India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెల్ల చేపల్లో శంకుపూత వ్యాధి ఎదుగుదల లోపిస్తోంది. దీని నివారణకు ఎకరా చేపల చెరువులో 80-100 kgల ఉప్పును చల్లాలని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ఎకరా చేపల చెరువుకు కాపర్ సల్ఫేట్ ఒక KG చల్లాలి. చేపల పెరుగుదల బాగుండాలంటే ఎకరాకు పిల్లల మోతాదు 3 వేలకు మించకూడదు. 100KGల తవుడుకు 30-40KGల చెక్క కలిపి మేతగా ఇస్తే చేపల పెరుగుదల బాగుంటుంది.

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(<

ఇజ్రాయెల్ ఏర్పడక ముందు యూదులకు ప్రపంచమంతా వివక్ష ఎదురైంది. ముఖ్యంగా యూరప్‌లో లక్షలాది మందిని ఘోరంగా చంపేశారు. కానీ ఇండియాలో యూదులకు ఎలాంటి వ్యతిరేకత ఎదురుకాలేదు. 2,000 ఏళ్లుగా మన సమాజంలో భాగమయ్యారు. అలాగే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో (1918) ఒట్టోమన్ సామ్రాజ్యంలోని హైఫా నగరానికి బ్రిటీష్ భారత సైనికులు ప్రాణాలు అర్పించి విముక్తి కలిగించారు. అందుకే మనమంటే వాళ్లకు ఎనలేని అభిమానం, గౌరవం.

అమ్మాయిల్లో <<19228673>>సర్వైకల్ క్యాన్సర్<<>> ముప్పును తప్పించేందుకు కేంద్రం నడుంబిగించింది. ఈ నెల 28న దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV టీకాల పంపిణీ జరగనుంది. జాతీయస్థాయిలో ప్రధాని మోదీ, APలో సీఎం చంద్రబాబు, TGలో మంత్రి రాజనర్సింహ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో దశలవారీగా దాదాపు 6.75 లక్షల మందికి పంపిణీ చేస్తారు.

వేసవి ఉష్ణోగ్రతలతో పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందని అందరూ భావించేవారు. కానీ సైంటిస్టుల అధ్యయనంలో విభిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. 15,581 మంది పురుషుల(18-45ఏళ్లు) వీర్య నమూనాలను విశ్లేషించగా నాణ్యత సమ్మర్(జూన్, జులై)లో అధికంగా, వింటర్(DEC, JAN)లో తక్కువగా ఉందని తేలింది. ఈ రిపోర్టుతో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న జంటలకు, ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్‌కు మెరుగైన రూట్‌మ్యాప్ లభిస్తుంది.

NIT వరంగల్‌లో 39 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.1000. స్క్రీనింగ్/స్కిల్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/

సాంద్ర పద్ధతిలో గొర్రెలు ఎప్పుడూ పాకల్లోనే ఉంటాయి. వీటికి నిర్ణీత మోతాదులో పచ్చిగడ్డి, దాణాను ఏర్పాటు చేయాలి. పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి. జీవాల లెక్కింపు, మందులు, టీకాలు వేయడం ఈ విధానంలో సులభంగా ఉంటుంది. పశుగ్రాసం వృథాకాదు. అయితే పాకలను పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్లలోనికి గాలి వెలుతురు సరిగా ప్రసరించేలా చూడాలి. పచ్చి పశుగ్రాసాలను చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా చేసి దాణా తొట్లలో అందించాలి.

గురువారం బృహస్పతికి అంకితం. ఆయన జ్ఞానం, ఐశ్వర్యం, సంతానం, అదృష్టాలను ప్రసాదిస్తారు. జాతకంలో గురు దోషం, ఆర్థిక ఇబ్బందులున్నవారు గురువారం రోజున గురువార వ్రతాన్ని ఆచరిస్తారు. బృహస్పతిని విష్ణువు స్వరూపంగా భావిస్తారు కాబట్టి వ్రతంలో బాగంగా ఆయనను కూడా పూజించవచ్చు. తద్వారా మనసులో కోరికలు నెరవేరి, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని నమ్మకం. కెరీర్ సమస్యలు పోయి, అవివాహితులకు త్వరగా వివాహం జరుగుతుందట.

తెలుగు రాష్ట్రాల మధ్య తొలి ఫోర్ లేన్ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే(NH-365BG) పనులు దాదాపు పూర్తయ్యాయి. TGలోని ఖమ్మం నుంచి APలోని దేవరపల్లి(తూ.గో.) వరకు 162KMల రహదారిని రూ.4,451 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్-వైజాగ్ ప్రయాణ సమయం 12 గంటలు ఉండగా ఇది అందుబాటులోకి వస్తే టైమ్ భారీగా తగ్గనుంది. ఈ హైవేను ప్రధాని మోదీ మేలో ప్రారంభించనున్నారు.

ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మిస్తోన్న 4 లేన్ల NH-365BGకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ హైవేపై అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కింద ప్రతి 2KMలకు ఒకటి చొప్పున 95 CCTVలు ఉంటాయి. ఈ రూట్‌లో ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది. రహదారి మొత్తం సోలార్ లైట్లు ఉంటాయి. 5KMకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఈ రోడ్డులో ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీ చెల్లించాలి.
Sorry, no posts matched your criteria.