.

ధన్వంతరి గాయత్రీ మంత్రం అతి పవిత్రమైంది. ఇది మన బుద్ధిని ప్రేరేపించి, జీవశక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ఈ వాక్యాలను పఠిస్తే అనంత శక్తి సొంతమవుతుందని పండితులు అంటున్నారు. మానసిక స్పష్టత, దివ్యమైన మార్గదర్శకత్వం కోసం దీన్ని పఠించాలని చెబుతున్నారు. మంత్రం: ఓం తత్పురుషాయ విద్మహే| అమృత కలశ హస్తాయ ధీమహి| తన్నో ధన్వంతరి ప్రచోదయాత్||
Sorry, no posts matched your criteria.