News February 26, 2026

సరైన నిద్రలేకపోతే అందానికి దెబ్బ

image

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ నిద్రలేమి వేధిస్తోంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇది అందాన్నీ దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్రలేకపోతే శరీరం పీహెచ్ దెబ్బతిని చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. దీంతో వయసు పైబడినట్లు కనిపిస్తారు. అలాగే డార్క్ సర్కిల్స్, కళ్ల వాపు, ముడతలు, జుట్టు రాలిపోవడం వంటివి కూడా వస్తాయని చెబుతున్నారు.

News February 26, 2026

‘కాళేశ్వరం’ రుణాలు.. తగ్గిన వడ్డీ భారం

image

TG: కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు గతంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ₹71,566Cr రుణం విడుదలైంది. వార్షిక వడ్డీ 9.45-10.90%. ఇప్పటికే కొంత చెల్లించగా ఇంకా ₹68,273Cr బాకీ ఉంది. వడ్డీని 7.5 శాతానికి తగ్గించడానికి కేంద్రం అంగీకరించడంతో ఒకేసారి ₹33,574Crను ప్రభుత్వం చెల్లించింది. మిగతా మొత్తాన్ని దీర్ఘకాలిక వాయిదాల కింద చెల్లిస్తామని తెలిపింది.

News February 26, 2026

శ్రీవారికి నగదే కాదు ‘ముడుపు పత్రాలు’ సమర్పించవచ్చు!

image

AP: తిరుమలలో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు కొత్త విధానాన్ని TTD అమలు చేయనుంది. త్వరలో ‘శ్రీవారి ముడుపు పత్రం’ పేరుతో ప్రత్యేక పత్రాలను జారీ చేయనుంది. ₹100 నుంచి ₹లక్ష వరకు UPI, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసి హుండీలో సమర్పించవచ్చు. క్యాష్‌లెస్ లావాదేవీలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి జరిగే TTD బోర్డు మీటింగ్‌లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

News February 26, 2026

BELలో 72 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>), నవీ ముంబైలో 72 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హత గలవారు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. BE/BTech(ECE,ME), BSc, BCom, BA, డిప్లొమా అర్హతగల వారు అర్హులు. గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌లకు గరిష్ఠ వయసు 25ఏళ్లు కాగా, ఐటీఐ అప్రెంటిస్‌లకు 21ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

News February 26, 2026

ప్రకృతి సేద్యంలో బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

image

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.

News February 26, 2026

గురువార వ్రతాన్ని ఎలా చేయాలి?

image

సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. తలస్నానం చేయకూడదు. బట్టలు ఉతకకూడదు. గురు గ్రహానికి ఇష్టమైన పసుపు దుస్తులు ధరించాలి. విష్ణుమూర్తి లేదా బృహస్పతి పటాన్ని పసుపు గంధం, పుష్పాలతో అలంకరించాలి. దీపారాధనకు ఆవు నెయ్యి వాడాలి. పసుపు రంగులో ఉండే శనగపప్పు, బెల్లం, అరటిపండ్లు, శనగపిండితో చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం పూజ తర్వాత ఉప్పు లేని ఆహారాన్ని ఓసారి తీసుకోవాలి.

News February 26, 2026

ఏప్రిల్ నుంచి కొత్త పెట్రోల్ రూల్

image

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) సేల్స్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇంజిన్ పనితీరు దెబ్బతినకుండా ఉండేందుకు కనీసం 95 రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ (RON) ఉండాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. దీనివల్ల కాలుష్యం 30% వరకు తగ్గడమే కాకుండా రైతులకు మేలు జరుగుతుంది. అయితే పాత వాహనాల్లో మైలేజీ 3-7% తగ్గే అవకాశం ఉంది. 2023 తర్వాత తయారైన వాహనాలకు ఈ ఇంధనం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

News February 26, 2026

నేడు పిడుగులతో కూడిన వర్షాలు

image

AP, TGలో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వానలు కురుస్తున్నాయి. వేసవిలో కురిసే రుతుపవన ముందస్తు వర్షాలు ఈసారి ముందుగానే పడ్డాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ద్రోణి ప్రభావంతో ఇవాళ APలోని శ్రీకాకుళం, ఉ.గో, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని IMD వెల్లడించింది. TGలోని రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

News February 26, 2026

బ్రహ్మాస్త్రం తయారీ.. ఎలా ఉపయోగించాలి?

image

వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను మెత్తగానూరి ముద్దలా తయారు చేయాలి. ఒక పాత్రలో 10 లీటర్ల ఆవు మూత్రం, ఆకుల ముద్దను వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి బాగా ఉడికించి పొయ్యి మీద నుంచి దించి.. 48 గంటల పాటు చల్లారనివ్వాలి. తర్వాత గుడ్డతో వడకడితే బ్రహ్మాస్త్రం సిద్ధమైనట్లే. ఎకరాకు 100 లీటర్ల నుంచి 2 లేదా రెండున్నర లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారీ చేయాలి. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.

News February 26, 2026

10 కోట్ల ఫాలోవర్లతో ఇన్‌స్టాలో మోదీ రికార్డ్

image

ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల ఫాలోవర్స్ మార్క్‌ని దాటిన తొలి వరల్డ్ లీడర్‌గా మోదీ రికార్డు క్రియేట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 4.3 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో (1.5 కోట్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూలా (1.44 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర నేతలతో పోలిస్తే మోదీకి రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉండటం విశేషం.